దిండు పెట్టుకుని పడుకోవడం వల్ల ఎన్ని సమస్యలున్నాయో తెలుసా..! ముఖ్యంగా వీరికే..!

Benefits of Sleeping Without A Pillow నిద్రపోవాలంటే.. మెత్తనిపరువు, దిండు ముఖ్యం అనుకుంటాం. కానీ దిండు లేకుండా పడుకోడం ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు వైద్యులు. పిల్లో లేకుండా పడుకుంటే ఉండే బెనిఫిట్స్ తెలిస్తే

దిండు పెట్టుకుని పడుకోవడం వల్ల ఎన్ని సమస్యలున్నాయో తెలుసా..! ముఖ్యంగా వీరికే..!


నిద్రసుఖమెరగదు, ఆకలి రుచిఎరగదు అంటారు. అది ముమ్మాటకి నిజమే. ఫుల్ నిద్రవస్తుందంటే..కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. ఇక నిద్రపోవాలంటే..మెత్తనిపరువు, దిండు ముఖ్యం అనుకుంటాం. కానీ దిండు లేకుండా పడుకోడం ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు వైద్యులు. దిండు తీసేసి పడుకోడం అంటే మనకు అసలు సాధ్యం కాదు.. కొందరైతే.. రెండు మూడు దిండ్లు పెట్టుకుని పడుకుంటారు. ఒక్కసారి పిల్లో లేకుండా పడుకుంటే ఉండే బెనిఫిట్స్ తెలిస్తే ఇకనుంచి అయినా.. తలగడమానేసి పడుకోవడానికి ప్రయత్నించవచ్చుకదా..!ఇంకెందు లేట్ చూసేద్దాం.  

దిండు పెట్టుకుని పడుకోవడం వల్ల సమస్యలు

 
1. బ్యాక్ పెయిన్ రాకుండా

బాక్ పెయిన్ రావడానికి ముఖ్య కారణం సరైన పద్ధతిలో పడుకోకపోడమే.. సరైన పద్ధతిలో పడుకోకపోడానికి కారణం సరైన పిల్లో ఎంచుకోకపోడం. ఒక్కోసారి పిల్లోకీ, మన స్పైన్ కర్వ్ కీ సరిపోదు. అలాంటప్పుడు బాక్ పెయిన్ వస్తుంది. సరైనది కాని పిల్లో ని వాడడం కంటే అసలు తలగడ లేకుండా పడుకోవడమే మంచిదంటున్నారు నిపుణులు. 

2. మెడనొప్పి దూరం

మనం పడుకున్నప్పుడు మెడ పరుపుకు సమాంతరంగా ఉండాలి. తల కింద దిండు పెట్టుకుంటే మెడ ఎత్తుగా అయినా ఉంటుంది, కిందకైనా ఉంటుంది. దీనివల్ల నెక్ పెయిన్ కూడా వస్తుంది. ఒకవేళ మనం వాడుతున్న పిల్లో సరైనది కాకపోతే నెక్ పెయిన్ ఇంకా పెరుగే అవకాశం ఉంది.. దిండు లేకుండా పడుకున్నప్పుడు తల తన సహజ పద్ధతిలో ఉంటుంది కాబట్టి ఈ సమస్య తలెత్తదు. అంతే కాదు, అలసిన మీ మెడ కండరాలకి ఇది మంచి రిలీఫ్ ఇస్తుంది. 

3. మొటిమలు దూరం

దిండు పెట్టుకుని పడుకున్నపుడు చాలా మందికి ఒక వైపు తిరిగి పడుకునే అలవాటుంటుంది. మనకి తెలీకుండానే దిండుకి ఉండే బ్యాక్టీరియా డైరెక్ట్ గా ముఖం మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది. దీని వల్ల యాక్నే, రింకిల్స్ వస్తాయి. మేం వారం వారం క్లీన్ చేసుకుంటాం అంటారేమో..కొన్ని బాక్టీరియాలు ఎంత క్లీన్ చేసినా అంత శుభ్రంగా క్లీన్ కావు..అవి సున్నితమైన ముఖంమీద ప్రభావం చూపుతాయి.

4. చిన్న పిల్లల్లో విషయంలోనూ

పసిపిల్లల విషయంలో దిండ్లు వేయటం సహజం..కానీ ఒక్కోసారి దిండు కిందకి తల వెళ్ళిపోతే సరిగ్గా ఊపిరాడదు. దిండు లేకపోతేనే మీ బేబీకి చక్కటి నిద్ర పడుతుంది.

5. ఆకృతి సరిగ్గా ఉంటుంది

మనం ఆ రోజులో చేసే పనిని బట్టి మనం పడుకునే ఆకృతి ఉంటుందట. బాగా అలిసిపోతే..ఒళ్లు తెలియకుండా నిద్రపోతారు. అలాంటప్పుడు దిండు ఉంటే..శరీరానికి ఇబ్బందిగా ఉంటుంది. దిండు లేకుండా పడుకోవడం వల్ల ఈ సమస్య రాకుండా ఉంటుంది. కాబట్టి పిల్లో లేకుండా పడుకోవడం అలవాటు చేసుకోండి..కొంచెం మందంగా ఉన్న దిండు మీద తల పెట్టుకుని పడుకున్నప్పుడు మెడ ఒక రాంగ్ పోస్చర్ లోకి వెళ్తుంది. కొన్నాళ్ళ తరవాత ఆ పోస్చర్ లో ఫిక్స్ అయిపోతుంది. దిండు లేకుండా పడుకుంటే ఈ ప్రాబ్లమే ఉండదు .

