Weight Loss : బరువు తగ్గాలంటే.. వెల్లుల్లి, తేనె కాంబినేషన్‌ ట్రై చేయండి..!!

వెల్లుల్లి, తేనె కాంబినిషన్‌ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..?వెల్లుల్లిని పోష‌కాల పుట్టిల్లుగా చెప్ప‌వ‌చ్చు. వీటిల్లో విట‌మిన్ బి6, సి, ఫైబ‌ర్‌, మాంగ‌నీస్‌, కాల్షియం వంటి పోష‌కాలు స‌మృద్ధిగా ఉంటాయి. అందువ‌ల్ల Weight loss అవ్వ‌చ్చు

Weight Loss  :  బరువు తగ్గాలంటే.. వెల్లుల్లి, తేనె కాంబినేషన్‌ ట్రై చేయండి..!!
Weight Loss


వెల్లుల్లని అనేక విధాలుగా వాడుకుంటారు భారతీయులు.. పచ్చళ్లలో, తాళింపుల్లో, ఆయుర్వేదంగా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లాభాలు.. అయితే 
వెల్లుల్లి, తేనె కాంబినిషన్‌ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..? ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయట. ఆయుర్వేదంలో ఈ రెండింటికి అధిక ప్రాధాన్య‌త‌ను క‌ల్పించారు. తేనె అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేస్తుంది. అయితే ఈ రెండింటినీ క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల ద‌గ్గు, జ‌లుబు, వాపులు వంటి స‌మ‌స్య‌ల‌తోపాటు హైబీపీ కూడా త‌గ్గుతుంది.

వెల్లుల్లిని పోష‌కాల పుట్టిల్లుగా చెప్ప‌వ‌చ్చు. వీటిల్లో విట‌మిన్ బి6, సి, ఫైబ‌ర్‌, మాంగ‌నీస్‌, కాల్షియం వంటి పోష‌కాలు స‌మృద్ధిగా ఉంటాయి. అందువ‌ల్ల  Weight loss అవ్వ‌చ్చు . వెల్లుల్లిని 8 వారాల పాటు తీసుకుంటే శ‌రీరంలోని కొవ్వు క‌రుగుతుంద‌ని సైంటిస్టులు పరిశోధనలు చేసి మరీ కనుకున్నారు.. దీంతో మెట‌బాలిజం మెరుగు ప‌డుతుంది. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. శ‌రీరంలోని వ్య‌ర్థాలు, విష ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి.
తేనె శ‌రీరానికి శ‌క్తిని అందిస్తుంది. తేనెను తీసుకోవ‌డం వ‌ల్ల కొవ్వును క‌రిగించే హార్మోన్లు విడుద‌లవుతాయట.. తేనెలో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల వాపులు త‌గ్గుతాయి. ఫ్రీ ర్యాడిక‌ల్స్ నాశనం అవుతాయి.
అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు వెల్లుల్లి, తేనెల‌ను ఎలా వాడాలి..
రెండు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తీసుకుని వాటి పొట్టు తీయండి.. బాగా న‌ల‌పాలి. అనంత‌రం ఒక టీస్పూన్ తేనెతో ఆ వెల్లుల్లి మిశ్ర‌మాన్ని క‌లిపి 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచండి... త‌రువాత ఆ మిశ్ర‌మాన్ని ప‌ర‌గ‌డుపునే తీసుకోవాలి. అయితే ఈ మిశ్ర‌మాన్ని ముందుగానే సిద్ధం చేసుకుని ఫ్రిజ్‌లోనూ పెట్టుకుని కూడా వాడుకోవ‌చ్చు. కాక‌పోతే ఒక‌సారి సిద్ధం చేసిన మిశ్ర‌మాన్ని 3 రోజుల్లోగా తీసుకోవాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువరోజులు మాత్రం వాడకూడదు.
అధికంగా వద్దు..
ఇక వెల్లుల్లి రెబ్బ‌ల‌ను రెండు క‌న్నా ఎక్కువ‌గా ఉప‌యోగించవద్దు...ఎక్కువగా వెల్లుల్లిని తీసుకుంటే శ్వాస స‌మ‌స్య‌లు వ‌స్తాయి. నోట్లో, నాలుక‌పై, గొంతులో మండిన‌ట్లు అవుతుంది. గ్యాస్‌, గుండెల్లో మంట‌, అసిడిటీ, వికారం, వాంతికి వ‌చ్చిన‌ట్లు ఉండ‌డం, శ‌రీరం నుంచి దుర్వాస‌న రావ‌డం, డ‌యేరియా వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.
అందువ‌ల్ల వెల్లుల్లిని ఎక్కువ‌గా తీసుకోవద్దు.. ఎవ‌రిలో అయినా ముందు తెలిపిన ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే వెంట‌నే ఆ మిశ్ర‌మాన్ని తిన‌డం ఆపేయాలి. గ‌ర్భిణీలు, పాలిచ్చే త‌ల్లులు, ర‌క్తం ప‌లుచ‌గా అయ్యే మందుల‌ను తీసుకునే వారు డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు ఈ మిశ్ర‌మాన్ని వాడాల్సి ఉంటుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.