toenail fungus : గోళ్లకు వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్ కు వెల్లుల్లితో ఇలా చెక్ పెట్టండి.. !

toenail fungus గోళ్లకు ఫంగస్ క్రిములు చేరి ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. దీని వల్ల గోళ్లు పుచ్చిపోవడం కానీ, గోళ్లు రంగుమారటం లాంటిది చాలా మందిలో జరుగుతుంది. కొందరికైతే.. ఈ ఇన్ఫెక్షన్ 

toenail fungus : గోళ్లకు వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్ కు వెల్లుల్లితో ఇలా చెక్ పెట్టండి.. !
Beautiful Toe Fingers

గోళ్లకు ఫంగస్ క్రిములు చేరి ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. దీని వల్ల గోళ్లు పుచ్చిపోవడం కానీ, గోళ్లు రంగుమారటం లాంటిది చాలా మందిలో జరుగుతుంది. కొందరికైతే.. ఈ ఇన్ఫెక్షన్  మునిగోళ్లదాకా వెళ్లిపోయి అక్కడ స్కిన్ కూడా పాడవుతుంది. గోరు ఆరోగ్యం అంతా మెల్లగా దెబ్బతినడం జరుగుతుంది. వీటికి మందులు వాడితే తగ్గుతూ ఉంటాయి.. కానీ మల్లా వస్తూ ఉంటాయి. పరిశుభ్రత ముఖ్యంగా పాటించకపోయినందు వల్ల ఫంగల్ క్రిములు కొన్ని ఆహారదార్థాల ద్వారా.. గోళ్లలో ఇరుక్కుపోతాయి, మోషన్ కు వెళ్లినప్పుడు కూడా క్లీన్ చేసినప్పటికీ కొన్నిసార్లు ఆ ఫంగల్ క్రిములు కూడా గోళ్లలో ఇరుక్కుపోతాయి. ఇలా ఏదో ఒక రూపంలో గోళ్లకు ఫంగల్ ఇన్ఫెక్షన్ కలిగినప్పుడు దాన్ని నాచురల్గా తగ్గించుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

toenail fungus : infected toenail with fungus

వెల్లులి పేస్ట్ ఈ గోళ్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ ను తగ్గించడానికి అద్భతంగా పనికొస్తుందని సైంటిఫిక్ గా 2009లో నిరూపించారు. బెల్ ఫాస్ట్ సిటీ హాస్పటల్- ఐర్లాండ్( ‌Belfast City Hospital- Ireland) వారు ఈ నెయిల్స్ కు వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి పనికొస్తున్నారు.. పరిశోధనలో తేల్చారు. 

వెల్లులి ఏ రకంగా పనిచేస్తుంది.. ఎలా ఉపయోగించాలంటే

గార్లిక్ లో ఉండే అలిసిన్ (Allicin) అనే కెమికల్ కాంపౌండ్ పవర్ ఫుల్ యాంటీఫంగల్ ఏజెంట్ గా పనికొస్తుంది. తొక్కలు తీసేసిన నాలుగు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని వాటిని మెత్తగా పేస్ట్ చేయండి. ఆ పెస్ట్ కి వంటసోడా ఒక స్పూన్ కలపాలి. ఆ మిశ్రమంలో 1-2 స్పూన్లు వెనిగర్ కలపాలి. ముద్దలాగా అవుతుంది. దీన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కడైతే ఉంటుందో.. అక్కడ పెట్టేసి క్లాత్ తో కానీ, బ్యాండేజ్ కాటన్ తో కానీ ఆ గోరుమీద చుట్టేయండి. ఒక గంటపాటు అలా ఉంచండి. రోజుమార్చి రోజు నాలుగు వారాల పాటు చేస్తే..ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గడమే కాకుండా..ఇక ఎప్పటికీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తాయట. 

వెనిగర్ లేకుంటే.. యూకలిప్టస్ ఆయిల్ అయినా వాడొచ్చట. అది లేకపోతే..కొబ్బరినూనె అయినా వాడుకోవచ్చు. ఇది అయితే అందరి ఇళ్లలో ఉంటుంది. టీ ట్రీ ఆయిల్ ఆయినా వాడుకోవచ్చు. ఇ‌వి యాంటిఫంగల్ గా పనికొస్తాయి. ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తాయని సైంటిఫిక్ గా నిరూపించారు.

వంటసోడా వేయటం వల్ల నెయిల్స్ స్మూత్ అవుతాయి. పాడైపోయిన గోరుభాగాన్ని మళ్లీ ఆరోగ్యంగా చేయడానికి సోడా ఉపయోగపడుతుంది.

నాలుగువారాలు అంటే.. సుమారుగా 15సార్లు అప్పుడప్పుడు అలా పెట్టుకుంటే..కలర్ మారిన గోర్లు మళ్లీ నాచురల్ కలర్ రావడానికి, గోరుకు ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గిపోవడాని, పుచ్చుగోరు తగ్గడానికి, మళ్లీ గోర్లు రావడానికి ఈ పద్దతి పనికొస్తుంది. 

పూర్వంరోజుల్లో.. వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయని.. తొలిఏకాదశి అప్పుడు గోరింటాకు పెట్టుకోవాలని ఆచారం పెట్టారు. గోరింటాకు పెట్టడం వల్ల పవర్ ఫుల్ యాంటీఫంగల్ ఏజెంట్ గా గోరింటాకు అద్భుతంగా పనికొస్తుంది. మీకు వీలైతే..సంవత్సరానికి రెండుమూడు సార్లు పెడితే..అసలు గోర్లకు ఎలాంటి సమస్యలు రావు. అందుకే..పెద్దోళ్లు పెట్టిన ప్రతిఆచారం వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది.

మనకు ఇప్పుడు గోర్లను మంచి షేప్ లో ఉంచుకోవడం అంటే ఇష్టం. ఆఖరికి అబ్బాయిలు కూడా గోర్లను పెంచేస్తున్నారు. గోర్లు పెంచుకోవాలనుకునే వారు వాటిపై చాలా శ్రద్ధ పెట్టాలి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఏమాత్రం డస్ట్ గోర్లలో ఇరుక్కోపోయినా.. అది ఆరోగ్యానికి, అందానికి ఏమాత్రం మంచిది కాదు. గోరింటాకు పెట్టుకోవడం ఇష్టంలేని వాళ్లు పైన పేర్కొన్న గార్లిక్ టెక్నిక్ ను వాడుకుంటే సరిపోతుందని ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు తెలిపారు.