Heart Problems : టీ కాఫీ తాగాక ఈ టాబ్లెట్లు వేసుకుంటే గుండె సమస్యలు వస్తాయట.. 

Heart Problems  : డయాబెటిస్, హైపర్టెన్షన్ వంటి వ్యాధులు ఉన్నవారు నిత్యం టాబ్లెట్స్ వేసుకోవాల్సి ఉంటుంది..  అయితే ఇలాంటివారు సాధారణంగా టీ, కాఫీ తాగిన తర్వాత ఆ టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు..

Heart Problems : టీ కాఫీ తాగాక ఈ టాబ్లెట్లు వేసుకుంటే గుండె సమస్యలు వస్తాయట.. 
Heart Problems


Heart Problems  : డయాబెటిస్, హైపర్టెన్షన్ వంటి వ్యాధులు ఉన్నవారు నిత్యం టాబ్లెట్స్ వేసుకోవాల్సి ఉంటుంది..  అయితే ఇలాంటివారు సాధారణంగా టీ, కాఫీ తాగిన తర్వాత ఆ టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు.. ఇది చాలా ప్రమాదకరమని.. చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు ప్రతినిత్యం టాబ్లెట్లు వేసుకోవాల్సి ఉంటుంది.. అయితే ఇలాంటి వారికి చాలా అలసటగా నీరసంగా ఉంటుంది ఎప్పుడు మగతగా ఉండటం వల్ల టిఫిన్ సంబంధిత పదార్థాలకు అలవాటు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది..  అయితే అలవాటుగా టీ తాగిన తర్వాత టాబ్లెట్ వేసుకుంటారు.. 

కాఫీలో కెఫిన్‌‌‌ పరిమాణం ఎక్కువగా ఉంటుంది, టీలో కొంచెం తక్కువగా ఉంటుంది. అయితే ఈ కెఫిన్‌ కొన్ని మందులతో రియాక్ట్‌ అయ్యి సైడ్‌ ఎఫెక్ట్స్‌ చూపే ప్రమాదం ఉందని చెబుతున్నారు నిపుణులు.. అలాగే దగ్గు జలుబు సంబంధిత టాబ్లెట్లలో ఎక్కువగా ఉంటుంది ఇది నాడీ వ్యవస్థను స్టిమ్మలేట్ చేయడంలో సహాయపడుతుంది అందుకే వీటికి సంబంధించి ఏ టాబ్లెట్లు తీసుకున్న కాఫీ టీ వెంటనే తీసుకోకూడదని చెబుతున్నారు.. కెఫిన్‌, ఎఫెడ్రిన్‌ కలిస్తే.. హైపర్‌టెన్షన్‌, గుండెపోటు, స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం ఉంది.

అలాగే ఇవే కాకుండా దీర్ఘకాలం వేధించే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుందని అందుకే ఉదయాన్నే అల్పాహారం తిన్న వెంటనే టాబ్లెట్లు వేసుకోవడం మంచిదని చెబుతున్నారు అలాగే కొంతమంది వెంటనే కాకపోయినా ఎక్కువగా కాఫీకి అలవాటు పడుతుంటారు నిత్యము టాబ్లెట్లు వేసుకునేవారు వీటిని అదుపులో ఉంచుకోవడం మంచిదని చెబుతున్నారు నిపుణులు..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.