Potassium : ఆకలిలేమి, అలసట, కండరాల నొప్పి, వాంతులు @ పొటాషియం లోపం..!!

మన శరీరానికి నిత్యం ఎన్నో రకాల పోషకాలు, మినరల్స్‌ అవసరమవుతాయి. మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే అనేక పోష‌కాల్లో   Potassium కూడా ఒక‌టి. ఇది మిన‌ర‌ల్స్ జాబితాకు చెందుతుంది.  Potassium  మ‌న శ‌రీరంలో బీపీని నియంత్రిస్తుంది.  స్ట్రోక్స్ రాకుండా చూస్తుంది.

Potassium  :  ఆకలిలేమి, అలసట, కండరాల నొప్పి, వాంతులు @ పొటాషియం లోపం..!!
potassium


మన శరీరానికి నిత్యం ఎన్నో రకాల పోషకాలు, మినరల్స్‌ అవసరమవుతాయి. మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే అనేక పోష‌కాల్లో   Potassium కూడా ఒక‌టి. ఇది మిన‌ర‌ల్స్ జాబితాకు చెందుతుంది.  Potassium  మ‌న శ‌రీరంలో బీపీని నియంత్రిస్తుంది.  స్ట్రోక్స్ రాకుండా చూస్తుంది. కండ‌రాల నొప్పులు, కండ‌రాలు ప‌ట్టుకుపోయిన‌ట్లు అనిపించ‌డం వంటి స‌మ‌స్య‌ల‌ను పొటాషియం త‌గ్గిస్తుంది. అలాగే గుండె జ‌బ్బులు రాకుండా చూస్తుంది. అందువ‌ల్ల పొటాషియం ఉండే ఆహారాల‌ను మ‌నం రోజూ తీసుకోవాలి. అసలు ఏ ఆహారంలో పొటాషియం ఉంటే తెలిస్తేనే కదా.. మనం రోజు తీసుకుంటున్నామా లేదా అని తెలుస్తుంది.

పొటాషియం వల్ల ఏంటి ఉపయోగం..
మ‌న శ‌రీరం స‌రిగ్గా ప‌నిచేసేందుకు పొటాషియం చాలా అవ‌స‌రం. మ‌న శ‌రీరంలోని క‌ణాల‌కు పొటాషియం రోజూ అవ‌స‌రం అవుతుంది. ఇది శ‌రీరంలో అనేక విధులను నిర్వ‌హిస్తుంది. కండ‌రాలు, నాడుల ప‌నితీరు, గుండె కొట్టుకోవ‌డం, శ‌క్తిని ఉత్ప‌త్తి చేయ‌డం, న్యూక్లిక్ యాసిడ్లు, ప్రోటీన్ల సంశ్లేష‌ణ వంటి ప‌నుల‌కు పొటాషియం అవ‌స‌రం అవుతుంది. శ‌రీరంలో నీటి స్థాయిల‌ను నియంత్రించేందుకు కూడా పొటాషియం కావాలి.
పొటాషియం లోపిస్తే కనిపించే లక్షణాలు ఇవే..
  • కండ‌రాలు బ‌ల‌హీనంగా మారుతాయి.
  • కండ‌రాలు ప‌ట్టుకుపోయిన‌ట్లు అనిపిస్తుంది.
  • అల‌స‌ట‌, గుండె అసాధార‌ణ రీతిలో కొట్టుకోవ‌డం, ఆక‌లి లేక‌పోవ‌డం, మానసిక కుంగుబాటు, హైపోక‌లేమియా, వాంతులు, విరేచ‌నాలు .
  • కొంద‌రికి మ‌లంలో ర‌క్తం కూడా వ‌స్తుంది. 
 
రోజుకు ఎంత మోతాదులో పొటాషియం కావాలి..
సాధార‌ణంగా మ‌న‌కు రోజుకు 2.5 నుంచి 3.5 గ్రాముల వ‌ర‌కు పొటాషియం అవ‌స‌రం అవుతుంది. మ‌నం తినే ఆహారాల నుంచే మ‌న‌కు పొటాషియం ల‌భిస్తుంది. సపరేట్‌గా ఎలాంటి స‌ప్లిమెంట్ల‌ను వాడాల్సిన ప‌నిలేదు. ఈ క్ర‌మంలోనే ప‌లు ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల పొటాషియం లోపం రాకుండా చూసుకోవ‌చ్చు.
పొటాషియం ఉండే ఆహారాలు..
విత్త‌నాలు, న‌ట్స్‌, అర‌టి పండ్లు, యాప్రికాట్స్‌, చేప‌లు, తృణ ధాన్యాలు, పెరుగు, పాలు, మాంసం, కోడిగుడ్లు, ట‌మాటాలు, చిల‌గ‌డ దుంప‌లు, త‌ర్బూజా, క్యారెట్‌, నారింజ, కివీ, కొబ్బ‌రినీళ్లు, బీట్‌రూట్ వంటి ఆహారాల్లో పొటాషియం పుష్క‌లంగా ల‌భిస్తుంది. వీటిని త‌ర‌చూ తీసుకుంటే పొటాషియం లోపం రాకుండా చూసుకోవచ్చు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.