లంబాగో పెయిన్ తో బాధపడుతున్నారా.. ఇలా తగ్గించుకోవచ్చు.!

కుర్చోని ఉద్యోగ, వ్యాపారాలు చేయటం వల్ల 60-75 శాతం మందికి వచ్చే కామన్ సమస్య.. మెకానికల్ బ్యాక్ పెయిన్( Actute Back Pain). లేదా లంబాగో(Lumbago). మనకు వచ్చే నొప్పికి

లంబాగో పెయిన్ తో బాధపడుతున్నారా.. ఇలా తగ్గించుకోవచ్చు.!

కుర్చోని ఉద్యోగ, వ్యాపారాలు చేయటం వల్ల 60-75 శాతం మందికి వచ్చే కామన్ సమస్య.. మెకానికల్ బ్యాక్ పెయిన్( Actute Back Pain). లేదా లంబాగో(Lumbago). మనకు వచ్చే నొప్పికి ఇంతపెద్ద పేరు ఉందని కూడా చాలా మందికి తెలియదు. ఏదో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వస్తుందని లైట్ తీసుకుంటారు. మరీ ఈరోజు ఇది రావడానికి గల కారణం, తగ్గించుకే మార్గాలు చూద్దాం. 

ఇది సుమారుగా ఆరు వారాలు వరకూ ఉండొచ్చు. ఆలోపు తగ్గితే లంబాగో అంటారు. అంతకు తగ్గకపోతే నొప్పి వచ్చే భాగంలో డిస్క్ లు కానీ, నర్వస్ పైన ప్రెస్సింగ్ కానీ, ఎముకల్లో వచ్చిన డీ జనరేసివ్ ఛేంజెస్ కానీ ఏమైనా ఉండొచ్చు. అవి తగ్గాలంటే MRI స్కాన్ చేయించుకుని డాక్టర్ సలహాద్వారా ఏం జరుగిందో తెలుసుకుని అందుకు తగ్గట్టు వైద్యం చేయించుకోవాలి. 

లోయ‌ర్‌ బ్యాక్ పెయిన్ మెకానికల్ బ్యాక్ పెయిన్ 

  • కదలకుండా ఎక్కువ గంటలు కుర్చోని పనిచేయటం
  • కుర్చీలోనే 8-10గంటలు కుర్చోని పనిచేయటం. మజిల్స్ అన్ని స్టిఫ్ అయిపోతాయి. ఎముకలపైన భారం పడుతుంది.
  • వంగి ఏదైనా బరువు వస్తులు లేపినప్పుడు పట్టేయటం జరుగుతుంది.
  • మెట్లు ఎక్కేప్పుడు, దిగేప్పుడు సడన్ గా పట్టేస్తుంది.
  • పిల్లలను ఎత్తుకునే పొజిషన్ సరిగ్గా లేక
  • ఫిజికల్ యాక్టివిటీ అసలు లేకపోవడం వల్ల

ఇవన్నీ ఈ పెయిన్స్ కారణాలు. ఈరకమైన బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు మజిల్ స్టిఫ్ అయిపోతాయి. పూసలుపైన ఉండే కండరాలు కదలికలు లేక బిగుసుకుపోయి పెయిన్ వస్తుంది. మరి ఇలాంటి పెయిన్ తగ్గించకోవడానికి ఏం చేయాలి, మళ్లీ భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే ఎలా జాగ్రత్తపడాలి. 

పెయిన్ తగ్గించకోవడానికి

ఇలాంటి లక్షణాలు మీలో ఉంటే లోయ‌ర్‌ బ్యాక్ భాగంలో ముఖ్యంగా వేడినీళ్ల కాపడం బాగా పనికొస్తుంది.  ఎప్సమ్ సాల్ట్ (Epsom salt) అని మనకు సర్జికల్ షాపుల్లో అమ్ముతారు. రెడ్ కలర్ లో ఉంటుంది. ఆవునూనెలో వేసి ఆ సాల్ట్ కలిపి మనకు ఎక్కడైతే పెయిన్ ఉంటుందో ఆ భాగంలో అప్లై చేసేసి కాపడం పెట్టుకోవచ్చు.

