Winter Coughs and Cold : చలికాలంలో దగ్గు, జలుబు తగ్గాలంటే.. 

Winter Coughs and Cold : శీతాకాలంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా దరిచేరుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ కాలంలో జ్వరం జలుబు దగ్గు వంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. అయితే వీటిని

Winter Coughs and Cold : చలికాలంలో దగ్గు, జలుబు తగ్గాలంటే.. 
Winter Coughs and Cold


Winter Coughs and Cold : శీతాకాలంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా దరిచేరుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ కాలంలో జ్వరం జలుబు దగ్గు వంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. అయితే వీటిని తేలికగా తగ్గించుకోవాలి అంటే కొన్ని విషయాలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి.. 

చలికాలంలో రోగనిరోధక శక్తి కొంత తక్కువగానే ఉంటుందని చెప్పాలి అందుకే ఈ సమయంలో ఆరోగ్యం పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి అలాగే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు అజాగ్రత్త చేయకూడదు దీనివల్ల పరిస్థితి మరింత దిగజారుతుంది అయితే దగ్గు జలుబు ఉన్న వాటి సమయంలో ఏం చేయాలంటే..

కొందరిలో దగ్గు జలుబు నాలుగైదు రోజుల్లో తగ్గిపోతే మరికొందరిలో మాత్రం 20 రోజుల వరకు వేధిస్తూ ఉంటుంది జలుబు ఇన్ని రోజులు వేధిస్తుందంటే శరీరంలో లాగ నిరోధక శక్తి కచ్చితంగా తక్కువగా ఉందని చెప్పవచ్చు అందుకే ఈ సమయంలో మంచి ఆహారాన్ని తీసుకోవాలి రాగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి ఆహారం ఎక్కువగా తీసుకోవడం మంచిది. అలాగే తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు ఆహారాన్ని తీసుకోవాలి.. 

అలాగే ఈ సమయంలో కచ్చితంగా తగినంత నిద్ర అవసరం శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడి అలసిపోతూ ఉంటుంది అందుకే శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వాలి.. ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా తగినంత నిద్రపోతే సమస్య చాలావరకు సద్దుమణుగుతుంది..

అలాగే చలికాలం కదా జలుబు చేసిందని శరీరానికి కావలసిన పానీయాలను అందించడం మానేస్తుంటారు కొందరు కానీ ఇది అసలు సరైన పద్ధతి కాదు దీనివల్ల శరీరం మొత్తం డిహైడ్రేడ్ అయిపోతుంది అందుకే అన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలి ముఖ్యంగా చలికాలంలో పెరుగును ఎవరు తీసుకోరు శరీరం వేడెక్కడం వల్ల కూడా జలుబు సమస్య వేధిస్తుందని గుర్తించాలి. అందుకే శరీరానికి కావాల్సిన పోషకాలను అందించాలి దీనివల్ల త్వరగా అనారోగ్య సమస్యల నుంచి కోలుకునే అవకాశం ఉంటుంది..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.