Deodorant spray : డియోడరెంట్ స్ప్రే వాడకం ప్రాణాంతకమే.. నివ్వెర పరిచే నిజాలు ఏంటంటే

రోజంతా ఫ్రెష్ గా అనిపించడానికి చాలామంది deodorant spray ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా చెమట నుంచి తప్పించుకోవడానికి చెడు వాసన రాకుండా ఉండటానికి deodorant spray వాడతారు..

Deodorant spray : డియోడరెంట్ స్ప్రే వాడకం ప్రాణాంతకమే.. నివ్వెర పరిచే నిజాలు ఏంటంటే
Disadvantages of deodorants spray


రోజంతా ఫ్రెష్ గా అనిపించడానికి చాలామంది deodorants spray ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా చెమట నుంచి తప్పించుకోవడానికి చెడు వాసన రాకుండా ఉండటానికి deodorants spray వాడతారు.. ఇందులో ఉండే రసాయనాలు చెమటలో బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా నివారిస్తాయి అనే మాట నిజమే. ఎన్నో రకాల సువాసనలతో ఇప్పటికే మార్కెట్లో పలు రకాల డియోడరెంట్లు దొరుకుతున్నాయి. స్ప్రే చేసే డియోడరెంట్ తో పాటు రోల్ చేసేవి స్టిక్స్ అన్ని కూడా అందుబాటులో ఉంటున్నాయి.. అయితే చెమట నుంచి తప్పించుకోవడానికి వాడే డియోడరెంట్లు ఎక్కువగా వాడటం వల్ల ప్రాణాంతకమని.. అలాగే బాడీ స్ప్రే, డియోడరెంట్ స్ప్రే ఒకటి కాదని, ఈ రెండింటి వాడకంలో కచ్చితంగా తేడా ఉండాలని లేకపోతే ఆరోగ్య సమస్యలు తప్పవని తెలుస్తోంది.. 

బాడీ స్ప్రే కి డియోడరెంట్ స్ప్రే కి మధ్య తేడా ఏంటంటే..

డియోడరెంట్ స్ప్రేలను బాడీ స్ప్రే వాడినట్టు వాడకూడదు. ఈ రెండిటి మధ్య కచ్చితంగా తేడా ఉంటుంది.  డియోడరెంట్ స్ప్రే యాంటీ మైక్రోబియల్ అంటే మన శరీరం నుంచి చెమటతో పాటూ బయటికి వచ్చిన సూక్ష్మజీవులను చంపేస్తుంది. కానీ బాడీ స్ప్రే మంచి సువాసన కలిగి పెర్ఫ్యూమ్ లాగా పని చేస్తుంది. బాడీ స్ర్పే ను బట్టల పైన స్ప్రే చేస్తే డియోడరెంట్ స్ప్రేను నేరుగా శరీరానికి స్ప్రే చేయాలి. అలాగే శరీరం పైన డియోడరెంట్ స్ప్రే చేసుకున్న తర్వాత దుస్తులపైన బాడీ స్ప్రేను స్ప్రే చేసుకోవచ్చు.

డీయోడరెంట్ స్ప్రే ఎలా వాడాలంటే.. 

స్నానం చేసి వచ్చాక డీయోడరెంట్ స్ప్రే శరీరానికి కనీసం 15 మీటర్ల దూరంలో ఉంచి స్ప్రే చేసుకోవాలి. ఇలా ఉంచి స్ప్రే చేయడం వల్ల దాని ఫలితం పూర్తిగా అందుతుంది. డీయోడరెంట్ స్టిక్ కానీ రోలాన్ కానీ వాడితే శరీరం పైన రెండు నుంచి మూడుసార్లు రాసుకోవాలి..  అయితే దీన్ని శరీరం పైన స్ప్రే చేసుకున్నాక వెంటనే నిద్ర పోతే అందులో ఉండే రసాయనాలు చర్మానికి హాని చేసే అవకాశం ఉంది.. 

ఎందుకు ప్రమాదమంటే.. 

డీయోడరెంట్ స్ప్రే లో హానికారక రసాయనాలు ఉంటాయి. ఇవి శరీరానికి హాని చేయడమే కాకుండా నాడీ వ్యవస్థ, కాలేయం, గుండె పనితీరుపైన ప్రభావం చూపిస్తాయి.. అందుకే కొనేటప్పుడు ప్రోటీన్ గ్లైకోల్ రెండు శాతం కంటే తక్కువగా ఉన్నవి వాడటం వల్ల శరీరం పైన ఎక్కువ చెడు ప్రభావం ఉండదు..

ఎలాంటి లక్షణాలు కనిపిస్తే ప్రమాదమంటే.. 

ఈ స్ప్రే వాడిన తర్వాత ఎలర్జీ వచ్చినా, శరీరం పైన దద్దుర్లు, ఊపిరి పీల్చడంలో ఇబ్బందులు ఎదురవచ్చు. అలాగే చిన్నగా మొదలైన చర్మ సమస్యలు క్యాన్సర్కు దారి తీయవచ్చు. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ సైతం వచ్చే అవకాశం ఉంది.. చిన్నపిల్లలకు ఈ స్ప్రేలు దూరంగా ఉంచాలి. వీటిని ఎక్కువగా పీలిస్తే పిల్లల్లో నాడి వ్యవస్థ దెబ్బ తినటమే కాకుండా నరాలకు సంబంధించిన సమస్యలు, ఫిట్స్ వంటివి వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా పీల్చినప్పుడు అకస్మాత్తుగా చనిపోయే అవకాశం కూడా ఉంది. అందుకే పిల్లలకు వీటిని చాలా దూరంగా ఉంచాలి..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.