Kidney disease : కిడ్నీల ఆరోగ్యానికి క్యాప్సికమ్‌కు సంబంధం ఉందా..?
Kidney disease : కిడ్నీల ఆరోగ్యానికి క్యాప్సికమ్‌కు సంబంధం ఉందా..?
మనిషి శరీరంలో ప్రతి అవయవం చాలా ముఖ్యమైనది.. దేన్ని లైట్ తీసుకోవడానికి లేదు.. సైజులో చిన్నగా ఉన్నా.. మొత్తం మనిషి ఆరోగ్యాన్ని కిడ్నీలే శాసిస్తాయి.. మనం తిన్న ఆహారంలో వ్యర్థాలను ఫిల్టర్ చేస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది Kidney disease తో ఇబ్బందులు పడుతున్నారు
మనిషి శరీరంలో ప్రతి అవయవం చాలా ముఖ్యమైనది.. దేన్ని లైట్ తీసుకోవడానికి లేదు.. సైజులో చిన్నగా ఉన్నా.. మొత్తం మనిషి ఆరోగ్యాన్ని కిడ్నీలే శాసిస్తాయి.. మనం తిన్న ఆహారంలో వ్యర్థాలను ఫిల్టర్ చేస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది కిడ్నీ సంబంధ Kidney disease తో ఇబ్బందులు పడుతున్నారు. అనేక మంది కిడ్నీలు చెడిపోవడం వల్ల చనిపోతున్నారు. కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు..
మరి ఆ ఆహారాలు ఏంటంటే..
మార్కెట్‌లో రక రకాల క్యాప్సికం అందుబాటులో ఉంటుంది. అందులో ఎరుపు రంగు క్యాప్సికం కూడా ఒకటి. ఇది కాస్త కాస్ట్లీలే.. వీటిని తినడం వల్ల కిడ్నీలను సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఈ క్యాప్సికంలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే వీటిలో ఉండే విటమిన్ ఏ, సీ, బీ6, ఫైబర్, ఫోలిక్ యాసిడ్‌లు కిడ్నీ వ్యాధులు రాకుండా చూస్తాయి. ఎరుపు రంగు క్యాప్సికంను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా కిడ్నీ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.
కిడ్నీ సమస్యలు ఉన్నవారు, లేని వారు ఎవరైనా సరే.. క్యాబేజీని తప్పనిసరిగా తినాలి. కానీ ఇది చాలామందికి అంతగా నచ్చదు.. క్యాబేజీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కిడ్నీలను సురక్షితంగా ఉంచుతాయి. కిడ్నీ వ్యాధులు రాకుండా ఉంటాయి. డయాలసిస్ పేషెంట్లు క్యాబేజీని తినడం మేలు. ఇందులో ఉండే విటమిన్ కే, సీ, ఫైబర్‌లు కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
కాలిఫ్లవర్‌లో విటమిన్ సీ, ఫైబర్, ఫొలేట్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కిడ్నీలను సంరక్షిస్తాయి. డయాలసిస్ పేషెంట్లు కాలిఫ్లవర్‌ను తినడం అలవాటు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
ఉల్లిపాయలు, వెల్లుల్లిలో క్రోమియం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కిడ్నీల ఆరోగ్యం మెరుగు పడుతుంది. అలాగే వీటిలో ఉండే ఫ్లేవనాయిడ్స్ కిడ్నీలను సురక్షితంగా ఉంచుతాయి. డయాలసిస్ రోగులు ఈ రెండు ఆహారాలను నిత్యం తీసుకోవడం ఉత్తమం.
క్రాన్‌బెర్రీలు, స్ట్రాబెర్రీలను ఎక్కువగా తింటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కిడ్నీలను సంరక్షిస్తాయి.
గమనిక :
ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణులను సంప్రదించండి.