Triglyceridesతో గుండెకు ముప్పు.. ట్రైగ్లిజరైడ్స్‌ అంటే ఏంటి..? ట్రైగ్లిజరైడ్స్‌ పెరగనివ్వకండి..!!

మన శరీరంలో మొత్తం మూడు రకాల కొవ్వులు ఉంటాయి. HDL, LDL, Triglycerides .. జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల అవసరం లేని కొవ్వులు బాడీలో పేరుకుపోతున్నాయి. పిందె ముదిరితే పండు అయినట్లు..ఈ ట్రైగ్లిజరైడ్స్‌ ఎక్కువైతే..

Triglyceridesతో గుండెకు ముప్పు.. ట్రైగ్లిజరైడ్స్‌ అంటే ఏంటి..?  ట్రైగ్లిజరైడ్స్‌ పెరగనివ్వకండి..!!


మన శరీరంలో మొత్తం మూడు రకాల కొవ్వులు ఉంటాయి. HDL, LDL, ట్రైగ్లిజరైడ్స్.. వీటిల్లో మనకు కావాల్సింది.. HDL మాత్రమే. మిగతా రెండింటిని వదలించుకోవాలి. కానీ నేడు చాలామంది పాటించే జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల అవసరం లేని కొవ్వులు బాడీలో పేరుకుపోతున్నాయి. పిందె ముదిరితే పండు అయినట్లు..ఈ ట్రైగ్లిజరైడ్స్‌ ఎక్కువైతే.. ఎల్డీఎల్‌ పెరుగుతుంది. మనం వీటిని మొదటి దశలోనే తగ్గిస్తే.. బాడీలో బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌ పేరుకుపోకుండా ఉంటుంది. మనదేశంలో రక్తంలో అధిక కొలెస్ట్రాల్‌ కన్నా ట్రైగ్లిజరైడ్ల సమస్యే ఎక్కువ. ఇవి ఎక్కువగా ఉంటే గుండెజబ్బుల ముప్పు పొంచి ఉంటుంది.

ట్రైగ్లిజరైడ్స్


చెడు కొవ్వుతో పాటు ట్రైగ్లిజరైడ్‌ కూడా హానికారక కొవ్వే. ఇది రక్తంలో ఎక్కువగా ఉండటం ప్రమాదకరమే. రక్తంలో అధికంగా ఇవి ఉండటంతో గుండెకు ఇబ్బందులు వస్తాయి.. గుండె జబ్బులున్న వారిలో కొలెస్ట్రాల్‌ సాధారణంగా ఉన్నా.. ట్రైగ్లిజరైడ్‌ అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి జీవక్రియల వేగాన్ని మందగించేలా చేస్తాయి. వీటితో రక్త నాళాల గోడలు దెబ్బతింటాయి. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్‌ ముద్దలుగా పేరుకొని పొతుంది. గుండె జబ్బులకు కారణమవుతుంది.

ట్రైగ్లిజరైడ్స్‌ వల్ల గుండెకు ఎలా ప్రమాదం

గుండె, రక్తనాళాల జబ్బుల బారినపడుతున్న వారిలో 70% మందికి కొలెస్ట్రాల్‌ మామూలుగానే ఉంటున్నా ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉంటుండటం గమనార్హం. ఒకరకం కొవ్వు పదార్థాలైన వీటి స్థాయులు మించిపోతే ప్రతి జీవ రసాయన ప్రక్రియకూ అడ్డుతగులుతుంటాయి. జీవక్రియల వేగాన్ని మందగింపజేస్తాయి. రక్తనాళాల గోడలు దెబ్బతినటం. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్‌ ముద్దలుగా పేరుకుపోవటం. కొలెస్ట్రాల్‌ పేరుకుపోవటానికి ముందే అధికంగా ఉన్న ట్రైగ్లిజరైడ్లు అక్కడ పైపొరను దెబ్బతీస్తాయి. తర్వాత కొలెస్ట్రాల్‌ వచ్చి చేరుతుంది. అంటే రక్తనాళాల్లో పూడికలకు ట్రైగ్లిజరైడ్లు అనువైన పరిస్థితిని సృష్టిస్తున్నాయన్నమాట. 25 ఏళ్ల తరువాత ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎంత ఆరోగ్యంగా ఉన్నా అనిపించినా సరే.. ట్రైగ్లిజరైడ్స్ చెక్ చేసుకోవాలి


ట్రైగ్లిజరైడ్స్‌ ఎంత ఉండాలి..?

triglycerides level chart

ట్రైగ్లిజరైడ్స్ అంటే రక్తంలో ఉండే ఫ్యాట్ మాలిక్యుల్స్. 
లెవెల్స్ 150 మి.గ్రా./డెసిలీటర్ వరకు ఉంటే పరవాలేదు. 
150 నుంచి 199 మధ్య ఉంటే బార్డర్ లెవల్ హై అని చెబుతారు. 
200 పైన ఉంటే అధికంగా ఉన్నాయని అర్థం. 
500, ఆ పై ఉంటే చాలా ఎక్కువగా ఉన్నాయని అర్థం.

