Backward Walking : రోజులో 20నిమిషాలు వెనక్కు వాకింగ్‌ చేస్తే.. 3రోజులు జాగింగ్‌ చేయడంతో సమానమట.!

వాకింగ్‌, జాగింగ్‌ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని అందరికీ తెలుసు.. చాలామంది చేస్తుంటారు కూడా.. Backward Walking చేయడం గురించి మీరు విన్నారా..?. అయితే నేరుగా వాకింగ్‌ చేయకుండా

Backward Walking  : రోజులో 20నిమిషాలు వెనక్కు వాకింగ్‌ చేస్తే.. 3రోజులు జాగింగ్‌ చేయడంతో సమానమట.!
Reverse Walking


వాకింగ్‌, జాగింగ్‌ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని అందరికీ తెలుసు.. చాలామంది చేస్తుంటారు కూడా.. Backward Walking చేయడం గురించి మీరు విన్నారా..? మాములుగా వాకింగ్‌ చేయడం వల్ల డయాబెటిస్‌, కొలెస్ట్రాల్‌, అధిక బరువు వంటి సమస్యలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.. అయితే నేరుగా వాకింగ్‌ చేయకుండా Backward Walking  చేయడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే..
రోజూ 10-20 నిమిషాల పాటు వెనక్కి వాకింగ్‌ చేస్తే అది వారంలో 2-3 సార్లు జాగింగ్‌ చేసిన దాంతో సమానమట.. దీని వల్ల శరీరం దృఢంగా ఉంటుంది.

ముందుకు వాకింగ్‌ చేయడం కన్నా వెనక్కి వాకింగ్‌ చేయడం వల్ల ఎక్కువ క్యాలరీల శక్తిని ఖర్చు చేయవచ్చట వావ్‌ ఇది మంచి విషయం...దీంతో కొవ్వు త్వరగా కరుగుతుంది. అధిక బరువు త్వరగా తగ్గుతారు.
వెనక్కి వాకింగ్‌ చేయడం వల్ల శరీరం బ్యాలెన్స్‌ను పొందుతుంది. శరీరం స్థిరంగా ఉంటుంది.
వెనక్కి వాకింగ్‌ చేయడం వల్ల కాస్తంత జాగ్రత్తగా ఉంటారు. అందువల్ల పరిసరాల పట్ల అప్రమత్తత పెరుగుతుంది.
వెనక్కి నడవడం అంటే నూతన తరహా చాలెంజ్‌ను స్వీకరించడమే. దీని వల్ల శారీరక ఆరోగ్యం మెరుగు పడుతుంది. శరీరం ఫిట్‌గా ఉంటుందట..
ముందు వాకింగ్‌ చేయడం వల్ల కొన్ని కండరాల్లో కదలికలు ఉండవు. అయితే అలాంటి కండరాల్లో కదలికలను కలిగించేందుకు వెనక్కి వాకింగ్‌ చేయడం ఉపయోగపడుతుంది. దీంతో అన్ని కండరాలు దృఢంగా మారుతాయి. ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.
వెనక్కి వాకింగ్‌ చేయడం వల్ల కాళ్లు, కళ్ల కదలికలు సరిగ్గా ఉంటాయి. ఆ రెండు అవయవాలు సరిగ్గా సమన్వయం చేసుకుంటాయి. దీంతో ఆలోచనా శక్తి పెరుగుతుంది. మెదడు పనితీరు కూడా మెరుగు పడుతుంది.
రోజూ చేసే సాధారణ వాకింగ్‌కు బదులుగా వెనక్కి వాకింగ్‌ చేయడాన్ని ప్రాక్టీస్‌ చేస్తే కొత్తగా ఉంటుంది. దీంతో వ్యాయామం చేయడం బోర్‌ కొట్టకుండా ఉంటుంది.
మీకు ఇప్పటికే వాకింగ్‌ చేసే అలవాటు ఉంటే.. ఓసారి వెనక్కు వాకింగ్‌ చేయండి.. కొన్నిరోజులు చేస్తే..మార్పు మీరే గమనిస్తారు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.