బాబోయ్‌.. ప్లాస్టిక్ వాడకం మగవారి వీర్యకణాలకు, ఆడవారి ఈస్ట్రోజన్ హార్మోన్ కు చాలా ప్రమాదకరమట..!

భూమిలో సంవత్సరాలపాటు ప్లాస్టిక్‌ కలిసిపోదు అందుకే వాడ‌వ‌ద్దంటార‌ని అనుకుంటారు. కాని ప్లాస్టిక్‌ ఆరోగ్యానికి ఏ విధంగా హాని చేస్తుందో ఈరోజు తెలుసుకుందాం. కొందరైనా ఈ ఆర్టికల్ ద్వారా వాడకం తగ్గిస్తారని ఆశిస్తున్నాం..

బాబోయ్‌.. ప్లాస్టిక్ వాడకం  మగవారి వీర్యకణాలకు, ఆడవారి ఈస్ట్రోజన్ హార్మోన్ కు చాలా ప్రమాదకరమట..!
chemicals that Harm Human Fertility


చాలామంది చేసే తప్పు ప్లాస్టిక్ వాడకం. ప్రభుత్వాలు కూడా వీటిని వాడిన వారికి జరిమానా విధిస్తూ వస్తున్నాయి.. అయితే వీటి నిషేధం పై ఆశించినంత స్థాయిలో ఫలితాలు రావడం లేదు. వీటిని ఎందుకు వాడొద్దు అంటున్నారు అనే దానిపై చాలా మందికి కరెక్టు రీజన్స్ తెలియవు. పర్యావరణానికి మాత్రమే ఇది హానికరం.. భూమిలో ఎన్ని సంవత్సరాలు అయినా ఇది కలిసిపోదు అందుకు మాత్రమే వద్దు అంటున్నారు అని చాలామంది అనుకుంటారు. అసలు ఇది ఆరోగ్యానికి ఏ విధంగా హాని చేస్తుందో ఈరోజు తెలుసుకుందాం. కొందరైనా ఈ ఆర్టికల్ ద్వారా వాడకం తగ్గిస్తారని ఆశిస్తున్నాం.


ప్లాస్టిక్ కవర్స్, బ్యాగ్స్ ఎలా చేస్తారంటే


పాలిఇథలీన్, పెట్రోలియం బై ప్రొడెక్ట్స్ తో వీటిని తయారు చేస్తారు. ఇందులో హాని కలిగించే విషపదార్థాలు లాంటివి, దీర్ఘరోగాలకు కారణమయ్యే కెమికల్స్ అనేకం కలుపుతారు. ఆర్సనిక్, లెట్, నికిల్, బీపీఏ అనే అతి ప్రమదాకరమైన కెమికల్స్, కొన్ని తక్కువ ప్రమాదకరమైన కెమికల్స్ కాంబినేషన్ తో ప్లాస్టిక్ కవర్స్, వస్తువులు తయారవుతాయి. తక్కువ ఖర్చులో ఎక్కువ సౌకర్యంగా ఉండటంతో జనాలు వీటిని వాడడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఇవి అనేక రకాల నష్టాలను కలిగిస్తాయి. ఈ కవర్స్ లో ఆహారాలు వేసుకెళ్తారు, ఈ కవర్స్ ను మనసైడ్ నుంచి మనం డస్టబిన్ లో వేస్తాం. కానీ.. ఇది భూమిలో కరగదు., భూమిలో పాతిపెట్టినా ఇది కరగదు..కాల్చితే దీని నుంచి వచ్చే పొగ మరింత ప్రమాదకరం, అలా వదిలేస్తే..పశువుల తింటాయి...ఇలా అనేక రకాల ఇబ్బందులు వీటివల్ల కలుగుతున్నాయి కాబట్టి  ప్రభుత్వాలు వద్దంటే వద్దూ అని మొత్తుకుంటున్నాయి.


ప్లాస్టిక్ ను కాల్చితే ఎలాంటి నష్టాలు వస్తాయి


ప్లాస్టిక్ కవర్స్ ను, బ్యాగ్స్ ను కాల్చినప్పుడు అవి మండే పొగలో విడుదలయ్యే వాయివులు క్యాన్సర్ కారకాలు. అందులో ముఖ్యంగా తీసుకుంటే..లెడ్, కార్భైన్ మోనాక్సైడ్ లాంటివి ఎక్కువ రిలీజ్ అవుతాయి. ఈ రెండు వాయువులు పీలిస్తే ఊపిరిత్తులు డామేజ్ అవుతాయి. శ్వాసకోస సంబంధిత వ్యాధులు ఎక్కువ వస్తాయి. 


