ఆరు నెలలు నుంచి పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలంటే.. !

Baby Food : పుట్టిన దగ్గరనుంచి 6 నెలల వరకు పిల్లలకు తల్లిపాలనే ఇవ్వాలి ఆ తర్వాత మాత్రం తల్లిపాలతో పాటు కొంచెం కొంచెం గణాహారాన్ని అలవాటు చేయాలి అయితే పిల్లలకు

ఆరు నెలలు నుంచి పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలంటే.. !
6 months baby food


పుట్టిన దగ్గరనుంచి 6 నెలల వరకు పిల్లలకు తల్లిపాలనే ఇవ్వాలి ఆ తర్వాత మాత్రం తల్లిపాలతో పాటు కొంచెం కొంచెం గణాహారాన్ని అలవాటు చేయాలి అయితే పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి అంటే..

తల్లులు పిల్లల కడుపు నింపడం మీద కంటే వారికి పోషకాహారం అందించాలి అనే అంశం మీదే ఎక్కువ దృష్టి పెట్టాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు చిన్నతనం నుంచే అన్ని రకాల రుచులను వారికి అలవాటు చేయడం వల్ల శారీరక మానసిక ఎదుగుదల బాగుంటుందని తెలుస్తోంది.. 

పిల్లలకు ఆరు నెలలు దాటిన తర్వాత అన్న ప్రసన్న కచ్చితంగా చేయించాలి కొందరు తల్లులు తమ పాలు సరిపోతున్నాయని అపోహలో 8, 9 నెలలు వచ్చేంతవరకు కూడా ఆహారాన్ని అందించరు కానీ ఇలా చేయడం ఎంత మాత్రం సరైన పద్ధతి కాదు.. ఎందుకంటే ఆరు నెలలు దాటిన దగ్గర నుంచి శిశువు ఎదుగుదల వేగం అందుకుంటుంది బోర్లా పడటం, అటూ ఇటూ కదలటం, సంవత్సరం వయసు వచ్చేటప్పటికి నడవడం అలవాటు చేసుకుంటారు.. ఈ వయసు పిల్లలకి పప్పు అన్నం కలిపి తినిపించాలి వీటిని మెత్తగా కలిపి వీలైతే కొంచెం నెయ్యి పోసి తినిపించడం వల్ల శరీరానికి పోషకాలు అందుతాయి పప్పులో ఉండే ప్రోటీన్స్ పిల్లలు ఎదుగుదలకు సహాయ పడతాయి.. 

అలాగే కొందరు తల్లులు అన్ని రకాల పప్పులు కలిపి ఉగ్గుల తయారు చేసే పిల్లలకు తినిపిస్తూ ఉంటారు ఇలా చేయాలి అనుకునేవారు ఒక పూట పప్పు అన్నం పెట్టి మరొక పూట ఉగ్గు తినిపించడం వల్ల పిల్లల అరుగుదల కూడా సక్రమంగా ఉంటుంది.. అలాగే పెరుగు అన్నం కూడా తినిపించడం అలవాటు చేయాలి ఇది కూడా అరుగుదలకు మంచిగా పని చేస్తుంది.  వీటితో పాటు కచ్చితంగా తల్లిపాలను కూడా ఇస్తూ ఉండాలి.. వీలైతే రెండేళ్లు వచ్చేంతవరకు పిల్లలకు పాలు తాగించడం తప్పనిసరి.. 

చిన్నపిల్లలు అరటిపండును తినటానికి తేలికగా ఉంటుంది ఇందులో ఐరన్ మెగ్నీషియం పొటాషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి పిల్లల్ని మలబద్ధకం సమస్య నుంచి దూరం చేస్తాయి అలాగే చిన్న ఆహారం త్వరగా జీర్ణం అవడానికి అరటిపండు సహాయపడుతుంది అలా అని ఎక్కువగా తినిపించకుండా కొంచెం కొంచెంగా వినిపిస్తూ ఉండాలి.  

అలాగే ఏ కాలంలో దొరికే పండ్లను ఆ కాలంలో ఇంట్లోనే ఐస్ పంచదార వేయకుండా మెత్తని జ్యూస్ చేసి పిల్లలకు ఇవ్వాలి ఇలా చేయడం వల్ల సరైన పోషకాలు అందుతాయి అలాగే ఆపిల్ను ఉడికించి తినిపించవచ్చు.  అలాగే పండ్లు పప్పులతో చేసిన సూప్స్ పిల్లలకు తాగించవచ్చు అయితే ఇందులో ఎలాంటి కారాలు మసాలాలు అధిక స్థాయిలో ఉప్పులు దట్టించకూడదు..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.