Pregnancy : ప్రెగ్నెన్సీ వ్యాయామమా.. ఈ విషయాలతో జాగ్రత్త సుమా.. !

Pregnancy : నిత్య జీవితంలో వ్యాయామన్ని ఒక భాగం చేసుకోవటం దీర్ఘకాలంగా ఎన్నో అనారోగ్య సమస్యలను దరిచారనివ్వకుండా చేస్తుందని ఇప్పటికే బలో మార్లు వైద్యుల చెబుతున్నారు.. అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో చాలామంది

Pregnancy : ప్రెగ్నెన్సీ వ్యాయామమా.. ఈ విషయాలతో జాగ్రత్త సుమా.. !
pregnant women Exercises


Pregnancy : నిత్య జీవితంలో వ్యాయామన్ని ఒక భాగం చేసుకోవటం దీర్ఘకాలంగా ఎన్నో అనారోగ్య సమస్యలను దరిచారనివ్వకుండా చేస్తుందని ఇప్పటికే బలో మార్లు వైద్యుల చెబుతున్నారు... అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో చాలామంది వ్యాయామాలు చేస్తూ ఉంటారు..  అయితే కొంత మంది తెలిసి తెలియక ఈ విషయంలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు.. దీని వల్ల తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యానికి కొన్నిసార్లు నష్టం కలగవచ్చు.. అయితే ఈ సమయంలో చేసే వ్యాయామానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.. 

ప్రెగ్నెన్సీ సమయంలో వ్యాయామం చేయడం తల్లికి కడుపులో బిడ్డకు కూడా ఎంతో మంచిది.. అలాగే ఈ సమయంలో వ్యాయామం చేసినప్పుడు వదులుగా ఉండే బట్టలు వేసుకోవడం మంచిది. అంతేకాకుండా సరైన లోదస్తులు ఎంపిక కూడా అవసరం.. తరచూ చేయడం వల్ల బిడ్డకు ఆక్సిజన్ తరఫున సక్రమంగా జరిగి మెదడు పెరుగుదల బావుంటుందని తెలుస్తోంది.. అయితే ఈ వ్యాయామాలకు కూడా కొన్ని హద్దులు ఉన్నాయి.. ఈ సమయంలో మరీ కఠినమైన వ్యాయామాలు ఎంచుకోకూడదు..  

తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.. అంతేకాకుండా ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే మూడ్ స్వింగ్స్ కూడా అదుపులో ఉంటాయి..  అలాగే హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ కూడా అదుపు చేయవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో అధిక బరువు పెరగకుండా అదుపు చేయవచ్చు.. అలాగే వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, యోగా వంటివి చేయడం మంచిది.. అలాగే బోర్లా పడుకొని చేసే వ్యాయామాలు..  వెల్లకిలా పడుకొని చేసే వ్యాయామాలకు దూరంగా ఉండాలి. అలాగే టెన్నిస్, రన్నింగ్, హై జంప్ వంటి వాటికు కచ్చితంగా దూరంగా ఉండాలి.. 

అలాగే ఊపిరి తిత్తుల కు సంబంధించిన సమస్యలు ఉన్నవారు.. వ్యాయామాలు చేయకపోవడమే మంచిది.. అది చలికాలంలో ఇలాంటివారు మరింత అప్రమత్తంగా ఉండాలి.. ఒకవేళ వ్యాయామాలు చేయాలి అనుకుంటే డాక్టర్ సలహా మాత్రం తీసుకోవటం తప్పనిసరి.. జాగ్రత్తలు తీసుకుంటూ ఖచ్చితమైన నియమాలు పాటిస్తే ఈ సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా తేలిక.. 

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.