Diabetes : మధుమేహానికి ఎన్ని మందులు వాడినా లాభం లేదా..? ఆయుర్వేద చిట్కాలతో రిజల్ట్‌ పక్కా

ఇండియాలో Diabetes బారిన పడే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతూనే ఉంది. జీవనశైలి మార్పుల వల్లే ఈ వ్యాధి అందరికీ వస్తుంది. అయితే రోగం బయటపడిన తర్వాత కూడా ఆహారపు అలవాట్లలో మార్పులు చేయకపోతనే సమస్య ఇంకా తీవ్రంగా ఉంటుంది.

Diabetes  :  మధుమేహానికి ఎన్ని మందులు వాడినా లాభం లేదా..? ఆయుర్వేద చిట్కాలతో రిజల్ట్‌ పక్కా
Diabetics


ఇండియాలో Diabetes  బారిన పడే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతూనే ఉంది. జీవనశైలి మార్పుల వల్లే ఈ వ్యాధి అందరికీ వస్తుంది. అయితే రోగం బయటపడిన తర్వాత కూడా ఆహారపు అలవాట్లలో మార్పులు చేయకపోతనే సమస్య ఇంకా తీవ్రంగా ఉంటుంది. మధుమేహానికి ఇంగ్లీష్‌ మందులు వాడటం మొదలుపెడితే.. జీవితాంతం వాడుతూనే ఉండాలి..అయినా షుగర్‌ తగ్గుతుందున్న నమ్మకం లేదు. ఆయుర్వేదంలో డయబెటిస్‌ను తగ్గించే మార్గాలు చాలా ఉన్నాయి.. వీటిని ట్రై చేసి చూడండి.! షుగర్ కచ్చితంగా కంట్రోల్లో ఉంటుంది అంటున్నారు ఆయుర్వేద నిపుణులు..  
 
శరీరంలో అధికంగా ఉండే చక్కెర స్థాయిలను అదుపులో చేయడానికి దాల్చినచెక్క నీరు ఎంతగానో దోహదపడుతుంది. దాల్చిన చెక్కలో మన శరీరంలో రక్తంలోని చక్కెరను సహజసిద్ధంగా ఉపయోగించుకునే రసాయనాలు ఉంటాయి. ఒక లీటర్ నీటిలో మూడు టేబుల్ స్పూన్ల దాల్చినచెక్క పొడిని వేసి 20 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ నీటిని తాగాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే డయాబెటిస్‌ అదుపులోకి వస్తుంది.

డయాబెటిస్ సమస్యతో బాధపడేవారికి తేనె బాగా పనిచేస్తుంది. రోజూ ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా తేనెను కలిపి తాగితే అధిక బరువు తగ్గడమే కాక, డయాబెటిస్‌ కూడా అదుపులోకి వస్తుంది.
మన వంటింట్లో దొరికే సుగంధ ద్రవ్యాలలో వెల్లుల్లి ఒకటి. వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రతి రోజూ ఉదయం పరగడుపున పచ్చి వెల్లుల్లి రెబ్బలు రెండింటిని తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయి.
ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్న తాజా కరివేపాకులు 10 తీసుకుని రోజూ ఉదయాన్నే పరగడుపునే తినాలి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.
గుప్పెడు జామ ఆకులు, మూడు గ్రాముల జీలకర్రను కలిపి మెత్తని మిశ్రమంలా చేసి.. ఒక గ్లాసు నీటిలో కలిపి గ్లాసు నీరు సగం అయ్యే వరకు చిన్నమంటపై బాగా మరిగించాలి. ఈ విధంగా తయారు చేసిన మిశ్రమాన్ని వడబోసి తాగటం వల్ల డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.
 ఇవే కాకుండా పొడపత్రి ఆకు చూర్ణం, బీట్‌రూట్‌, మెంతి ఆకులు, మెంతులు వంటి వాటిని రోజూ తీసుకోవడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
మీ షుగర్‌ లెవల్స్‌ను బట్టి వీటిలో ఏదైనా ఒక్కటైనా రెండు వారాల పాటు ట్రై చేయండి. మళ్లీ టెస్ట్‌ చేసుకోండి. మార్పు మీకే తెలుస్తుంది. డయబెటిస్‌ అంటే.. హెల్తీ లైఫ్‌స్టైల్‌ను పాటించే ఒక మార్గమే.. మీరు ఆరోగ్యవంతమైన జీవనవిధానాన్ని పాటించినంత కాలం బానే ఉంటుంది. ఎప్పుడైతే మీరు మొండికేస్తారో.. రోగం ముదురుతుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.