రెండో టెక్నిక్ ఏంటంటే..  ముద్దకర్పూరం వేసి పెయిన్ ఉన్న భాగంలో పెట్టుకోవచ్చు. ఆ తర్వాత కాపడం పెట్టండి.

మూడో పద్దతి పుదినా పువ్వు, వాము పువ్వు, ముద్దకర్పూరం సమపాళ్లలో తీసుకుని ఇవి కలిపేస్తే లిక్విడ్ గా అవుతాయి. దీన్ని నొప్పి ఉన్న ప్లేస్ లో పెట్టండి. 

కాపడంపెట్టే టెక్నిలో వేడినీళ్ల కాపడం పెట్టండి. 15-20 నిమిషాలు పెడితే..మజిల్స్ అన్ని రీలాక్స్ అవుతాయి. అప్పుడే మనకు నొప్పి తగ్గినట్లు హాయిగా అనిపిస్తుంది. అయితే ఇక్కడితే వదిలేయకుండా..వేడినీళ్ల కాపడం పెట్టాక..మళ్లీ 10-15 నిమిషాలు ఐస్ కాపడం పెట్టాలి. సర్కులేషన్ బాగా వెళ్లి నూట్రియన్స్ అన్నీ భాగా అందటానికి, వాపు తగ్గించడానికి చాలా బాగా పనికొస్తుంది. ఇలాంటి ట్రీట్మెంట్ రోజుకు రెండుసార్లు అయినా చేసుకుంటే మంచి రిలీఫ్ ఉంటుంది.

సర్జికల్ షాపుల్లో యూవీ లైట్ అని అమ్ముతారు. రెడ్ కలర్ ల్యాంపులు ఉంటాయి. అది కరెంట్ లో పెట్టేసి..మనకు పెయిన్ ఉన్న దగ్గర 40-50 సెంటీమీటర్ల దూరంలో ఉంచి ఆ లైట్ పెయిన్ మీద పడేట్లు చేయండి. అలా చేయడం వల్ల యూవీరెసెస్ వెళ్లి వెంటనే నొప్పి తగ్గుతుంది. రెడ్ లైట్ థెరపీ బాగా ఉపయోగపడుతుంది. మోకాళ్లనొప్పలకు కూడా ఇది చక్కగా పనిచేస్తుంది.


మళ్లీరాకుండా ఉండాలంటే

ప్రతిరోజు కాస్త మజిల్స్ కదిపే విధంగా ఎక్సర్ సైజ్ బాగా ఉపయోగపడతాయి. అదే పనిగా కుర్చోకుండా మధ్యమధ్యలో బ్రేక్ ఇవ్వండి. బెడ్ రెస్ట్ తీసుకోండి. వారానికి రెండురోజులైనా సిస్టమ్ జోలికి వెళ్లకుండా బాగారెస్ట్ తీసుకోండి. వీటికోసం స్పెషల్ గా వ్యాయామాలు ఉంటాయి. తేలికపాటి వ్యాయామాల ద్వారా మజిల్స్ ను బాగా కదిలించవచ్చు. నడుమును పక్కకు తిప్పటం, కాళ్లను పైకి కిందకు కదలించటం లాంటివి. 

మనం చేసేది కుర్చోని చేసే పని.. అది చేయక తప్పదు. కాబట్టి కనీసం రోజుకు 15-30 నిమిషాలు వ్యాయామాలకు కేటాయిస్తే మీరు మిగతా రోజంతా హాయిగా ఏ నొప్పిలేకుండా చేయొచ్చు. శలభాసన్, ధనురాసన్, ఉష్ట్రాసన్ ముఖ్యంగా ఉపయోగపడతాయి. కొద్దికొద్దిగా చేసకుంటూ వెళ్లండి ఆరువారాల్లో పూర్తి ఉపశమనం లభిస్తుంది. అయినా ఎంత సేపటికి తగ్గటం లేదంటే డాక్టర్ ను సంప్రదించి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలని ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

-Triveni Buskarowthu