RO వాటర్ మంచివని తాగేస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!

మార్కెట్లో కాస్టీ బాటిల్స్ వాటర్ పేరుకు మినరల్స్..కానీ మినరల్స్ అతి తక్కువ ఉంటాయి. నీళ్లు తాగటం మాత్రమే కాదు, కలుషితం లేనివి తాగాలనేది కాన్స్పట్. అందుకే అందరూ ఆర్వో (RO) వాటర్ తాగటానికే ప్రాధాన్యం ఇస్తుంటారు.

RO వాటర్ మంచివని తాగేస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!


మంచినీళ్లు మన శరీరానికి చాలా అవసరం.. నీళ్లు తాగటం మాత్రమే కాదు, కలుషితం లేనివి తాగాలనేది కాన్స్పట్. అందుకే అందరూ ఆర్వో (RO) వాటర్ తాగటానికే ప్రాధాన్యం ఇస్తుంటారు. రివర్స్ ఆస్మోసిస్ ( Reverse Osmosis ) చేసి డైరెక్టుగా ఇచ్చేస్తారు. మినరల్స్ కలపకుండా ఇచ్చే ఈ ఆర్వో వాటర్ ను కొనుక్కోని తాగితే ఆరోగ్యానికి చాలా ప్రమాదం.


ఆర్వో ప్రాసెస్ చేయటం వల్ల ఎలాంటి మినరల్స్ పోతాయి

భూమిలోంచి వచ్చేనీరు డైరెక్టుగా తాగలేం కాబట్టి, ఫిల్టర్స్ గురించి మినరల్స్ గురించి ఆలోచించాల్సి వచ్చింది. మనం తాగేనీరులో టీడీఎస్ చూసుకుని ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తాగమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు కొలతలు ఇచ్చారు. టోటల్ డిస్వాల్డ్ సాలిడ్స్ (TDS) . నీళ్లలో ఉండే లవణాల మోతాదు ఏ రేంజ్ లో ఉంటే మంచిది అని WHO ఇచ్చిందంటే.. 50-150PPM ఉండాలి. పార్ట్స్ పర్ మిలియన్స్ . అలా ఉంటే.. ఆ వాటర్ ఎక్సలెంట్ అని అర్థం. 150-300 వరకు ఉంటే గుడ్ అని అర్థం. 300-500 మధ్యలో టీడీఎస్ ఉంటే..ఒకే తాగొచ్చు. అంతకు పైన ఉంటే.. ఇక తాగొద్దు. 1000దాటితే అసలకే తాగొద్దు.  


మనం బయట కాస్ట్లీగా వాటర్ బాటిల్స్ కొంటుంటాం.. సో కాల్డ్ బ్రాండ్స్ వాటర్ బాటిల్సో ఇవి 13-18 వరకే ఉంటుంది. మనకు మినిమమ్ కావాల్సింది 50 నుంచి. నదిలో వచ్చే నీరు, కాలువలో నీరు, చెరువులో నీరు ఇవన్నీ కూడా చాలా మంచివి. లవణాలు ఎక్కువగా ఉంటాయి. కానీ విటిని రిమూవ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే.. ఇందులో హానికలిగించే క్రిములు కొన్ని ఉంటున్నాయి. లవణాలు మరీ ఎక్కువైపోతున్నాయి. త్రాగడానికి ఇబ్బందికరంగా ఉంది. అందుకే.. వీటిని రిమూవ్ చేసి.. తాగటానికి సరిపడా చేస్తే బాగుండు అని ఆర్వో ఫిల్టర్స్ వచ్చాయి.

ఆర్వో అంటే..రివర్స్ ఆస్మోసిస్..ఇందులో కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి..ఆ ఫిల్టర్స్ ఎంత మైక్రాన్స్ ఉంటాయంటే.( .0001మైక్రాన్) అంత పలచటవి.. నీరు తప్ప ఇక ఏవి ప్రయాణించడానికి అ‌వకాశం ఉండదు. అలాంటి ఫిల్టర్స్ గుండా వాటర్ ను పంపినప్పుడు నీరు ఒక్కటే వెళ్లి మిగతావి అన్ని నీళ్లల్లో ఉండే లవణాలు, క్రిముల్ని ఆపేస్తాయి. అంతకంటే చిన్న వైరస్ బాక్టీరియాలను ఉంటే అవి మాత్రం ప్రయాణిస్తాయి. ఇలా రిమూవ్ చేస్తున్నాం కాబట్టి.. ఆర్వో ఫిల్టర్స్ మినరల్స్ ఉండవు. అందుకని ఆర్వో ఫిల్టర్స్ నుంచి మినరల్స్ యాడ్ చేసేటట్టు టీడీఎస్ సంబంధించిన మిషన్లు పెట్టి వీటిని మళ్లీ తిరిగి యాడ్ చేస్తారు. అలా మినరల్స్ యాడ్ చేసిన ఆర్వో వాటర్ ను మనం త్రాగితే దోషం తక్కువ ఉంటుంది. ప్యూర్ ఆర్వో వాటర్..మొత్తం రిమూవ్ చేసి వాటర్ తాగితే అది దోషం.

