Jaggery, Ginger : బెల్లం, అల్లం కలిపి తింటే..మలబద్ధకం, హైబీపీ, రక్తహీనత ఉండదా..!

Jaggery Ginger ;రెండూ ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌నిచ్చే ప‌దార్థాలే.అల్లం, బెల్లం మిశ్ర‌మాన్ని రోజూ రెండు పూట‌లా కొద్ది మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో చూద్దామా..!

Jaggery, Ginger : బెల్లం, అల్లం కలిపి తింటే..మలబద్ధకం, హైబీపీ, రక్తహీనత ఉండదా..!
Jaggery, ginger for Constipation, hypertension, anemia


Jaggery , పచ్చిశనగపప్పు కలిపి తినే అలవాటు చాలామందికి ఉంటుంది. చిన్నప్పుడు అంతా తినే ఉంటారు. కానీ Jaggery, Ginger కలిపి ఎప్పుడైనా తిన్నారా..? అసలు అలా తింటారా అని డౌట్‌ వస్తుంది కదా మీకు.! కానీ ఈ రెండింటిని కలిపి తింటే బోలెడు ప్రయోజనాలు. Ginger ...Jaggery..... రెండూ ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌నిచ్చే ప‌దార్థాలే. వీటిని మ‌నం త‌ర‌చూ వంటల్లో ఉప‌యోగిస్తుంటాం. రెండింటిలోనూ అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి. అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకునేందుకు ఇవి రెండూ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అయితే ఈ రెండింటినీ క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల ఇంకా ఎక్కువ లాభాలు క‌లుగుతాయి. అల్లం, బెల్లం మిశ్ర‌మాన్ని రోజూ రెండు పూట‌లా కొద్ది మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో చూద్దామా..!

 
రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో అల్లం, బెల్లం మిశ్ర‌మం అద్భుతంగా ప‌నిచేస్తుంది. బెల్లంలో జింక్‌, సెలీనియం త‌దిత‌ర పోష‌కాలు ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడిక‌ల్స్ వ‌ల్ల శ‌రీరానికి క‌లిగే న‌ష్టాన్ని తగ్గిస్తాయి.. ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చూస్తాయి. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి చిన్న చిన్న అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చూస్తాయి.

జీర్ణ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారికి అల్లం, బెల్లం మిశ్ర‌మం ఎంత‌గానో ప‌నిచేస్తుంది. మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. పేగుల్లో ఆహారం క‌ద‌లిక‌లు స‌రిగ్గా ఉంటాయి. రెండింటిలో ఉండే ఫైబ‌ర్ జీర్ణ‌శ‌క్తిని పెంచుతుంది. భోజ‌నం త‌రువాత అల్లం, బెల్లం మిశ్ర‌మాన్ని తీసుకుంటే ఫ‌లితం ఉంటుంది.

అల్లం, బెల్లం మిశ్ర‌మాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తం శుద్ధి అవుతుంది. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి, లివ‌ర్‌లోని వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి, శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. శ‌క్తి ల‌భిస్తుంది. హైబీపీ నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుంది. రుతు స‌మ‌యంలో స్త్రీల‌కు నొప్పులు కూడా త‌గ్గుతాయి.

అల్లం, బెల్లం మిశ్ర‌మంలో తేనె క‌లిపి కూడా తీసుకోవ‌చ్చు. దీంతో శారీర‌క దృఢ‌త్వం ల‌భిస్తుంది. అనారోగ్య స‌మ‌స్య‌లు, ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.

పైన పేర్కొన్న సమస్యలు దాదాపు అందరికీ ఉంటున్నాయి.. కాబట్టి ఈ చిట్కాను ఒకసారి ట్రే చేయండి..పోయేదేముంది..!

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.