మండే కొద్ది ఇంకా ఆర్సినిక్, నికిల్ కూడా రిలీజ్ అవుతుంది. ఇవన్నీ అనేక రకాల క్యాన్సర్ కు, రక్తాన్ని పాడుచేయడానికి, బోన్ మ్యారోను డామేజ్ చేయడానికి కారకాలు. ప్లాస్టిక్ కాల్చినప్పుడు వచ్చే పొగను పీల్చటం చాలా ప్రమాదకరం. 


ఒక్కోసారి ఈ పొగనుంచి వచ్చిన వాయిువులు చెట్లమీద కానీ, నేల మీద కానీ ఉండిపోతాయి. ఇవి కాస్తా.. మనకు తెలియకుండానే..నీళ్లలోకి, ఆహారాల్లోకి వచ్చేస్తాయి. అట్లా కలుషితం చేస్తాయి.


ప్లాస్టిక్ ను మట్టిలో కప్పిపెడితే ఎలాంటి అనార్థాలు ఉంటాయి


మట్టి తనలో కలిపేసుకునేవి చాలా ఉంటాయి. కానీ ప్లాస్టిక్ మాత్రం ఎన్ని సంవత్సరాలు భూమిలో ఉంచినా అది కరగదు. వర్షాలు పడినప్పుడు నేల కోతకు గురవుతాయి. అప్పుడు మట్టిలో కప్పిపెట్టిన కవర్స్ అన్నీ మురికికాలువలోకి చేరి..అక్కనుంచి..పెద్దమురికికాలువలకు..అక్కడనుంచి సముద్రాలకు చేరతాయి. సముద్రంలో వాటర్ ను పొల్యూట్ చేసి అక్కడనుంచి ఈ కెమికల్ ఎఫెక్ట్ సూర్యకిరణాల ద్వారా హీట్ అవావరేట్ అయి గాలి ద్వారా మళ్లీ మనకే వస్తాయి.  నేచర్లో టెంపరేచర్స్ రేజ్ అవడానికి ఇలాంటి కెమికల్స్ కూడా కారణం.


ఇంకా ఈ కెమికల్స్ మట్టిలో ఉన్నప్పుడు మట్టిలో ఉపయోగపడే కొన్ని బాక్టీరియాలు,  వానపాములు, చెట్లు అభివృద్ధికి సహకరించే కొన్నింటిని  డామేజ్ చేస్తాయి. అందుకని భూమాతను ఎంత నాశనం చేయాలో అంత ఈ ప్లాస్టిక్ నాశనం చేస్తుంది. ఇది కాల్చడానికి లేదు..పాతేయడానికి లేదు. ప్లాస్టిక్ గ్లాసులు, కప్పులు కానీ, కవర్లు కానీ ఎన్ని సంవత్సరాలైనా అలానే ఉంటాయి. డంపింగ్ యార్డ్ లో అంతా ఇవే పేరుకుపోయి ఉంటాయి. 


ఇప్పుడు మనం చెప్పుకునే నష్టాలు అన్నీ బాహ్యంగానే ఉన్నాయి. డైరెక్టుగా మన ఆరోగ్యానికి ఎలాంటి నష్టం లేదు అనే ఒక అపోహ కారణంగానే..దీని వాడకం వీపరీతంగా పెరగుతుంది. మరీ మన ఆరోగ్యానికి ఎలా నష్టం ఉంటుందో చూద్దాం


మనం ప్లాస్టిక్ బాక్స్ లాంటి వాటిల్లో వేడివేడి ఆహారం వేసుకుని ఆఫీసులుకు, కాలేజీలకు వెళ్తుంటాం. ఇంకా రోడ్డుపక్కన తోపుడుబళ్లలో, కిరాణషాపులు వారు, కర్రీపాయింట్ వాళ్లు ఆహారాన్ని ఈ ప్లాస్టిక్ కవర్స్ లోనే వేస్తుంటారు. ప్లాస్టిక్ కవర్స్ తయారుచేసేప్పుడు అందులో బీపీఏ అనే కెమికల్ ఎక్కువగా కలుపుతారు..ఇది ఫుడ్ ప్రొడెక్ట్ వేడిది వేసినప్పుడు ఆ వేడికి ఈ కెమికల్ కరుగుతుంది. డైలీ మనం అదే లంచ్ బాక్స్ లో వేడి వేడి ఆహారం వేసుకుని వెళ్లటం తినటం వల్ల ఈ బీపీఏ కెమికల్ శరీరం లోపలికి వెళ్తుంది. ఆఖరికి ప్లాస్టిక్ వాటర్ బాటిల్ లో వేడినీళ్లు పోసుకుని తాగినా ప్రమాదమే. ఇది శరీరంలో ఎక్కువ వెళ్లేకొద్ది..మగవారికి వీర్యకణాలు తగ్గుతాయి. ఆడవారికి ఈస్ట్రోజన్ హార్మోన్ ఫ్లక్యూవేషన్స్ వచ్చేస్తాయి. అంటే ఈ ప్లాస్టిక్ సంతానం మీద దెబ్బకొడుతుంది.  ఇంకా ఈ కెమికల్స్ వల్ల హార్ట్ ఎటాక్స్ వస్తాయట, రక్తనాళాల్లో ఈ కెమికల్స్ పేరుకుంటాయి. 