ఒక గ్లాస్ నీళ్లు తీసుకుంటే ఎన్ని మినరల్స్ ఉండాలి?


కరెక్టుగా చెప్పలేం కానీ.. మన రక్తం పీహెచ్ 7.4 ఉంటుంది. ఆమ్లగుణం..7లోపు ఉండేవాటిని ఆమ్లగుణం అంటారు.. అంతకు పైన ఉంటే.. క్షారగుణం అంటారు. ప్రకృతి ప్రసాదించినవి అన్నీ క్షారగుణాన్ని కలిగి ఉంటాయి. మనకు రక్షణ వ్యవస్థకానీ, ఆరోగ్యం కానీ క్షారగుణం ఉన్నప్పుడు బాగుంటుంది. ఆమ్లగుణం ఉన్నవి మనం ఎక్కువగా తీసుకుంటే..రక్షణవ్యవస్థ తగ్గిపోతుంది. నీళ్లలో ఉండే లవణాలు వల్లే..నీటికి క్షారగుణం వస్తుంది. మనకు నది నీరు, కాలవ నీరు, చెరువు నీరు తీసుకుంటే 8.5-9 PH ఉంటుంది. ఎక్కువ క్షారగుణం ఉన్నట్లు. మనం బాటిల్స్ బయటే కొనేవాటిల్లో 4-4.5 మాత్రమే. అంటే డైరెక్టు వాటర్ తాగినప్పుడు మనకు రుచిగా ఉండదు. అదే బాటిల్లో వాటర్ చాలా రుచిగా ఉన్నట్లు అనిపిస్తాయి..ఎందుకంటే..అందులో ఏం లవణాలు ఉండవు కాబట్టి. అదే మనం ఇంటి దగ్గరుకు వచ్చే మినరల్ వాటర్ కూడా పెద్దగా టేస్ట్ ఉండవు. 

బాటిల్ లో అమ్మేవాటర్లో లవణాలు ఎక్కువగా తీయటం వల్ల ఆమ్లగుణంలోకి మారిపోతుంది. ఈ యసిడిక్ వాటర్ మంచిదికాదు..కొంత మినరల్స్ కలుపుతారు కానీ ఎక్కువ కలపరు. సాధ్యమైనంతవరకూ..ఎవరైతే..నదులు, చెరువులు, బావులకు దగ్గర్లో ఉంటారో వాళ్లకు ఏం మార్పులు అక్కర్లా..తాగేయొచ్చు. బోర్ వాటర్ తీసుకున్నప్పుడు అది అంత రుచికరంగా ఉండదు..ఎక్కువ లవణాలు ఉండిపోయి..అదోరకమైన టెస్ట్ ఉంటుంది..అలాంటివారు మినరల్ వాటర్ ను వాడుకోవచ్చు. మినరల్స్ కలిపారు కాబట్టి మినరల్ వాటర్ అంటారు. 


మార్కెట్లో కాస్టీ బాటిల్స్ వాటర్ పేరుకు మినరల్స్..కానీ మినరల్స్ అతి తక్కువ ఉంటాయి..మన బ్లడ్ యసిడిక్ గా మారితే..ఫైటింగ్ మెకానిజం వీక్ అవుతుంది. అవయువాల పనితీరు డామేజ్ అవుతుంది. నీరు జీవినాధారం. ఖరీదైనది కదా..మంచిది అనే అపోహను వీడి..ప్యూర్ ఆర్వో వాటర్ ను తాగటం మానేయమని ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు చెబుతున్నారు.


కాచి వడపోసిన వాటర్ తాగటం ఎంతవరకు కరెక్టు 


కాచి వడకట్టడం అనేది మంచిపని..ఈరోజుల్లో మోషన్స్, జాండిస్, థైపాయిడ్స్ లాంటి అంటువ్యాధులు నీళ్ల ద్వారా వస్తుంటాయి. అలాంటి నీళ్లను కాచినప్పుడు క్రిములన్నీ చచ్చిపోతాయి. అయితే మీకు లవణాలు పోతాయి కదా అనే డౌట్ రావొచ్చు..నీళ్లు మరిగినప్పుడు 100డిగ్రీల వేడికి గురవతాయి. లవణాలు అనేవి 200-300దాటి వేడెక్కితేకాని దెబ్బతినవు. వేడిచేసినందు వల్ల నీళ్ల టేస్ట్ కొద్దిగా మారుతుందే తప్ప..నీళ్లలో ఉండే లవణాలు ఏం పోవు. 


తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్వో వాటర్ తాగాల్సివచ్చినప్పుడు ఇతర ఆహారపదార్థాల ద్వారా లవణాలను పొందవచ్చు. కొబ్బిరినీళ్లు తాగటం, ప్రూట్ జ్యూస్, ఆకుకూరలు తినటం చేస్తుంటే..లవణాలను ఇలా భర్తీ చేసుకోవచ్చు. మార్కెట్ లో TDS మిషన్ అమ్ముతారు. 200-300 లో ఉంటుంది దీని ధర..తాగేనీళ్లలో టీడీఎస్ ఎంత ఉందో టెస్ట్ చేసుకుని..తాగుతుండండి..అప్పుడు మనకే అర్థమవుతుంది..ఏ వాటర్ తాగాలో.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.