Korean glass skin : ఇంటి చిట్కాలతో కొరియన్‌ గ్లాస్‌ స్కిన్‌ మీ సొంతం..!

ప్రతి అమ్మాయి అందంగా ఉండాలనే అనుకుంటుంది.మీరు  Korean సిరీస్‌ చూసే ఉంటారు..మీకు కూడా అలాంటి  Korean glass skin కావాలా..? అయితే ఇంట్లోనే  Korean glass skin పొందే చిట్కాలు మీకోసం..! 

Korean glass skin : ఇంటి చిట్కాలతో కొరియన్‌ గ్లాస్‌ స్కిన్‌ మీ సొంతం..!
Beauty tips for Korean glass skin


అందంగా ఉండాలనుకోవడం ఆడవారి వీక్‌నెస్.. ప్రతి అమ్మాయి అందంగా ఉండాలనే అనుకుంటుంది. దానికోసం తన ఆఖరి రూపాయి వరకూ ఖర్చుపెడుతుంది. అయితే అందరూ ఇలానే ఉంటారు అని కాదు.. ఖర్చు పెట్టకుండా కూడా అందంగా ఉండే మహిళలు చాలా మంది ఉన్నారు. మీరు  Korean సిరీస్‌ చూసే ఉంటారు. వాళ్లు అసలు ఏమన్నా కలర్ ఉంటారా..? ముట్టుకుంటే మాసిపోయే రంగు వాళ్లది..మీకు కూడా అలాంటి  Korean glass skin కావాలా..? అయితే ఇంట్లోనే  Korean glass skin పొందే చిట్కాలు మీకోసం..! 

తేనె

చర్మ సంరక్షణకు తేనె ఉత్తమమైనది. మీ చర్మానికి రెగ్యులర్‌గా తేనెను అప్లై చేయడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. మెరుస్తున్న ఆరోగ్యకరమైన, యవ్వనంగా కనిపించే చర్మం మీకు వచ్చేందుకు ఇది సహాయపడుతుంది. తేనెను చర్మానికి 10 లేదా 15 నిమిషాలు అప్లై చేయడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

రైస్ వాటర్

రైస్ వాటర్‌ను స్కిన్ టోనర్‌గా రోజుకు రెండుసార్లు లేదా రోజుకు ఒకసారి ఫేషియల్ మాస్క్‌గా ఉపయోగించడం సురక్షితం. బియ్యం(Rice) నీరు ఎండ, యాంటీ ఏజింగ్(Anti Ageing) నుండి కూడా రక్షిస్తుంది. బియ్యాన్ని ముందుగా కడగండి. ఆ తర్వాత కొన్ని నీళ్లు పోసి.. కనీసం 30 నిమిషాలు నీటిలో నానబెట్టాలి. బియ్యం నీటిని తీయండి. అవి వాడుకోవచ్చు. లేదంటే.. బియ్యం ఉడకబెట్టి, దాని గంజిని వడకట్టి కూడా ఉపయోగించొచ్చు. ఎలా చేసినా మంచి ప్రయోజనాలు ఉంటాయి.

గ్రీన్ టీ

గ్రీన్ టీలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది కొత్త చర్మ కణాలను ప్రోత్సహిస్తుంది. చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతం చేస్తుంది. ఇందులో విటమిన్ బి2 కూడా ఉంటుంది. ఇది చర్మాన్ని దృఢంగా, యవ్వనంగా ఉంచుతుంది. ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. రోజూ గ్రీన్‌ టీ తాగడం అలవాటుగా చేసుకుంటే అటు అందం ఇటు ఆరోగ్యం రెండు బాగుంటాయి. 

కలబంద

ఇది మొటిమలు, ఇతర చర్మ పరిస్థితులను మాయిశ్చరైజింగ్, ఎక్స్‌ఫోలియేటింగ్, చర్మాన్ని మృదువుగా చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది. మనం దీన్ని ముఖాని రెగ్యులర్‌గా ఉపయోగించుకోవచ్చు. జెల్‌ను తీయడానికి కలబంద ఆకును సగానికి కట్ చేయండి. దీన్ని మీ ముఖానికి అప్లై చేసి గంటసేపు అలాగే వదిలేయండి. అయితే కొంతమందికి కలబంద అస్సలు పడదు. దీన్ని వాడితే.. తెల్లగా అవ్వడం అటుంచి ఉన్న అందం కూడా పోతుంది.. అలాంటి వాళ్లు వదిలేయండి. వేరే చిట్కాలు ట్రే చేయండి.!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.