  1. ఇందులో ఉండే బెంజీన్ అనేది ఎర్రరక్తకణాలను ఉత్పత్తి చేసే బోన్ మారోను దెబ్బకొడుతుంది.
  2. మెదడుకణాల్లో డీఎన్ఏ ను డామేజ్ చేసే గుణం కూడా బీపీఏ కెమికల్ కు ఉంది.
  3. పుట్టబోయే బిడ్డలమీద కూడా ఈ బీపీఏ కెమికల్ ప్రభావం..తల్లిద్వారా బిడ్డకు వెళ్లి వాళ్లకు కూడా నష్టం జరుగుతుంది.
  4. ఎక్కువమంది చెప్పేది ఇందులో వాడే భారీ లోహాల కారణంగా..క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయట.ఈ రోజుల్లో క్యాన్సర్ ఎక్కువగా పెరగటానికి వీటి వాడకం కూడా ఒక కారణమే.


ఇన్నీ నష్టాలు ఉన్నాయని గుర్తించే.. ప్రభుత్వం వారు కూడా వీటిని బ్యాన్ చేయడానికి అనేక చర్యలు తీసుకున్నారు.. తీసుకుంటున్నారు. జరిమానాలు విధిస్తున్నారు, కరోనా విషయంలో గవర్నమెంట్ ముందునుంచే కొన్ని జాగ్రత్తలు చెప్పింది. మొదట్లో చాలామంది వినలేదు. భౌతికదూరం పాటించలేదు. మాస్క్ పెట్టడానికి ఇష్టపడలేదు. ఎప్పుడైతే.. ఎక్కడో ఉన్న వైరస్.. మన పక్కింటికి, కింద ఫ్లోర్ కి వచ్చిందో అప్పుడు భయం వేయటం మొదలైంది. ఒక స్టేజ్ లో మాస్క్ లేకుండా బయటకు వెళ్లాలంటే వెన్నులో వణుకుపు్ట్టింది. కరోనా కాస్త తగ్గుముఖం పట్టాక మళ్లీమామూలే.. కానీ ఇప్పుడు ఒమిక్రాన్ తో డోస్ పెంచింది. 


మనలో మార్పు వస్తేనే ఏదైనా సాధ్యం అవుతుంది. ఎన్ని జరిమానాలు వేసినా మనకు వాటి వల్ల నష్టం ఏంటి అనేది క్లియర్ గా తెలియనంతవరకూ వీటి వాడకం ఆగదు. ఈ ప్రకృతిని కలుషితం చేసే ఇలాంటి వాటిని మనం వాడి భావితరాలుకు కూడా ఇస్తే భవిష్యత్తులో ఇంకా ఎలాంటి వైరస్ లు దాడి చేస్తాయో మీరే ఆలోచించండి.

మరీ మారదాం అని కొందరు అనుకుంటారు, కానీ వీటికి ప్రత్యామ్యాం ఉండాలి కదా?? ఎందుకు లేదు ఉంది. వీటికి బదులుగా పేపర్ కవర్లు, పేపర్ సంచులు, నార సంచులు, గోనె సంచులు ఇలాంటి అన్నీ మార్కెట్లోకి వచ్చాయి. ఇలాంటి వాటివల్ల మనకు హానీ లేదు. ప్రకృతికి కూడా ఎలాంటి హానీలేదు. ఇప్పటికే పెద్ద పెద్దషాపింగ్ మాల్స్, ఆన్ లైన్ షాపింగ్ యాప్స్ ప్లాస్టిక్ కవర్లను నిషేధించాయి. 

కాబట్టి ప్లాస్టిక్ కి గుడ్ బై చెప్పి.. కొద్దిగా ఖర్చు ఎక్కువైనా.. ఇలాంటి పేపర్ బ్యాగ్స్, జనపనార సంచులను వాడుకోవడం చాలా మంచిది. ఇలా చేయటం..మీతో పాటు భావితరాలకు కూడా మేలు. నేచర్ ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. నేచర్ని పాడుచేస్తే అది మానల్ని పాడుచేస్తుంది. ఇప్పటికే ఈ విషయం చాలామందికి అర్థమై ఉండాలి. వైరస్ లు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయంటే..మనం చేసిన తప్పిదాలే వాటికి కారణం. ప్లాస్టిక్ వాడకం ఎంత డేంజరో మీకు కాస్తైనా అర్థమయిందని అనుకుంటున్నాం...మీ ఆత్మీయులకు ఆర్టికల్ షేర్ చేసి ప్రమాదం ఎంత ఉందో తెలియజేయండి.


-Triveni Buskarowthu

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.