గర్భంలో పిండం ఎలా తయారవుతుంది.. పిండం శిశువుగా మారే ద‌శ‌లు క్లియర్ గా మీకోసం..!

ఒకటి పిండ ఎలా ఏర్పడతుంది..? కలయిక ద్వారా ప్రెగ్నెన్సీ వస్తుందని అందరికి తెలుసు, కానీ ఆ తర్వాతా స్త్రీ శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయి..? ఎన్ని రూపాంతరాలు తర్వాత బిడ్డ తయారవుతుంది..? Fetal development stage by stage

గర్భంలో పిండం ఎలా తయారవుతుంది.. పిండం శిశువుగా మారే ద‌శ‌లు క్లియర్ గా మీకోసం..!

మన బాడీలో జరిగే కొన్ని అద్బుతమైన విషయాలు చాలా మందికి తెలియ‌దు డాక్టర్స్ కు వీటిపై పూర్తి అవగాహన ఉంటుంది. అలాంటి వాటిలో ఒకటి పిండ ఎలా ఏర్పడతుంది..? మనిషి పుట్టుక ఎలా ఫామ్ అవుతుంది. కలయిక ద్వారా ప్రెగ్నెన్సీ వస్తుందని అందరికి తెలుసు, కానీ ఆ తర్వాతా స్త్రీ శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయి..? ఎన్ని రూపాంతరాలు తర్వాత బిడ్డ తయారవుతుంది..? ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్‌ సున్నితమైన అంశాలు మ‌నం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.  

గర్భంలో పిండం ఎలా తయారవుతుంది

స్త్రీలకు బుుతుక్రమం ప్రారంభమైన మొదటిరోజు నుంచే ఫోలికల్స్ రిలీజ్ అవడం స్టాట్ అవుతుంది. 14వ రోజుకు ఎగ్ అనేది ఓవరీస్ లో తయారై ఫెలోపియన్ ట్యూబ్ లోకి వచ్చి సిద్ధంగా ఉంటుంది. అప్పుడు కలయిక జరిగితే, పురుషుడి నుంచి వచ్చిన వీర్యకణాలు గర్భాశయం లోపలకి వెళ్తాయి. ఇవి కొన్ని లక్షల సంఖ్యలో వెళ్తాయి. కానీ చాలావరకూ చనిపోతాయి. కొన్ని వందల సంఖ్యలో ఈ వీర్యకణాలు గర్భశయం నుంచి ఫెలోపియన్ ట్యూబ్స్ లోకి  చొచ్చుకుని వెళ్లగలుగుతాయి. ఇలా వెళ్లిన వందల వీర్యకణాల్లో ఫస్ట్ ఏ వీర్యకణం అయితే స్త్రీలనుంచి విడుదలై ఓవరీ నుంచి వచ్చిన ఎగ్ లోకి చొచ్చుకెళ్తుందో, అప్పుడు అక్కడ ఫలదీకరణం చెందుతుంది. అప్పుడు ఆ ఎగ్, వీర్యకణం కలిసి ఎగ్ సెల్ లా తయారవుతుంది. అక్కడ గర్భనిర్ధారణ జరుగుతుంది.

ఆ ట్యూబ్ నుంచి ఎగ్ సెల్ అనేది మెల్లగా గర్భాశయం గోడ ఎండోమెట్రియం పొరను దాటుకుని గర్భాశయం లోపలకి వెళ్తుంది. అక్కడ పోషకాలు అన్నింటిని తీసుకుంటూ..ఆ కణం విభజనం చెందటం ప్రారంభం అవుతుంది. 3-4వ వారం వరకూ..ఎండ్రోమెట్రియం పొరలోనే ఉంటుంది. 5వ వారం నుంచి..గర్భాశయం నుంచి బయటకు వ‌స్తుంది. ఈ ద‌శ‌లో మెదడు అన్నీ ఇక్కడే తయారవుతాయి. చిన్న వానపాములా ఉంటుంది. అర ఇంచ్ రావడానికి నెలరోజులు పడుతుంది. 

