Reverse dieting : రివర్స్‌ డైటింగ్‌తో వెయిట్‌ లాస్‌ అవ్వొచ్చు తెలుసా..!

Reverse dieting.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా..? ఈ diet ను ఎక్కువగా వ్యాయామం చేసేవాళ్లు, బాడీ బిల్డర్లు, బాక్సింగ్‌ చేసేవాళ్లు పాటిస్తారట.. ఈ diet మీద ఇప్పటికే పరిశోధనలు చేశారు. ఈ డైట్‌ను పాటిస్తే.. over weight ఈజీగా తగ్గించుకోవచ్చని తేలింది.

Reverse dieting : రివర్స్‌ డైటింగ్‌తో వెయిట్‌ లాస్‌ అవ్వొచ్చు తెలుసా..!
weight loss with reverse diet


Reverse dieting.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా..? ఈ diet ను ఎక్కువగా వ్యాయామం చేసేవాళ్లు, బాడీ బిల్డర్లు, బాక్సింగ్‌ చేసేవాళ్లు పాటిస్తారట.. ఈ diet మీద ఇప్పటికే పరిశోధనలు చేశారు. ఈ డైట్‌ను పాటిస్తే.. over weight ఈజీగా తగ్గించుకోవచ్చని తేలింది. ఇంతకీ Reverse dieting లో ఏం తింటారు..ఎలా చేస్తారో చూద్దామా..! 
రివ‌ర్స్ డైటింగ్ చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో శ‌క్తి స్థాయిలు పెరుగుతాయి. మెట‌బాలిజం పెరుగుతుంది. దీంతో అధిక బ‌రువు త‌గ్గుతారు. రివ‌ర్స్ డైటింగ్ అంటే.. ఒక డైట్‌ను పాటించాక ఇంకో డైట్‌ను పాటించ‌డం అన్న‌మాట‌. ముందుగా కొన్ని నెల‌ల పాటు కఠిన ఆంక్ష‌ల‌తో కూడిన డైట్‌ను పాటిస్తారు. త‌రువాత మ‌రో డైట్‌ను పాటిస్తారు. ఇలా ఒక డైట్‌లో క‌ఠిన ఆహార నియ‌మాలు పాటించి వెంట‌నే ఇంకో డైట్‌ను మొద‌లు పెట్ట‌డం వ‌ల్ల శ‌రీరం మ‌నం తీసుకునే ఆహారం నుంచి త‌క్కువ క్యాల‌రీల‌ను మాత్ర‌మే గ్ర‌హిస్తుంది. మెట‌బాలిజం మెరుగు ప‌డుతుంది. రివ‌ర్స్ డైటింగ్ చేయ‌డం వ‌ల్ల మెట‌బాలిజం మెర‌గుప‌డ‌డ‌మే కాదు శ‌రీరంలో శ‌క్తి స్థాయిలు పెరుగుతాయి. ఆక‌లి కంట్రోల్‌లో ఉంటుంది.

ప్ర‌స్తుతం బరువు తగ్గేందుకు మ‌న‌కు అనేక ర‌కాల డైట్ లు అందుబాటులో ఉన్నాయి. కీటో డైట్ అని, వీగ‌న్ డైట్ అని.. ఇలా ఒక డైట్ త‌రువాత ఇంకో డైట్‌ను పాటించ‌డాన్నే రివ‌ర్స్ డైటింగ్ అంటారు. ఒక్కో డైట్‌లో భాగంగా నిర్దిష్ట‌మైన ఆహారాల‌ను మాత్ర‌మే తినాల్సి ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు కీటో డైట్‌లో కార్బొహైడ్రేట్ల‌ను త‌క్కువ‌గా, కొవ్వులు, ప్రోటీన్ల‌ను ఎక్కువ‌గా ఉన్నవి తింటారు. అలాగే వీగ‌న్ డైట్‌లో కేవ‌లం శాకాహార ప‌దార్థాల‌ను మాత్ర‌మే తీసుకుంటారు. ఇక లిక్విడ్ డైట్‌లో కేవ‌లం ద్ర‌వాహారాల‌ను మాత్ర‌మే తీసుకుంటారు. ఇలా ఒక్కో డైట్‌ను కొన్ని రోజుల పాటు పాటిస్తూ మ‌ళ్లీ ఇంకో డైట్‌లోకి మారాల్సి ఉంటుంది.

వీళ్లు పాటించకూడదు..

డిప్రెష్, ఆందోళ‌న‌, ఒత్తిడి, కిడ్నీ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఇలా రివర్స్ డైట్ చేయకూడదు.. ఆరోగ్యంగా ఉన్న‌వ్య‌క్తులు ఈ డైట్‌ను పాటించాల్సిన ప‌నిలేదు. జిమ్ లేదా బాడీ బిల్డింగ్‌, బాక్సింగ్ వంటివి చేస్తామ‌నుకుంటేనే ఈ డైట్‌ను పాటించాలి. అలాగే బరువు తగ్గాలి అనుకున్న వారు ఈ డైట్‌ను పాటిస్తే మంచి రిజల్ట్‌ ఉంటుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.