Diabetes : మధుమేహం ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగొచ్చా.. 

Diabetes : మధుమేహం సమస్య ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తుంది 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఈ సమస్య వస్తుందేమో అనే భయంతోనే గడుపుతున్నారు అయితే మీరు కచ్చితంగా కొన్నిరకాల ఆహార పదార్థాలు తీసుకోవద్దని

Diabetes : మధుమేహం ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగొచ్చా.. 


Diabetes  సమస్య ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తుంది 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఈ సమస్య వస్తుందేమో అనే భయంతోనే గడుపుతున్నారు అయితే మీరు కచ్చితంగా కొన్నిరకాల ఆహార పదార్థాలు తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అయితే ఈ నేపథ్యంలో కొబ్బరినీళ్లు తాగటం మంచిదా అనే విషయం ఎందరినో వేధిస్తున్న ప్రశ్న అయితే దీనిపై తాజా అధ్యానాలు ఏమంటున్నాయి అంటే.. 

Diabetes

కొబ్బరి నీళ్లను మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని అపోహ ఉంటుంది అయితే ఇది అంత మాత్రం సరైనది కాదని కచ్చితంగా కొబ్బరినీళ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలుస్తోంది.. అంతేకాకుండా మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి కొబ్బరి నీళ్లు సహాయపడతాయి అని కూడా తెలుస్తోంది వీటికి రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను తగ్గించే సామర్థ్యం ఉంది.. ఇందులో చక్కెర తక్కువగా ఉండటం వలన మధుమేహ వ్యాధిగ్రస్తుల చక్కెర స్థాయిలను ఏమాత్రం ప్రభావితం చేయదు.. 

Coconut Water

అలాగే కొబ్బరి నీళ్లలోని పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, విటమిన్ సీ వంటివి ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందుకే అనుమానాలను పక్కనపెట్టి కొబ్బరి నీళ్లను తీసుకోవటం అవసరం అంటూ చెబుతున్నారు.. అలాగే ఇందులో ఉండే ప్రోటీన్స్ కాసేపు ఆకలి కాకుండా చూస్తాయని అలాగే నాచురల్ గా దొరుకుతుంది కాబట్టి శరీరానికి ఎలాంటి హాని ఉండదని సమాచారం..  అయితే మధుమేహం మరి ఎక్కువ స్థాయిలో ఉన్నట్లయితే మాత్రం రోజుకి పావు లీటర్ వరకు మాత్రమే తీసుకోవాలని అంతకుమించి ఎక్కువ తీసుకోకపోవడం మంచిదని తెలుస్తుంది..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.