ప్రెగ్నెన్సీ పిరయడ్ దశలు

ఇలా వచ్చిన ఈ చిన్నపిండం 3.5 కేజీల వరకూ ఎదగడానికి తొమ్మిది నెలలు పడుతుంది. అందుకని నవమాసాలు అంటారు. ఈ పిండ వయసును ఎలా కొలుస్తారంటే, స్ట్రీలకు బుుతుక్రమం ప్రారంభమైన మొదటి రోజు నుంచే కౌంట్ చేస్తారు. ప్రెగ్నెన్సీ పిరయడ్ ను మూడు దశలుగా విభజిస్తారు. ఒక్కోదశలో పిండం ఎలా డవలప్ అవుతుంది. అక్కడ తీసుకోవాల్సిన ఆరోగ్య నియామాలేంటో చూద్దాం..

మొదటివారం నుంచి 13 వారాలకు ఫస్ట్ ట్రైమిస్టర్ అంటారు. ఐదవ వారం నుంచి పిండానికి గుండెకొట్టుకోవడం మొదలవుతుంది. అక్కడ నుంచే బేబీకి బొడ్డుతాడు తయారవుతుంది. అప్పుడు గర్భాశయం నుంచి బయటకు వస్తుంది కదా.. అప్ప‌టినుంచే ఈ బొడ్డు తాడు ద్వారా పోషకాలు అందుతాయి. ఐదో వారం నుంచే గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివర్, మెదడు, వెన్నుపాము అన్ని పార్టులు తయారవుతాయి. కానీ చాలా చిన్నగా స్కానింగ్ లో కూడా కనిపించవు. ఈ పిరయడ్ లో పిండం బరువు కూడా 28 గ్రాములు మాత్రమే ఉంటుంది.

మొదటి మూడు నెలల పాటు గర్భవతి తీసుకోవాల్సిన ఆహారాలు

ఫోలిక్ యాసిడ్ కచ్చితంగా కావాలి. కొత్తకణ నిర్మాణానికి ఫోలిక్ యాసిడ్ ముఖ్యమైన పాత్ర. సుమారుగా రోజుకు 600-800 మైక్రో గ్రాముల ఫోలిక్ యాసిడ్ గర్భవతికి కావాలి. నాటుశనగలు, పెసలు, బొబ్బర్లలో కూడా ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరల్లో పుదినాలో ఎక్కువగా ఉంటుంది. కూరగాయల్లో గోరుచిక్కుడులో ఉంటుంది. ఇలాంటివి ఈ మూడు నెలలు బాగా తీసుకుంటే మంచిది. ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్ కూడా కావాలి. అవిసె గింజల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సీ ఏ పండు తిన్నా వచ్చేస్తుంది. ఇలాంటి పోషకాలు ఉన్న ఆహారం ఈ మూడు నెలలు తీసుకుంటే..పిండం ఏ మార్పులతో ఎదగాలో అలా ఎదుగుతుంది.

రెండవ ట్రై మాసంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

14వ వారం నుంచి 26వ వారం వరకూ..పిండం 28 గ్రామలు బరువు నుంచి500 గ్రాముల బరువు వరకూ ఎదిగే అవకాశం ఉంటుంది. ఎముకల తయారవటం, గోళ్లు తయారవటం, జుట్టు తయారవటం, చర్మం కూడా తయారవుతుంది కానీ..చాలా పలుచుగా ఉంటుంది. ముడతలు ముడతలుగా ఉంటుంది. రక్తనాళాల తయారవుతాయి. ఇక్కడ నుంచి 25-26వారం వచ్చిన దగ్గర నుంచి బిడ్డ వినటం వంటి మార్పులు చేస్తుంది. ఈ పిరయడ్ బిడ్డకు చాలా ముఖ్యం..కండరాలు కూడా ఇక్కడే తయారవుతాయి.

ఈ నెలల్లో తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు అతి ముఖ్యంగా ఏంటంటే..మంచినీళ్లు తక్కువ తాగితే ఇక్కడ చాలా ప్రమాదం..మొదట నుంచి కాస్త తక్కువగా తాగినా ఏం కాదు కానీ..ఈ పిరయడ్ లో మంచినీళ్లు సరిపడా తాగాల్సిందే. ఎందుకంటే ఉమ్మునీరు లేకపోతే..బిడ్డకదలికలకు, గ్రోత్ కు ఇబ్బంది అవుతుంది. ఈ నెలల్లోనే బిడ్డ ఉమ్మునీరు తాగటం, మూత్రవిసర్జన చేయటం జరుగుతుంది. కాల్షియం ఎక్కువగా కావాలి. విటమిన్ డీ బాగా కావాలి. ఎండలోకి వెళ్లలేకపోతే..సప్లిమెంట్స్ కచ్చితంగా కావాలి. అన్నీ డబుల్ కావాలి ఇక్కడ నుంచి. 

మూడో ట్రైమాసంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

27వ వారం నుంచి 40వ వారం వరకూ..ఉండే పిరయడ్ ను థార్డ్ ట్రైమిస్టర్ అంటారు. బిడ్డ ఎదుగల అరకేజీ బరువు నుంచి 3.5 కేజీల వరకూ ఎదిగేదీ ఈ టైంలోనే..ఈ పిరియడ్ లోనే చాలా చాలా మార్పులు వస్తాయి. కళ్లు తెరవటం, చేతులు, కాళ్లు ఊపటం, చేతులు నోట్లో వేసుకుని చీకటం చేస్తుంది. 32-36 వారం మధ్యలోనే వీళ్లకు ఊపిరితిత్తులు విచ్చుకోవడం జరుగుతుంది. ఈ లోపే ఒకవేళ బిడ్డ ప్రసవిస్తే..వెంటిలేటర్ పెట్టి ఇవన్నీ డవలప్ అయ్యేదాక మేనేజ్ చేస్తారు వైద్యులు. అట్లాగే చివరి మూడు నెలలో జుట్టు బాగా పెరగడంతోపాటు..గంటకు పదిసార్లు కదలికలు చేస్తూ, కాళ్లతో, చేతులతో తన్నుతూ ఉంటాడు.

తల్లి ఈ అనుభూతి చెందుతుంది..అప్పుడు ఆ గర్భవతికి వచ్చే ఆనందం మాముూలుగా ఉండదు. ఒకవేళ ఇలాంటి కదలికలు రాకపోతే..డాక్టర్ ను సంప్రదించటం చాలా మంచిది. కదలికలే బిడ్డ ఆరోగ్యనికి అతిముఖ్యం..ఇక తలకిందభాగానికి వెళ్లి పొజిషన్ రెడీ అవుతుంది. ఈ టైంలో ఆహారం అతి ముఖ్యం. ప్రతిదీ రెట్టింపు కావాలి. ఐరన్, కాల్షియం, కొవ్వు,విటమిన్ డీ అన్నీ డబుల్ తీసుకోవాలి. కొవ్వులు ఒక్కరికి 20 గ్రాములు సరిపోతే..గర్భవతికి 40 గ్రాములు కావాలి. ఆ ఫ్యాట్ అంటే నూనె, నెయ్యి కాదు..విత్తనాల్లో ఉండే కొవ్వులు కావాలి. హెల్తీ ప్రొటీన్ అన్నీ బాగా తీసుకుంటే..బిడ్డ ఎదుగుదల బాగుంటుంది. అందాల్సినవి అన్నీ బాగా అందింతే..సరైనా బరువుతో బిడ్డ తయారవుతుంది.

గర్బవతికి సహజంగానే కాళ్ల వాపులు, బీపీ పెరగడం, కొద్దిమందికి గర్భంతో ఉన్నప్పుడే షుగర్ కూడా వస్తుంది. అయితే ఇది అందరికీ జరుగుతుంది కాబట్టి లైట్ తీసుకుంటారు. ఇది అసలు ఆరోగ్యవంతమైన లక్షణం కాదు. ప్రసవించిన తర్వాత పొట్టకు స్ట్రెచ్ మార్క్స్ రావడం కూడా అనారోగ్య లక్షణమే తెలుసా.? ఆరోగ్యకరమైన నియమాలు పాటిస్తే ఒక్క మచ్చకూడా పొట్టకు పడదు. షౌషికాహారం తీసుకుంటూ..కొంచెం వ్యాయామాలు చేస్తుంటే..స్కిన్ లూస్ లేకుండా టైట్ గా ఉంటుంది. అన్ పాలిష్డ్ ఐటమ్స్, పండ్లు, విత్తనాలు బాగా తీసుకుంటే షుగర్ రాదు.రోజు వ్యాయామాలు, ప్రాణాయామం చేస్తే..సుఖప్రసవం జరుగడానికి అవకాశం ఉంటుంది. 

అసలు లోపల ఏం జరుగుతుందో తెలుసుకుంటే..అందరికీ మంచిదని మీకు కథనం అందించటం జరిగింది. ఈ ఆర్టకల్ షేర్ చేసేయండి మరీ..!