మూత్రం దుర్వాస‌న వ‌స్తుందా ? అయితే మీ ఆరోగ్యం జాగ్ర‌త్త‌!!

మ‌న శ‌రీరంలోని ర‌క్తాన్ని కిడ్నీలు శుభ్ర ప‌రిచి అందులో ఉండే వ్య‌ర్థాల‌ను వ‌డ‌బోస్తాయి. ఆరోగ్యవంతంగా ఉన్న వ్యక్తులు మూత్ర విసర్జన చేస్తే మూత్రం ఎలాంటి దుర్వాసనా రాదు. కానీ అనారోగ్య సమస్యలు ఉన్నవారి మూత్రం దుర్వాసన వస్తుంది.  అందుకు అనేక కారణాలు

మూత్రం దుర్వాస‌న వ‌స్తుందా ? అయితే మీ ఆరోగ్యం జాగ్ర‌త్త‌!!


మన శ‌రీరం ఎప్ప‌టిక‌ప్పుడు ఉత్ప‌త్తి చేసే వ్య‌ర్థాల్లో కొన్ని మూత్రం ద్వారా బ‌య‌ట‌కు వెళ్తుంటాయి. అందువ‌ల్ల ఆ ప‌ని కోసం కిడ్నీలు నిరంత‌రం శ్ర‌మిస్తూనే ఉంటాయి. మ‌న శ‌రీరంలోని ర‌క్తాన్ని అవి శుభ్ర ప‌రిచి అందులో ఉండే వ్య‌ర్థాల‌ను వ‌డ‌బోస్తాయి. ఆరోగ్యవంతంగా ఉన్న వ్యక్తులు మూత్ర విసర్జన చేస్తే మూత్రం ఎలాంటి దుర్వాసనా రాదు. కానీ అనారోగ్య సమస్యలు ఉన్నవారి మూత్రం దుర్వాసన వస్తుంది.  అయితే ఎవరికైనా సరే మూత్రం దుర్వాసన వస్తుందంటే.. అందుకు అనేక కారణాలు ఉంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మూత్రం దుర్వాసన రావ‌డానికి కారణాలు 

1. డీహైడ్రేష‌న్

నిత్యం మ‌నం మ‌న శ‌రీరానికి స‌రిపోయే విధంగా నీటిని తాగాలి. త‌క్కువ‌గా నీటిని తీసుకుంటే డీహైడ్రేష‌న్ స‌మ‌స్య వ‌స్తుంది. ఈ క్ర‌మంలో మ‌న మూత్రం కూడా దుర్వాస‌న వ‌స్తుంటుంది. క‌నుక నీళ్లు త‌క్కువ‌గా తాగేవారు ఎక్కువ‌గా తాగి చూడాలి. మూత్రం దుర్వాస‌న రాకుండా ఉంటుంది.

2. మూత్రాశ‌య ఇన్ఫెక్ష‌న్లు

బాక్టీరియా కార‌ణంగా మూత్రాశ‌య ఇన్‌ఫెక్ష‌న్లు కొంద‌రిలో ఏర్ప‌డుతుంటాయి. దీని వ‌ల్ల కూడా మూత్రం దుర్వాస‌న వ‌స్తుంటుంది. అయితే పైన తెలిపిన రెండు స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకున్నా మూత్రం దుర్వాస‌న వ‌స్తుందంటే అందుకు ఇన్‌ఫెక్ష‌న్ కార‌ణ‌మై ఉండ‌వ‌చ్చు. అదే అని భావిస్తే వైద్యున్ని సంప్ర‌దించి ప‌రీక్ష‌లు చేయించుకుని అందుకు అనుగుణంగా మందుల‌ను వాడుతూ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవ‌చ్చు.

3. ఈస్ట్ ఇన్‌ఫెక్ష‌న్

ఈస్ట్ ఇన్‌ఫెక్ష‌న్‌ల వ‌ల్ల కూడా మూత్రం దుర్వాస‌న వ‌స్తుంది. దీనికి కూడా వైద్య పరీక్ష‌లు చేయించుకుని మందుల‌ను వాడాల్సి ఉంటుంది.

4. ఎస్‌టీడీ వ్యాధి

శృంగారంలో పాల్గొన‌డం వ‌ల్ల సంక్ర‌మించే ఎస్టీడీ (సెక్సువ‌ల్లీ ట్రాన్స్‌మిటెడ్ ఇన్‌ఫెక్ష‌న్‌) వ్యాధుల వ‌ల్ల కూడా మూత్రం దుర్వాస‌న వ‌స్తుంది. ఇలా గ‌న‌క జ‌రిగితే క‌చ్చితంగా డాక్ట‌ర్‌ను క‌లిసి చికిత్స తీసుకోవాలి.

5. కిడ్నీ స్టోన్లు

కిడ్నీ స్టోన్ల స‌మ‌స్య ఉన్న‌వారి మూత్రం కూడా దుర్వాస‌న వ‌స్తుంది. అయితే కిడ్నీ స్టోన్లు ఉంటే సుల‌భంగా తెలిసిపోతుంది. పొట్ట కింది వైపు కుడి, ఎడ‌మ భాగాల్లో అదే భాగంలో వెనుక వైపు నొప్పి వ‌స్తుంది. అలాగే జ్వ‌రం, వాంతులు, ర‌క్త‌స్రావం కావ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. ఈ ల‌క్ష‌ణాలు ఉంటే డాక్ట‌ర్‌ను క‌లిసి చికిత్స తీసుకోవాలి. దీంతో కిడ్నీ స్టోన్ల స‌మ‌స్యే కాకుండా మూత్రం దుర్వాస‌న వ‌చ్చే స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది.