6. ఒత్తిడి దూరం

దిండు సరిగ్గా లేకపోతే మాటిమాటికీ మెలకువ వస్తుంది. పడుకున్న పొజిషన్ మార్చుకోవాల్సి వస్తుంది. రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోతే మరుసటి రోజంతా చిరాగ్గా ఉంటుంది. హాయిగా నిద్రపోతే ఒత్తిడి, డిప్రెషన్ సమస్యలు దరిచేరవు..దిండు లేకుండా పడుకుంటే చక్కని నిద్ర పడుతుంది. కాబట్టి, మీరు దిండు వదిలేస్తే డిప్రెషన్ వచ్చే ఛాన్స్ తగ్గుతుంది.   

7. నిద్రలేమి దూరం

 నిద్రలేమి సమస్యతో బాధపడేవారు..దిండు లేకుండా పడుకోడానికి ట్రై చేయండి. అలా మెల్లగా నిద్రలోకి జారుకుంటారు.  

8. ఎనెర్జీ లెవెల్స్ పెరుగుతాయి

మీరు మరీ చెప్తారు. దిండుకి ఎనర్జీకి ఏంట్రా సంబంధం..వింటున్నాం కదా అని సోదంతా చెప్తున్నాం అనుకుంటారేమో.. డైరెక్ట్ గా లేకపోవచ్చు కానీ ఉంది. దిండు లేకుండా పడుకోడం మొదలుపెట్టారనుకోండి బాక్ పెయిన్, నెక్ పెయిన్ లాంటివి రావు. అప్పుడు శరీరానికి కావల్సినంత విశ్రాంతి దొరుకుతుంది, నిద్ర కూడా హాయిగా పడుతుంది. చక్కని నిద్ర, కావలసినంత విశ్రాంతి మూలంగా మర్నాడు పొద్దున్న మీరు ఎనర్జెటిక్ గా ఉంటారు.

9. జ్ఞాపకశక్తి కూడా

మనం నిద్ర పోతున్నప్పుడు మెదడు రోజంతా సేకరించిన సమాచారాని వర్గీకరిస్తుంది. సరిగ్గ నిద్రపోతేనే ఈ పని సరిగ్గా జరుగుతుంది. ఈ పని సరిగ్గా జరిగితేనే మెమరీ సరిగ్గా ఉంటుంది. దిండు లేకుండా పడుకున్నప్పుడు శరీరానికి చక్కటి విశ్రాంతీ, నిద్ర లభిస్తాయి. దాంతో శారీరక మానసిక ఆరోగ్యం చేకూరుతుంది. నిద్రపోతున్నప్ప్పుడు శరీరం డామేజ్డ్ సెల్స్ ని రిపెయిర్ చేసుకుంటుంది. సరైన నిద్ర లేకపోతే ఈ ప్రాసెస్ సరిగ్గా జరగదు. 

10. ఎలర్జీ సమస్య

చాలా మందికి డస్ట్ ఎలర్జీ ఉంటుంది. పిల్లో, పిల్లో కవర్స్ రెగ్యులర్‌గా మార్చకపోతే ఈ సమస్య ఇంకా పెరుగుతుంది. బాక్టీరియా, డస్ట్ నెమ్మదిగా దిండు మీద నించి దిండు లోపలికి చేరుకుంటాయి. ఆ దిండు మీద తల పెట్టినప్పుడు ఈ బాక్టీరియా లోపలికి వెళ్తుంది, ఎలర్జీని పెంచుతుంది. అసలు దిండే పెట్టుకోకపోతే ఎలర్జీలు పెరిగే ఛాన్సే ఉండదు కదా..

11. ఫ్లాట్ హెడ్ సిండ్రోమ్ దూరం

రాంగ్ పొజిషన్ లో పడుకుని, పడుకుని పసిపిల్లల తల ఒకవైపు నొక్కుకుపోయినట్లుగా అయితే దాన్ని ఫ్లాట్ హెడ్ సిండ్రోం అంటారు. అసలు దిండు అలవాటు చేయకపోతే ఈ సమస్య రాదు. పిల్లలు కూడా నాచురల్ పొజిషన్ లో పడుకుంటారు. 

12. ఆరోగ్య సమస్యలు దూరం

సరైన నిద్ర ఉన్నప్పుడు శరీరంలో మెలటోనిన్, కార్టిసోల్ ఉత్పత్తి స్టెడీగా ఉంటుంది. అందువల్ల శరీరానికి రకరకాల వ్యాధులతో, కాన్సర్ తో సహా, పోరాడే శక్తి వస్తుంది. అందుకే, దిండు లేకుండా పడుకుంటే ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు అంటున్నారు.


నడుమునొప్పితో బాధపడేవారు వీలైనంత తర్వగా దిండులేకుండా పడుకోవడానికి అలవాటు చేసుకోవడం మంచిది. ఈరోజుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్లలో ఈ నొప్పి ఎక్కువగా వస్తుంది. డాక్టర్ దగ్గరకు వెళ్తే మొదట చెప్పేది.. ఒకే పొజిషన్ లో ఎక్కువ సేపు కుర్చోవద్దు అని..మనం అనుకున్నప్పటికీ..తెలియకుండానే గంటలు గడిచిపోతాయి. ఎంత పని చేసినా రాత్రి నిద్రహాయిగా పడుకుంటే సమస్య జటిలంకాదు. కాబట్టి ముఖ్యంగా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్లు ఈరోజు నుంచే దిండు లేకుండా పడుకుంటే నొప్పిని తగ్గించుకోవచ్చు.అయితే, పక్కకి తిరిగి పడుకునే అలవాటు ఉన్న వారూ, గురక పెట్టేవారూ, గ్లూకోమా సమస్య ఉన్నవారూ దిండు పెట్టుకుని పడుకోవడమే మంచిది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.