ఈ లక్షణాలు కనిపిస్తూన్నాయా..  గుండెపోటు రాబోతుందేమో జాగ్రత్త సుమా.. !

Heart Attack.. గుండెనొప్పి.. మనిషి ఆరోగ్యానికి సంబంధించి అతి పెద్ద సమస్య.. దీనివల్ల కొన్నిసార్లు ప్రాణాపాయం కూడా తప్పదు.. అయితే గుండె నొప్పి వచ్చినప్పుడు హాస్పిటల్ కి వెళ్లి తగిన చికిత్స చేయించుకుంటే

ఈ లక్షణాలు కనిపిస్తూన్నాయా..  గుండెపోటు రాబోతుందేమో జాగ్రత్త సుమా.. !
symptoms of Heart Attack


Heart Attack.. గుండెనొప్పి.. మనిషి ఆరోగ్యానికి సంబంధించి అతి పెద్ద సమస్య.. దీనివల్ల కొన్నిసార్లు ప్రాణాపాయం కూడా తప్పదు.. అయితే గుండె నొప్పి వచ్చినప్పుడు హాస్పిటల్ కి వెళ్లి తగిన చికిత్స చేయించుకుంటే కొన్నిసార్లు ప్రాణాలు కాపాడుకోవచ్చు..  అయితే మరి కొన్నిసార్లు మాత్రం క్షణాల్లో ప్రాణం పోతుంది..  అయితే ఇంత తీవ్రమైన గుండె నొప్పి వచ్చే ముందు కొన్ని లక్షణాలు కచ్చితంగా కనిపిస్తాయని చెబుతున్నారు నిపుణులు.. 

ఎవరికైనా ఎడమవైపు ఛాతిలో నొప్పిగా అనిపిస్తే ముందుగా గుండె నొప్పి రాబోతుందేమో అని అనుకోవచ్చు..  అలాగే ఛాతి మధ్యలో కానీ.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు..  దవడ, మెడ భాగంలో ముఖ్యంగా ఎడమవైపు ఈ నొప్పి ఎక్కువగా ఉంటే వీటిని గుండె సంబంధిత సమస్యలుగా చెప్పవచ్చు.. అలాగే వయసు పైబడుతున్న కొలది గుండె కొట్టుకునే తీరు ఎక్కువగా ఉంటుంది దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు.

గుండె దడగా అనిపించినా.. ఎక్కువగా ఆయాసంగా అనిపించినా..  ఒళ్లంతా ఒకసారి చెమట్లు పడుతున్న..  గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయేమో చూసుకోవాలి..

అలాగే చాలామంది గుండెలో మంటగా అనిపించినప్పుడు అది గ్యాస్ సమస్య ఏమో అనుకొని నిర్లక్ష్యం చేస్తారు కొంతమంది ఏవో ఆ సమయానికి దొరికిన టాబ్లెట్లు వేసుకుంటారు అయితే వీటిని పట్టించుకోకపోవడం వల్ల తీవ్రమైన గుండె సంబంధిత సమస్యగా మారవచ్చు అని చెబుతున్నారు నిపుణులు.. అందుకే అన్నిసార్లు కాకపోయినా కొన్నిసార్లు అయినా ఛాతిలో మంట ఎక్కువగా వస్తున్నప్పుడు వైద్యుని సంప్రదించడం ఎంతైనా అవసరం..  అలాగే కుటుంబ చరిత్రలో ఎవరికైనా గుండె పోటు వచ్చి ఉన్నవాళ్లు వుంటే మరింత జాగ్రత్తగా వుండాలి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.