Ovaries Healthy Food : ఈ ఆహారంతో ఓవరీ ఆరోగ్యం మీ చేతుల్లోనే.. !

Ovaries Healthy Food : స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాల్లో అండాశయాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి.. ముఖ్యంగా ఇవి సక్రమంగా ఉంటేనే సంతాన భాగ్యం కలుగుతుంది. లేదంటే ఎన్నో రకాల సమస్యలు

Ovaries Healthy Food : ఈ ఆహారంతో ఓవరీ ఆరోగ్యం మీ చేతుల్లోనే.. !
ovaries healthy


Ovaries Healthy Food : స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాల్లో అండాశయాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి.. ముఖ్యంగా ఇవి సక్రమంగా ఉంటేనే సంతాన భాగ్యం కలుగుతుంది. లేదంటే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. అలాగే ఈ రోజుల్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి సంతానలేమి సమస్య వెంటాడుతుంది. అయితే  ఇందకు ముఖ్య కారణం నిత్యజీవితంలో తీసుకొనే ఆహారం కూడా అని తెలుస్తోంది..

పోషకాహారం తీసుకోకపోవడం వల్ల స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద ప్రభావం చూపుతుందని తెలుస్తోంది. అలాగే నాణ్యత కలిగిన అండాలు విడుదల అవ్వాలి అంటే సక్రమమైన ఆహారంతో పాటు వ్యాయామం కూడా నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి. అయితే ఇందుకు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి అంటే.. 

అవకాడోలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో మొనో శాచురేటెడ్ ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. ఇవి ఓవరీలో ఎగ్‌ హెల్త్‌ మెరుగుపరచడానికి, పునరుత్పత్తి వ్యవస్థను కాపాడటానికి సహాయపడుతాయి. 

అలాగే ఐరన్ తక్కువగా ఉండటం వల్ల కూడా ఓవరికి పలు రకాల సమస్యలను తీసుకొస్తుంది.. అందుకే ముఖ్యంగా ఆహారంలో బీన్స్ వంటి వాటిని తీసుకోవాలి. అలాగే ప్రోటీన్స్ కోసం పప్పు ధాన్యాలను చేర్చుకోవాలి.. అంతేకాకుండా బీ కాంప్లెక్స్, మెగ్నీషియం అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి.. 

అలాగే డ్రై ఫ్రూట్స్, నట్స్లో అధిక స్థాయిలో ప్రోటీన్లు, విటమిన్లు ఉంటాయి. అందుకే తరచూ బాదం, వాల్ నట్, వేరుశనగ, జీడిపప్పు వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల హెల్తీ ఎగ్ ఫార్మేషన్కు అవకాశం ఉంటుంది.. 

అలాగే విటమిన్ సి అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఓవరీ ఆరోగ్యంగా ఉంటుందని తెలుస్తోంది.. 

అలాగే నువ్వుల్లో అధిక స్థాయిలో జింక్, ఐరన్ ఉంటాయి. ఇవి అండాశయం ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాకుండా హార్మోన్లు పనితీరు సక్రమంగా ఉండటానికి సహాయపడతాయి.. 

అలాగే బెర్రీ పండ్లలో అధిక స్థాయిలో విటమిన్ సి, పోలిక్ యాసిడ్ వంటివి ఉంటాయి.. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి. అంతేకాకుండా వాటిని హెల్తీగా ఉంచడానికి ఉపయోగపడతాయి.. 

అలాగే అన్ని రకాల ఆకుకూరలను తీసుకోవాలి.. అందులో ముఖ్యంగా పాలకూర, మునగాకు వంటి వాటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ఐరన్ అందుతుంది. అలాగే బ్రకోలి వంటివి తీసుకోవడం వల్ల పోషకాలు సక్రమంగా అందుతాయి.. అలాగే దాల్చిన చెక్క అండాశయ పనితీరును మెరుగుపరచడంలో ముందుంటుందని తెలుస్తోంది..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.