Hair loss : జుట్టు ఊడుతోందా అయితే ఈ టిప్స్ పాటించండి

Hair fall : జుట్టు రాలిపోతుందని గబగబా ఏవేవో షాంపూలు, నూనెలు రాసేస్తుంటాం. ఫలితం మాత్రం శూన్యం. ఆఖరికి వైద్యుల్ని సంప్రదించి చికిత్స తీసుకునే స్థాయికి వచ్చేశాం. కురులు చిట్లిపోయి ఎదుగుదల లేకపోతే కచ్చితంగా ప్రోటీన్ల లోపమే. విటమిన్ బి లేకపోయినా జుట్టు నిర్జీవంగా తయారవుతుంది.

Hair loss : జుట్టు ఊడుతోందా అయితే ఈ టిప్స్ పాటించండి
Tips for Hair loss


ఒక మనిషి అందంగా కనిపించాలంటే hair తప్పనిసరి, అదే జుట్టు అనారోగ్యానికి గురైతే.....మన బాధ అంతా ఇంతా కాదు. ఈ యాంత్రిక జీవనంలో ప్రస్తుత యువత ఎదుర్కుంటున్న సమస్య Hair fall , చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ Hair problems తో అవస్థలు పడుతున్నారు. కారణం ఏదైనా కావచ్చు. మన చిన్న చిన్న సమస్యలకే ఆందోళన పడిపోతూ ఉంటాం. దానివల్ల మెదడుకు ఒత్తిడి పెరిగి జుట్టు రాలిపోతుంది. చివరకు జట్టు రాలిపోతుందని మరింత ఆందోళన చెందుతూ ఉంటాం.

జుట్టు రాలిపోతుందని గబగబా ఏవేవో షాంపూలు, నూనెలు రాసేస్తుంటాం. ఫలితం మాత్రం శూన్యం. ఆఖరికి వైద్యుల్ని సంప్రదించి చికిత్స తీసుకునే స్థాయికి వచ్చేశాం. కురులు చిట్లిపోయి ఎదుగుదల లేకపోతే కచ్చితంగా ప్రోటీన్ల లోపమే. విటమిన్ బి లేకపోయినా జుట్టు నిర్జీవంగా తయారవుతుంది. కాలుష్యం, తలపై వచ్చే చెమట వల్ల దురదగా ఉంటుంది. ఎక్కువగా చేతితో గీరడం వల్ల జుట్టు రాలిపోతుంది. తలపై మృతకణాలు పేరుకుపోవడం వల్ల చుండ్రు తయారవుతుంది. దానివల్ల మరింతగా జుట్టు రాలిపోతుంది.

 

త్వరగా స్నానం చేసేయాలనే తొందరలో తలను సరిగ్గా కడగం, నురగ ఉన్నా పట్టించుకోం. తల తొందరగా ఆరిపోవాలని డ్రయర్లు పెట్టేసి చకచకపరిగెడతాం.. మరి అక్కడే ఉంది సమస్య. తలలో షాంపూ నురగ పోకపోవడం వల్ల రసాయనాలు మాడుకు అంటుకుని జట్టులో పట్టుత్వాన్ని కోల్పోయాలే చేస్తాయి. డ్రయర్లు పెట్టడం వల్ల వేడి తగిలి జుట్టు ఊడిపోయేలా చేస్తుంది. దీనివల్లే చుండ్రు, జుట్టులో పొక్కులు రావడం వంటివి ప్రారంభమవుతాయి

 

మనం తినే ఆహారంలో ఇవి చేర్చుకుంటే జుట్టు రాలకుండా ఉంటుంది

 

  • మునగాకు-మునగాకు శరీరానికి చాలా మంచిది. మునగాకు పేస్టులో బాదంనూనె కలిపి తలకు ప్యాక్ వేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది
  • ఉల్లిపాయ రసాన్ని మాడుకు పట్టించినా ఫలితం ఉంటుంది
  •  తలస్నానానికి ముందు ఉసిరి రసాన్ని మాడుకు పట్టించి....ఆపై తల కడిగేసుకోవాలి
  •  ఉల్లిపాయలు, పెరుగు, మెంతులు, మందారాకులు పేస్టు చేసి తలకు పట్టించాలి. ఒక పావుగంట అయ్యాక ఎండినట్టు అనిపించాక తల కడిగేయాలి. మరుసటి రోజు రసాయనాలు తక్కువున్న షాంపూతో తలస్నానం చేసుకుంటే మంచిది
  •  మనం వాడే కొబ్బరినూనెలో మెంతులు, వేపాకు, కరివేపాకు, మందారపూవులు వేసుకుని ఆపై నూనెను వాడుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది
  •  తలకు నూనె రాసేప్పుడు....ఏదో రాసేశాంలే అనిపించకుండా ఒక 10 నిమిషాలు వేళ్లతో మర్దన చేసుకోవాలి. అప్పుడు మాడుకు సాంత్వన లభిస్తుంది.
  • పరగడుపున ఉసిరికాయలు తినాలి, భోజనంలో కరివేపాకు, మునగాకు, పాలకూర పెట్టుకోవాలి.
  • జట్టుకు రసాయనాలు ఉంటే కండీషనర్ల కన్నా ఇంట్లో తయారు చేసే కండీషనర్లు మంచిది.
  •  కలబంద, మెంతుల రసాన్ని స్ప్రే సీసాలో వేసుకుని తలస్నానం అయ్యాక...స్ర్పే చేసుకోవాలి.
  • కంటి నిండా నిద్ర మాత్రం తప్పనిసరి సుమా.....
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.