పిల్లలను ఎంతసేపు నిద్రపుచ్చాలంటే.. !

Child Sleep : చిన్న పిల్లల్లో నిద్ర మరింత ముఖ్యమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఏ వయసు పిల్లలు ఎంత సేపు నిద్రపుచ్చాలి అంటే.. 

పిల్లలను ఎంతసేపు నిద్రపుచ్చాలంటే.. !


Child Sleep : నిద్ర చాలా ముఖ్యమైన అంశం.. ఏ వయసు వారికైనా తగినంత నిద్ర అవసరం. దీని వలన శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే చిన్న పిల్లల్లో నిద్ర మరింత ముఖ్యమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఏ వయసు పిల్లలు ఎంత సేపు నిద్రపుచ్చాలి అంటే.. 

అప్పుడే పుట్టిన పిల్లల నుంచి కొంత వయసు వచ్చే వరకు పిల్లలను గాఢ నిద్రకు అలవాటు చేయడం ఎంతో అవసరం. దీని వలన వారి మెదడు పెరుగుదల సక్రమంగా ఉంటుంది.. వారి ఎదుగుదలకు తోడ్పడే ముఖ్యమైన అంశాల్లో నిద్ర కూడా ఒకటి. ఇంత ముఖ్యమైన నిద్రను అప్పుడే పుట్టిన పిల్లలు త్వరగా అలవాటు చేసుకోలేరు. కాసేపు నిద్రపోయి మేల్కోవడం, అర్ధరాత్రిలో నిద్రలేవటం వంటివి చేస్తూనే ఉంటారు. తల్లిదండ్రులు ఎంతగా ప్రయత్నించినా కొన్నిసార్లు వారిని నిద్రపుంచడం అంత తేలికైన విషయం కాదు. అయితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా పిల్లలకు తగినంత నిద్రను అందించగలిగితే వారి ఆరోగ్యం సక్రమంగా ఉంటుందని తెలుస్తోంది. అయితే అప్పుడే పుట్టిన పిల్లలకు ఎంత నిద్ర ఉండాలి అంటే.. 

సాధారణంగా అప్పుడే పుట్టిన పిల్లలకు నెల రోజుల వరకు రోజుకు 15 నుంచి 16 గంటల నిద్ర చాలా అవసరం. అయితే ఈ వయసు పిల్లలు పాల కోసం ప్రతీ సారీ నిద్రలేస్తూనే ఉంటారు.. ముఖ్యంగా ఈ సమయంలో తల్లి పాలనే ఇస్తూ ఉంటారు కాబట్టి పాలు పట్టిన వెంటనే మళ్లీ పడుకోబెట్టడం చాలా అవసరం. ఇలా ఈ సమయంలో నెమ్మదిగా నిద్రకు అలవాటు పడతారు పిల్లలు.. అలాగే నెల రోజులు దాటిన దగ్గర నుంచి దాదాపు నాలుగు నెలల వరకు రోజుకు 14 నుంచి 15 గంటలు నిద్రపుచ్చటం చాలా అవసరం. ఈ సమయంలో వారు ఈ వాతావరణానికి అలవాటు పడుతూ ఉంటారు.. 

అలాగే నాలుగు నెలలు నిండిపోయిన తర్వాత దాదాపు సంవత్సరం వరకు రోజుకి 13 నుంచి 14 గంటలు నిద్రపుచ్చాలి.. అంటే రోజులో సగ భాగం అప్పుడప్పుడు మేల్కొంటూనే ఉంటారు. ఈ సమయంలోనే వారికి పగలు, రాత్రి నిద్ర తేడాలు అలవాటు అవుతూ ఉంటాయి.. సంవత్సరం నుంచి మూడేళ్ల పాటు పిల్లలకి రోజుకి 12 నుంచి 14 గంటలు నిద్రపుచ్చాలి. ఈ సమయంలో పిల్లల శారీరక, ఎదుగుదలలో మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి కాసేపు ఆడుకుంటూ నిద్రపోతూ ఉంటారు.. 

అలాగే మూడేళ్లు దాటిన తర్వాత నెమ్మదిగా పిల్లలు ఈ ప్రపంచాన్ని గమనించడం మొదలు పెడతారు. ఈ సమయంలో వారి బ్రెయిన్ ఎదుగుదల కూడా వేగంగా ఉంటుంది దాదాపు ఆరేళ్ల వరకు పిల్లల బ్రెయిన్ ఎదుగుదల అత్యంత వేగంగా ఉంటుందని తెలుస్తోంది ఆ తర్వాత నెమ్మదిగా మందగిస్తుందని అందుకే ఈ సమయంలో వారికి తగినంత విశ్రాంతిని అందించాలని చుట్టూ ఉన్న అన్ని విషయాలను నెమ్మది నెమ్మదిగా అర్ధమైనట్టు చెబుతూ రోజుకి కనీసం పది నుంచి 12 గంటలు నిద్రపుచ్చటం ముఖ్యమని తెలుస్తోంది.. అలాగే పిల్లలకు పదేళ్లు వచ్చేంత వరకు రోజుకు దాదాపు పది గంటలు నిద్ర ఉండటం వల్ల శారీరక అలసట దూరమవుతుందని తెలుస్తోంది అలాగే పిల్లలు పడకగదిని శుభ్రంగా ఉంచాలి. వారికి ప్రశాంతమైన నిద్ర అందేటట్టు తల్లి తండ్రి చూడాలి..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.