Weight Loss : చలికాలంలో బరువు తగ్గటానికి ఈ పండ్లను ఓసారి ప్రయత్నించండి.. 

Weight Loss : ఈ చలికాలంలో ఏ పని చేయాలన్నా చాలా బద్ధకంగా ