చలిగా ఉందని నైట్ స్వెటర్లు, సాక్స్ లు ధరించి పడుకుంటున్నారా.. గుండెకు ఎఫెక్ట్ తెలుసా..!

నైట్ స్వెటర్లు, సాక్స్ లు వేసుకుని పడుకోకూడదు, రూమ్ హీటర్లను కూడా సరైనా వెంటిలేషన్ లేని రూంలో వాడొద్దట. అసలు సాక్స్ లు వేసుకుని పడుకుంటే ఏమైంతుంది??

1. స్వెటర్లు, సాక్స్ లు వ‌ద్దంటే వ‌ద్దు

స్వెటర్లు, సాక్స్ లు వ‌ద్దంటే వ‌ద్దు

చలికాలంలో శరీరం వెచ్చగా ఉండాలని స్వెటర్లు వేసుకుంటాం, రూమ్ హీటర్లు వాడుతాం, ఇంకా నైట్ సాక్స్ లు వేసుకుని పడుకుంటాం. అదేంటో చలిని తట్టుకోవాలని చేసే ప్రతీదీ ఆరోగ్యానికి హానీ కలిగించేదే అయి ఉంటుంది. నైట్ వేసుకుని పడుకోకూడదు, రూమ్ హీటర్లను కూడా సరైనా వెంటిలేషన్ లేని రూంలో వాడొద్దట.  అసలు సాక్స్ లు వేసుకుని పడుకుంటే ఏమైంతుంది?? ఇంకా కాళ్లు కూడా పగలవు కదా అనుకుంటున్నారా?? నివేదికల ప్రకారం ఇది రక్త ప్రసరణపై చెడు ప్రభావాన్ని చూపుతుందని తేలింది.. ఇంకా ఏం నష్టాలు ఉన్నాయంటే..

2. శరీరం వేడెక్కడం

శరీరం వేడెక్కడం

నిద్రపోయేటప్పుడు సాక్స్ ధరించడం వల్ల వెచ్చదనం ఉంటుందని మనం అనుకుంటాం.. కానీ కొన్నిసార్లు ఈ వేడి కూడా హానికరమే. ఇది శరీర ఉష్ణోగ్రతను ఎక్కువగా పెంచేస్తుంది..

3. రక్త ప్రసరణ

రక్త ప్రసరణ

రాత్రి పడుకునేటప్పుడు బిగుతుగా ఉన్న సాక్స్ వేసుకుంటే అరికాళ్లు, పాదాల మధ్య రక్తప్రసరణ సరిగా జరగదు.. ఒత్తిడిని అనుభవిస్తారట. మనం సాక్స్ లు తీసేసిన తర్వాత అంత వరకూ కందిపోయినట్లు కనిపిస్తుంది..పాదాలలో దృఢత్వాన్ని తగ్గిస్తుందట.

4.  పరిశుభ్రత

 పరిశుభ్రత

సాక్స్‌లో పేరుకుపోయిన దుమ్ము, ధూళి ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి..వాష్ రూమ్ కి వెళ్లేప్పుడు ఏం తీస్తాం లే అని అలానే స్లిప్పర్స్ వేసుకుని వేళ్తాం..దాని ద్వారా..ఆ స్లిప్పర్స్ మీద ఉన్న డస్ట్, బాత్రుమ్ లో ఉన్న డస్ట్ అంతా మీ సాక్స్ లకు అంటుకుంటుంది. వచ్చి బెడ్ ఎక్కుతాం..మళ్లీ అది మనకే ఎఫెక్ట్.. దీని కారణంగా చర్మానికి సంబంధించిన అనేక సమస్యలు ఎదురవుతాయి.

5.  గుండెకి ఎఫెక్ట్‌

 గుండెకి ఎఫెక్ట్‌


పైన చెప్పినవి అన్నీ రీజనబుల్ గా ఉన్నాయి.. కానీ సాక్స్ వేసుకుని పడుకుంటే గుండె ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఎలా వస్తాయు అనుకుంటున్నారా... బిగుతుగా ఉండే సాక్స్ ధరించడం వల్ల సిరలపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల రక్త సరఫరా సరిగ్గా ఉండదు. గుండె పంపింగ్‌లో మరింత కృషి చేయాల్సి ఉంటుంది. అలా గుండెకు ఎఫెక్ట్ అవుతుంది.