Cod Liver oil : కాడ్‌ లివర్‌ ఆయిల్‌తో కీళ్లనొప్పులు, గుండెజబ్బులు కతమ్‌..!

Cod liver ఆయిల్‌. ఇది పోషకాలతో కూడిన చేపనూనె.దీంతో వాపులు తగ్గుతాయి. కీళ్ల నొప్పులు ఉండవు. బీపీ కంట్రోల్లో ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మరి Cod Liver oil వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో చూద్దామా..!

Cod Liver oil : కాడ్‌ లివర్‌ ఆయిల్‌తో కీళ్లనొప్పులు, గుండెజబ్బులు కతమ్‌..!
Arthritis and heart disease get rid of cod liver oil


చేపలు ఆరోగ్యానికి చాలా మంచివి.. వీటిని వారానికి రెండుమూడు సార్లు తిన్నా ఎలాంటి ఇబ్బంది ఉండదని నిపుణులు అంటుంటారు. చేపల నుంచే తీసే ఆయిల్‌ ఇంకా ఆరోగ్యవంతమైనది తెలుసా..? Cod liver ఆయిల్‌. ఇది పోషకాలతో కూడిన చేపనూనె. కాడ్‌ ఫిష్‌ అనే చేపల లివర్‌ నుంచి ఈ ఆయిల్‌ను తీస్తారు. అందుకనే దీనికి ఆ పేరు వచ్చింది. ఈ ఆయిల్‌ సప్లిమెంట్లను డాక్టర్లు రోగులకు సూచిస్తుంటారు. ఈ సప్లిమెంట్లలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. అలాగే వీటిలో అధిక మొత్తాల్లో Vitamin A, Vitamin D లు ఉంటాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల వల్ల అనేక లాభాలు కలుగుతాయి. దీంతో వాపులు తగ్గుతాయి. కీళ్ల నొప్పులు ఉండవు. బీపీ కంట్రోల్లో ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మరి కాడ్‌ లివల్‌ ఆయిల్‌ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో చూద్దామా..!

ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఎముకల సాంద్రత పెరుగుతుంది. ఈ సప్లిమెంట్లలో ఉండే విటమిన్‌ డీ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వయస్సు మీద పడడం వల్ల వచ్చే ఎముకల సమస్యలను తగ్గిస్తుంది.  
ఆర్థరైటిస్‌ నొప్పులు ఉన్నవారు ఈ సప్లిమెంట్లు తీసుకుంటే మంచిది. దీంతో వాపులు, నొప్పులు తగ్గుతాయి.
ఈ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. కంటి చూపు పెరుగుతుంది. గ్లకోమా వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
కాడ్‌ లివర్‌ ఆయిల్‌ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల గుండె జబ్బులు రావు.. ట్రై గ్లిజరైడ్స్‌ స్థాయిలు తగ్గుతాయి. బీపీ నియంత్రణలో ఉంటుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌) పెరుగుతుంది.
కాడ్‌ లివర్‌ ఆయిల్‌ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల శరీరంలో ఎలాంటి వాపులు ఉన్నా ఈజీగా తగ్గుతాయి. దీంతో గుండె జబ్బులు, డయాబెటిస్‌, బీపీ రాకుండా అడ్డుకోవచ్చు. ఫ్రీ ర్యాడికల్స్‌ నాశనం అవుతాయి.
కాడ్‌ లివర్‌ ఆయిల్‌ సప్లిమెంట్లలో విటమిన్లు డి, ఏ లు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.
ఈ సప్లిమెంట్లలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, Vitamin A, Vitamin D, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల ఫ్రీ ర్యాడికల్స్‌ నాశనమవుతాయి. తీవ్రమైన అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
కాడ్‌ లివర్‌ ఆయిల్‌ సప్లిమెంట్లు లిక్విడ్‌, కాప్సూల్‌ ఫార్మాట్లలో లభిస్తున్నాయి. లిక్విడ్‌ అయితే రోజుకు 1 లేదా 2 టీస్పూన్లు తీసుకోవాలి. అదే కాప్సూల్స్‌ అయితే రోజుకు ఒకటి చాలు. బీపీ లేదా రక్తాన్ని పలుచన చేసే మందులను వాడేవారు, గర్భిణీలు డాక్టర్‌ సలహా మేరకు మాత్రమే ఈ సప్లిమెంట్లను వాడాలి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.