ట్రైగ్లిజరైడ్స్‌ పెరగడానికి కారణాలు
 

  1. మనం తీసుకునే ఆహారం ఒకటైతే, లివర్‌ ద్వారా ఉత్పన్నమవడం మరొకటి.
  2. ముఖ్యంగా డయాబెటిస్ బారిన పడ్డ వారిలో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉంటాయట.
  3. మనం తీసుకునే ఆహారంలో పిండిపదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోతాయి.
  4. కార్బొహైడ్రేట్స్ రెండు రకాలు. ఒకటి సాధారణ కార్బొహైడ్రేట్స్, రెండోది సంక్లిష్ట కార్బొహైడ్రేట్స్. సంక్లిష్ట కార్బొహైడ్రేట్స్ శరీరానికి నిదానంగా శక్తినిస్తాయి. కానీ సింపుల్ కార్బొహైడ్రేట్స్ లేదా రీఫైన్‌డ్ కార్బొహైడ్రేట్స్‌లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండి రక్తంలో చక్కెర స్థాయిని వెంటనే పెంచేస్తాయి.
  5. జంక్ ఫుడ్.. బర్గర్లు, పాస్తా, ప్యాకేజ్డ్ డ్రింక్స్ వంటి రీఫైన్డ్ కార్బొహైడ్రేట్స్ తీసుకోకూడదు.
  6. మద్యం తీసుకునే వారిలో, పొగ తాగే వారిలో కూడా ట్రైగ్లిజరైడ్స్ అధికంగా ఉంటాయి.
  7. మధుమేహం ఉన్నవారికి ఇతరులతో పోల్చితే ఎక్కువగా ఉంటుంది.
  8. మన శరీరం గ్లూకోజును, ట్రైగ్లిజరైడ్స్‌ను శక్తిరూపంలోకి మార్చుకుంటుంది. కానీ ట్రైగ్లిజరైడ్స్ అంత తేలికగా శక్తిగా మారవు. చెడు కొలెస్ట్రాల్ రూపంలోకి మారుతాయి.  

ట్రైగ్లిజరైడ్స్‌ వల్ల వచ్చే సమస్యలు

  • రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ పెరగడం వల్ల పాంక్రియాటైటిస్ వస్తుంది.
  • ట్రైగ్లిజరైడ్స్‌తో పాటు చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) ఎక్కువగా ఉంటే గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువ.
  • ట్రై‌గ్లిజరైడ్ కొవ్వులు పెరగడానికి మద్యపానం, పొగ తాగడం, కాలేయ జబ్బులు, ఊబకాయం వంటి అనేక అంశాలు కారణమవుతాయి.
  • చేపలు ఆహారంగా తీసుకునే వారిలో కూడా ఇవి తక్కువగా ఉంటాయి.. మాంసాహారంలో సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటున్నందున వాటిని తగ్గించాలని చెబుతున్నారు. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • స్మోకింగ్ మానేయాలి. మద్యం మానేయాలి.
  • డయాబెటిస్ నియంత్రణలో ఉంచుకోవాలి. 
  •  ప్రధానంగా జీవన శైలి లో మార్పులు చేసుకోవడం అవసరం.ఒత్తిడి తగ్గించుకునే ప్రయాత్నం చేయాలి దైనందిన వైవాహిక జీవితం లో సమస్యలు రాకుండా చూసుకోవాలి.
  • ప్రతి రోజూ వాకింగ్ చేసుకోవాలి.
  • స్థూల కాయం మధుమేహం సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడాలి.                             

తినాల్సిన‌వి.. తిన‌కూడ‌నివి

ఆరోగ్యం దెబ్బతినడానికి ప్రధానం కారణం.. తీసుకునే ఆహారం మంచిది కాకపోవడమే.. ఏ సమస్యకైనా మూలం అదే అవుతుంది. అందుకే పోషకాహారం తీసుకోవాలి. జంక్‌ఫుడ్స్‌, వైట్‌ ప్రొడెక్ట్స్‌ తీసుకోవడం తగ్గించాలి. రోజు వ్యాయామం చేయడం అలవాటుగా చేసుకుంటే మరీ మంచిది.!

  • హై ఫైబర్ ఉండే పదార్థాలు తీసుకోవాలి.
  • బాదాం వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి.
  • తప్పనిసరిగా 35 నుంచి 45 నిమిషాలు ఏరోబిక్ వ్యాయామం చేయాలి.
  • బరువును అదుపులో ఉంచాలి.
  • రాగులు, సజ్జలు, కొర్రలు వంటి తృణ ధాన్యాలు మన డైట్‌లొ చేర్చుకోవాలి. నూనె వినియోగం తగ్గించాలి.
  • కొవ్వులు, చక్కెరలు ఉన్న ఆహారాన్ని తగ్గించాలి.
  • ట్రైగ్లిజరైడ్స్ తగ్గిస్తే చెడు కొలెస్ట్రాల్ కూడా అదుపులో ఉంటుంది.
  • సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండే రీఫైన్డ్, ప్రాసెస్డ్, ప్యాకేజ్డ్ ఫుడ్ తగ్గించాలి. 
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.