6. డ‌యాబెటిస్, విట‌మిన్స్

డ‌యాబెటిస్ ఉన్న‌వారు, విట‌మిన్ ట్యాబ్లెట్ల‌ను ఎక్కువ‌గా వాడేవారి మూత్రం దుర్వాస‌న వ‌స్తుంది. అయితే డ‌యాబెటిస్ ఉన్న‌వారు షుగ‌ర్ స్థాయిల‌ను అదుపులో ఉంచుకుంటే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఇక విట‌మిన్ ట్యాబ్లెట్లు వాడేవారికి ఆ ట్యాబ్లెట్ల‌ను ప‌రిమిత కాలం పాటు తీసుకున్నాక వాటిని తీసుకోవ‌డం ఆపేస్తే మూత్రం దుర్వాస‌న వ‌చ్చే స‌మ‌స్య త‌గ్గుతుంది.

కాఫీ ఎక్కువ‌గా తాగేవారి మూత్రం కూడా దుర్వాస‌న వస్తుంటుంది. క‌నుక కాఫీ ఎక్కువ‌గా తాగేవారు దాన్ని మితంగా తీసుకోవాలి. లేదంటే కిడ్నీల‌పై భారం ప‌డుతుంది. ఉల్లిపాయలు, వెల్లుల్లి, మాంసాహారం తినడం, మద్యం సేవించడం వంటి కారణాల వల్ల కూడా మూత్రం దుర్వాసన వస్తుంటుంది. కొన్నిసందర్భాల్లో జన్యు పరమైన వ్యాధుల వల్ల కూడా మూత్రం దుర్వాసన వస్తుంటుంది. సాధారణంగా ఇది వంశ పారంపర్యంగా వస్తుంటుంది. మూత్రం దుర్వాసన వస్తుందంటే.. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకుని వారు ఇచ్చే మందులను కచ్చితంగా వాడాలి. 

మూత్రంలో వాసనను నివారించే రెమెడీలు


1. లెమ‌న్ జ్యూస్‌

మూత్రం దుర్వాస‌న రావ‌డానికి ముఖ్య కార‌ణం శ‌రీరంలో ఎక్క‌వ  టాక్సిన్స్ పేరుకుపోవడం వల్ల మూత్రంలో దుర్వాస‌న రావ‌డం జ‌రుతుగుంది. ఉద‌యం లేవ‌గానే ఖాళీ క‌డుతో ఒక గ్లాసు నిమ్మ‌ర‌సం రోజూ తీసుకోవ‌డం ద్వారా శ‌రీరంలో నిండిన టాక్సిన్స్‌ డిటాక్సిఫై అయి స‌మ‌స్య తీరుతుంది. ఇలా వీలైన‌ప్పుడ‌ల్ల చెయ్య‌డం వ‌ల్ల మూత్రంలో దుర్వాస‌న రావడం జ‌ర‌గ‌దు.

2. ఉల్లిపాయ‌ మ‌జ్జిగ లేదా రైతా

యూరిన‌రీ ఇన్ఫెక్ష‌న్ వ‌ల్ల కూడా యూరిన్ వాస‌న వ‌స్తుంది. దీని కోసం మ‌జ్జిక‌ను తీసుకోవ‌డం స‌మ‌స్య‌కు ప‌రిష్కారం. ఉల్లిపాయ పేస్ట్ మ‌రియు అల్లం రెండింటినీ మ‌జ్జిగ‌లో క‌లిపి ప్ర‌తీ రోజు తీసుకోవ‌డం వ‌ల్ల యూరిన‌రీ ట్రాక్ ఇన్ఫెక్ష‌న్ త‌గ్గి మూత్రంలో వాస‌న రావ‌డం త‌గ్గుతుంది. 

3. హైడ్రేట్ యువ‌ర్ బాడీ

వాట‌ర్ ఎక్కువ‌గా తీసుకోవాలి అంటుంటారు పెద్ద‌లు. శ‌రీరంలో నీటి కంటెంట్ స‌రిప‌డినంత ఉంటే యూరిన్ సంబంధింత వ్యాధులు ద‌రిచేర‌వు. నీరు త‌క్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల డీహైడ్రేష‌న్ వస్తుంది. దీని వ‌ల్ల మూత్రం చెడు వాసన వ‌స్తుంది. క‌నీసం రోజుకు 2 లీట‌ర్ల నీరు తీసుకుంటే మంచిది. ఇలా మీ శ‌రీరానికి కావ‌లసిన నీటిని అందిస్తే యూరిన్‌లో వాస‌న రావ‌డం జ‌ర‌గ‌దు. 

4. లో దుస్తులు

శుభ్ర‌మైన లో దుస్తులు ద‌రించ‌డం అనేది మంచి అల‌వాటు. ఇన్న‌ర్‌ల విష‌యంలో కొంద‌రు అజాగ్ర‌త్త‌గా ఉంటుంటారు. ఉత‌క‌కుండా రోజులు రోజులు ద‌రిస్తుంటారు. అలా చెయ్య‌డం మంచిది కాదు. ఇది కూడా మూత్రంలో వాస‌న రావ‌డానికి కార‌ణం.  ఇన్నర్ దుస్తులు మరి బిగుతుగా ఉన్నవి వేసుకోకూడదు. అంతే కాదు ఇన్నర్ దుస్తులను ఎల్లప్పుడు కాటన్ వి మాత్రమే ఉపయోగించాలి. 

సిట్ర‌స్ ఫ్రూట్స్‌, ప‌సుపు, ఆలివ్ ఆయిల్, హెర్బల్ టీలు, పార్స్‌లీ జ్యూస్ వంటివి తీసుకోవ‌డం ద్వారా కూడా ఈ స‌మ‌స్య‌ను త్వ‌ర‌గా నివారించుకోవ‌చ్చు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.