Snake gourd : పొట్లకాయను తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్‌

Snake gourd అంటే చీప్‌గా చూస్తారు చాలా మంది.. కానీ ఇవి ఎంత మంచివే తెలుసా.. అసలే ఇది సమ్మర్‌..ఈ సీజన్లో ఆకుకూరలు, వాటర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది.. అసలు snake gourd వల్ల ఆరోగ్యానికి ఏ విధంగా మేలు జరుగుతుందో చూద్దామా..!

Snake gourd : పొట్లకాయను తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్‌
Eating Snake gourd has many health benefits


మార్కెట్‌లోకి వెళ్తే ఎప్పుడూ టమాటాలు, బంగాళదుంపలు, దోసకాయలు, పచ్చిమిర్చి..మహా అయితే ములక్కాయు, బెటర్‌గా ఉండే బెండకాయలు చాలామంది ఇవే తీసుకొస్తారు.. అక్కడే పడి ఉన్న క్యాబేజీ, క్యారెట్‌, బీట్‌రూట్‌, snake gourds, ఆకుకూరలు వీటిని చాలా తక్కువగా తీసుకుంటారు. Snake gourd అంటే చీప్‌గా చూస్తారు చాలా మంది.. కానీ ఇవి ఎంత మంచివే తెలుసా.. అసలే ఇది సమ్మర్‌..ఈ సీజన్లో ఆకుకూరలు, వాటర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది.. అసలు పొట్లకాయ వల్ల ఆరోగ్యానికి ఏ విధంగా మేలు జరుగుతుందో చూద్దామా..!

పొట్లకాయతో ప్రయోజనాలు..

పొట్ల‌కాయ‌ల్లో యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. అందువ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. క‌ణాలు సుర‌క్షితంగా ఉంటాయి. క్యాన్స‌ర్ వంటి వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు. ఫ్రీ ర్యాడిక‌ల్స్ న‌శిస్తాయి. డ‌యాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవ‌చ్చు.

పొట్ల‌కాయల్లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ ల‌క్ష‌ణాలు ఉంటాయి. అందువ‌ల్ల శ‌రీరంలోని వాపులు, నొప్పులు త‌గ్గుతాయి. కీళ్ల నొప్పులు ఉన్న‌వారికి మేలు జ‌రుగుతుంది. ఆ నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

పొట్ల‌కాయ‌ల్లో విట‌మిన్లు ఎ, బి6, సి, ఇ ల‌తోపాటు అనేక ర‌కాల మిన‌ర‌ల్స్ ఉంటాయి. ఫైబ‌ర్‌, పొటాషియం, కాల్షియం, మెగ్నిషియం, ఫాస్ఫ‌ర‌స్, జింక్‌, ఐర‌న్‌, మాంగ‌నీస్‌, అయోడిన్‌లు.. వీటిల్లో అధికంగా ఉంటాయి. వీటివ‌ల్ల పోష‌ణ ల‌భిస్తుంది .

అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌వారు రోజూ పొట్ల‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. లేదా రోజూ పొట్ల‌కాయ జ్యూస్‌ను ఒక గ్లాస్ మోతాదులో తాగ‌వ‌చ్చు. వీటిలో ఉండే ఫైబ‌ర్ బ‌రువును త‌గ్గిస్తుంది. ఆక‌లిని అదుపులో ఉంచుతుంది. కొవ్వును క‌రిగించేందుకు స‌హాయ ప‌డుతుంది.

పొట్ల‌కాయ‌ల జ్యూస్‌ను తాగ‌డం వ‌ల్ల కిడ్నీ స్టోన్లు క‌రిగిపోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి.

పొట్ల‌కాయ‌ల‌ను తింటే జీర్ణ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం ఉండ‌వు. జీర్ణ‌వ్య‌వ‌స్థ శుభ్ర‌మ‌వుతుంది.

హైబీపీ ఉన్న‌వారు రోజూ పొట్ల‌కాయ జ్యూస్‌ను తాగితే ఫ‌లితం ఉంటుంది. అలాగే మ‌హిళలు పీసీవోఎస్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.