రోజు మొత్తంలో ఎప్పుడెప్పుడు నీటిని తాగాలో తెలుసా..!

మనిషి జీవ ప్రక్రియలో నీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది రోజుకు కచ్చితంగా 6 నుంచి 8 గ్లాసులు Drinking Water తీసుకోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మంచిగా జరిగి ఆరోగ్యంగా ఉండాలని తెలుస్తోంది

రోజు మొత్తంలో ఎప్పుడెప్పుడు నీటిని తాగాలో తెలుసా..!

మనిషి జీవ ప్రక్రియలో నీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది రోజుకు కచ్చితంగా 6 నుంచి 8 గ్లాసులు నీరు తీసుకోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మంచిగా జరిగి ఆరోగ్యంగా ఉండాలని తెలుస్తోంది అయితే ముఖ్యంగా రోజులో ఏ సమయంలో నీటిని తీసుకోవాలో ఒకసారి చూద్దాం.. 

రోజులో కచ్చితంగా తగినంత నీటిని శరీరానికి ఇవ్వటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు అయితే నీటిని తీసుకోవడానికి కూడా ఓ సమయం అంటూ ఉంటుంది రోజు ఉదయాన్నే లేవగానే రెండు గ్లాసులు గోరువెచ్చని నీరు తాగడం వల్ల రోజంతా ఉత్తేజంగా ఉంటుంది.. అలాగే వ్యాయామం చేసిన వెంటనే నీటిని తాగకూడదు ఒక 15 నిమిషాల్లో గ్యాప్ ఇచ్చి నీటిని తీసుకోవాలి.. దీనివల్ల వ్యాయామంతో అలసిపోయిన శరీరం సాధారణ స్థితికి వస్తుంది.. 

భోజనం చేయడానికి అరగంట ముందు ఒక గ్లాసు నీళ్లు తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ మెరుగు పడుతుంది అలాగే తిన్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిని తీసుకోకూడదు తినడం పూర్తయ్యాక గంట తర్వాత మాత్రమే నీటిని తాగాలి తింటున్నప్పుడు నీటిని తాగితే ఆరోగ్యం జీర్ణం అవడంలో సమస్యలు తలెత్తి గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి.. అలాగే స్నానం చేయడానికి ముందు నీరు తాగడం వల్ల శరీరంలో రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు అలాగే నిద్రపోవడానికి ముందు తగినంత నీటిని తీసుకోవడం వల్ల రాత్రి సమయంలో జరిగే జీవక్రియ సక్రమంగా ఉంటుంది.. అలాగే శరీరం ఏమాత్రం నీరసంగా డిహైడ్రేటుగా అనిపించిన వెంటనే నీటిని తాగాలి.. తగినంత నీటిని రోజంతా తాగడం వల్ల తలనొప్పి, కిడ్నీ సంబంధిత వ్యాధులు వంటి సమస్యలు దరి చేరవు..