పెళ్లితో అయుష్షు పెరుగుతుందా.. !

ఈరోజుల్లో చాలామంది ఒంటరి జీవితాన్ని బతకడానికి ఇష్టపడుతున్నారు అలాగే 30, 40 ఏళ్లు దాటిన పెళ్లిపైన పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అయితే పెళ్లి చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని తాజా అధ్యయనాల్లో తేలింది..

పెళ్లితో అయుష్షు పెరుగుతుందా.. !


ఈరోజుల్లో చాలామంది ఒంటరి జీవితాన్ని బతకడానికి ఇష్టపడుతున్నారు అలాగే 30, 40 ఏళ్లు దాటిన పెళ్లిపైన పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అయితే పెళ్లి చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని తాజా అధ్యయనాల్లో తేలింది..

పెళ్లితో పలు రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని తెలుస్తోంది అలాగే పెళ్లి చేసుకుంటే ఆయుష్షు పెరుగుతుందంట... గుండెకు సంబంధించిన సమస్యలు కూడా దరిచారని తెలుస్తోంది ఒంటరిగా జీవించే వారితో పోలిస్తే పెళ్లి చేసుకున్న వారు ఎక్కువ కాలం బతికే అవకాశం ఉందని తెలుస్తోంది.. అలాగే చక్కని జీవితం జీవించడానికి పెళ్లి ఒక మంచి మార్గం అని సమాచారం.. అంతేకాకుండా పెళ్లి చేసుకున్న వారిలో అధిక రక్తపోటు డయాబెటిస్ వంటి సమస్యలు కూడా అదుపులో ఉన్నాయని ఈ అధ్యాయమాల్లో తేలింది.. అలాగే ఎలాంటి మానసిక ఒత్తిళ్ళనైనా ఒక మంచి జీవిత భాగస్వామి ఉన్నవారు తేలికగా ఎదురుకోగలుగుతారని లేకపోతే ఒంటరితనంతో బాధపడే పరిస్థితి వస్తుందని తెలుస్తోంది.. 

అలాగే ఏదైనా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన వారు వివాహితులు అయితే తొందరగా కోలుకుంటున్నట్టు తెలుస్తోంది 50 నుంచి 70 ఏళ్ల వయసు ఉన్న వారిలో కూడా వివాహితులు 16% ఎక్కువగా జీవిస్తున్నారని అలాగే మనిషి ఆనందంగా జీవించడానికి చక్కని వివాహ బంధం అవసరమని తెలుస్తోంది.. అలాగే సామాజిక పరిస్థితుల్లో చుట్టూ ఉన్న మనుషులు కుటుంబం అన్ని కూడా ఒక మనిషి జీవితం పైన ప్రభావం చూపిస్తాయని తాజా అధ్యాయనాల్లో వెలవడింది..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.