Asthma : ఆస్తమా లక్షణాలు.. కారణాలు..  చికిత్స.. 

Asthma  : చలికాలంలో ముఖ్యంగా వేధించే ఆరోగ్య సమస్యల్లో ఒకటి ఆస్తమా ఈ సమస్యతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 24 కోట్ల మంది బాధపడుతున్నట్టు సమాచారం ముఖ్యంగా ఇది చిన్నపిల్లల్లో

Asthma : ఆస్తమా లక్షణాలు.. కారణాలు..  చికిత్స.. 
Asthma


Asthma  : చలికాలంలో ముఖ్యంగా వేధించే ఆరోగ్య సమస్యల్లో ఒకటి ఆస్తమా ఈ సమస్యతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 24 కోట్ల మంది బాధపడుతున్నట్టు సమాచారం ముఖ్యంగా ఇది చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది 11 సంవత్సరాల లోపు చిన్నపిల్లల్లో ఐదు నుంచి 15% మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్టు తెలుస్తోంది..

కారణాలు.. 

శ్వాస కోస వ్యాధుల్లో ఆస్తమా కూడా ఒకటి.. ఆస్తమా ఉన్నవారు శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.. ముఖ్యంగా విపరీతమైన దగ్గు, ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది..  వంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా నిద్రలో గురక కనిపిస్తుంది.. అలాగే కొన్ని రకాల ఎలర్జీలు పొగాకు వాతావరణం లో తిరగటం అధిక గాడత ఉన్న సుగందాలు పేల్చడం పెంపుడు జంతువుల్ని పెంచినప్పుడు వాటి నుంచి వచ్చే దుమ్ము ధూళి వంటి ఎన్నో కారణాలు ఆస్తమాకు కారణం అవుతున్నాయి.. అలాగే ముఖ్యంగా పెంపుడు జంతువుల్ని కొంచెం దూరంగానే ఉంచడం మంచిది. వీడి శరీరం నుండి విడుదల అయ్యే చిన్నచిన్న రేణువులు ఊపిరితిత్తులకు హాని కలిగించే అవకాశం ఉంది..

లక్షణాలు.. 

ముఖ్యంగా గాలి పీల్చే సమయంలో ఊపిరితిత్తుల్లోకి గాలి వెళ్లి మళ్లీ గాలి వాయునాళాల ద్వారా బయటకు వస్తుంది..  ఈ ఆస్తమా ఉన్న వారిలో వాయునాళాలు వాచిపోతూ ఉంటాయి.. దీనివల్ల గాలి పీల్చుకోవడంలో ఇబ్బంది ఎదురయి ఊపిరితిత్తుల్లో కష్టంగా అనిపిస్తుంది.. అలాగే ఇలాంటి వారు దుమ్ము ధూళి లో పనిచేసినా..  చలిలో ఎక్కువగా తిరిగినా కూడా ఇబ్బందిగానే అనిపిస్తుంది.. కొంచెం చల్లగాలి తగలగానే తల మొత్తం పట్టేసినట్టు.. గొంతులో ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది.. ఇవన్నీ తీవ్రమైన ఆస్తమాకు లక్షణాలు.. 

చికిత్స.. 

అయితే ఈ వ్యాధికి పూర్తి నివారణ లేదనే చెప్పాలి. సరైన సమయంలో వైద్యున్ని సంప్రదించి.. సరైన చికిత్స విధానాన్ని ఉపయోగించడం వల్ల ఫలితం ఉంటుందని తెలుస్తోంది.. అలా కాకుండా  ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే ఊపిరితిత్తులు దెబ్బతినే అవకాశం ఉంది..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.