Kitchen Mistakes : వంటగదిలో ఈ తప్పులు చేస్తే ఆరోగ్యాన్ని చిక్కుల్లో పెట్టేసినట్లే..

Kitchen Mistakes : బయట ఆహారం తినడం వల్ల ఎన్నో అనారోగ్యాలు వస్తాయని అధ్యయనాల్లో తేలినప్పటికీ..  పలు అనారోగ్య సమస్యలకు కారణం వంటగది అపరిశుభ్రతని తాజా అధ్యయనాల్లో బయటపడింది..

Kitchen Mistakes  :  వంటగదిలో ఈ తప్పులు చేస్తే ఆరోగ్యాన్ని చిక్కుల్లో పెట్టేసినట్లే..
kitchen tips


Kitchen Mistakes : బయట ఆహారం తినడం వల్ల ఎన్నో అనారోగ్యాలు వస్తాయని అధ్యయనాల్లో తేలినప్పటికీ..  పలు అనారోగ్య సమస్యలకు కారణం వంటగది అపరిశుభ్రతని తాజా అధ్యయనాల్లో బయటపడింది.. వంటగదిని శుభ్రంగా ఉంచుకోకపోతే దీర్ఘకాలంగా వేధించే ఎన్నో సమస్యల బారిన పడాల్సి వస్తోందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.. 

చాలావరకు ఆహారం వంటింట్లోనే కలుషితం అవుతుంది.. అవును ఈ మాట నిజమే తాజాగా జరిగిన అధ్యయనాల్లో బయటపడిన విషయం అందరిని షాక్ కి గురి చేసింది.. చాలామంది తెలిసి తెలియక వంట గదిలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు అయితే దీని వలన కలిగే సమస్యలు ఏంటో తెలుసుకుందాం..

చికెన్ ను చాలామంది సింకులో నీళ్లతో కడుగుతూ ఉంటారు..  దీనివల్ల బ్యాక్టీరియా పూర్తిగా పోదు సరి కదా చుట్టూ ఉన్న అన్నింటి పైన ఆ బ్యాక్టీరియా వ్యాప్తిస్తుంది..  అలాగే మాంసాహార పదార్థాలను ఎక్కువ సేపు ఉడికించి వండాలి.. దీని వల్ల అందులో ఏమైనా బ్యాక్టీరియా ఉంటే నశిస్తుంది.. అలాగే పచ్చి కాయగూరలను నీటితో కడిగితే సరిపోతుంది అనుకోకుండా.. పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉప్పు నీటిలో నానబెట్టి కడగటం వల్ల వాటిపై ఉన్న సూక్ష్మజీవులు రసాయన పదార్థాలు పోతాయి.. 

అలాగే చాలామంది కూరగాయలు, మాంసాహార పదార్థాలను కట్ చేసినా చాపింగ్ బోర్డు పైనే పండ్లను కూడా కట్ చేస్తారు.. ఇది ఎంత మాత్రం సరైన పద్ధతి కాదు.. దీనివల్ల వాటిలో ఉండే బ్యాక్టీరియా పండ్ల లోకి చేరుతుంది.. అలాగే పచ్చి కాయగూరలను కడిగిన గిన్నెలోనే వండిన పదార్థాలను ఉంచటం కూడా సరికాదు.. అదే విధంగా ఫ్రిజ్ ను ఎప్పుడు నీట్ గా ఉంచుకోవాలి.. లేదంటే అందులో దుర్వాసన వచ్చి బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది..

అలాగే వంట గదిలో ఉండే గ్యాస్ స్టవ్ నుండి మైక్రో వేవ్ వరకు ప్రతి వస్తువు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటన్నిటి మీద విపరీతంగా బ్యాక్టీరియా పేరుకుపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు తడిపిన స్పాంజ్ ను ఉపయోగించి వీటిని శుభ్రపరచాలి.. అలాగే రోజూ వంట పూర్తైన తర్వాత గ్యాస్ సైడ్ ప్రాంతాలను సబ్బునీటితో శుభ్రం చేయాలి. ఇలా ప్రతీ రోజూ పాటిస్తే వంట గదిలో ఎలాంటి అపరిశుభ్ర వాతావరణం కనిపించదు.. చాలామంది మాంసాహారానికి, శాఖాహారానికి ఒకే పాత్రలను ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా కాకుండా మాంసాహారం వండినప్పుడు వేరుగా నాన్ స్టిక్ పాన్లను ఉపయోగించాలి. దీని వలన బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా ఉంటుంది.. అలాగే మాంసాహారం వండిన రోజుల్లో తప్పనిసరిగా వంట పూర్తయ్యాక వంటగదిని క్లీన్ చేయటం మర్చిపోకూడదు.. అలాగే మాంసాహార పాత్రలకు వీలైతే వేరుగా వంట సబ్బును ఉపయోగించాలి. వీటన్నిటి వల్ల ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు..  లేదంటే ఎన్నో రకాల అనారోగ్యాలు బారిన పడే అవకాశం ఉంటుంది..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.