కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుకోవాలా..  వీటిని తీసుకోండి..

శరీరానికి మంచి చెడు రెండు కొలెస్ట్రాల్ ఉపయోగపడతాయి అయితే మంచి కొలెస్ట్రాల్ శరీరంలోని డి విటమిన్, హార్మోన్లు, ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది ఇది శరీరంలో ఎంతవరకు ఉన్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు అయితే చెడు కొలెస్ట్రాల్

కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుకోవాలా..  వీటిని తీసుకోండి..
foods to lower bad Cholesterol

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలి లేకపోతే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి.. అయితే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను ఎలా తగ్గించుకోవచ్చో ఒకసారి చూద్దాం.. 

శరీరానికి మంచి చెడు రెండు కొలెస్ట్రాల్ ఉపయోగపడతాయి అయితే మంచి కొలెస్ట్రాల్ శరీరంలోని డి విటమిన్, హార్మోన్లు, ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది ఇది శరీరంలో ఎంతవరకు ఉన్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు అయితే చెడు కొలెస్ట్రాల్ మాత్రం ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను తీసుకొస్తుంది.. గుండెపోటు, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలతో పాటూ.. రక్తపోటు, ఊబకాయం, గుండె పోటు, నడుము నొప్పులు, కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పులు, కిడ్నీ, మెదడుకు సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి.. అందుకే దీన్ని అదుపులో ఉంచుకోవాలి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.. అయితే  చెడు కొలెస్ట్రాల్​ను తగ్గించడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాము.. 

అవకాడోలు చెడు కొలెస్ట్రాల్​ స్థాయిలను తగ్గించుకోవడంలో ఉపయోగపడతాయి. అలాగే డార్క్ చాక్లెట్, నట్స్, అవిసె గింజలు, చేపలు చెడు కొలస్ట్రాలను అదుపులో ఉంచుతాయి.. బ్లాక్ టీ, గ్రీన్ టీ కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తాయి.. తృణదాన్యాలు, ఆలివ్​ నూనె,  కూరగాయలు, పండ్లు, ఓట్స్​, బార్లీ గింజలు, సోయాబీన్స్, పప్పు దాన్యాలు, చిక్కుళ్లు, చెడు కొలెస్ట్రాల్​ను తగ్గిస్తాయి. అలాగే యాపిల్,​ నారింజ, నిమ్మ, బాదం,​ వెన్న, పసుపు కూడా చెడు కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచి శరీరానికి మేలు చేస్తాయి..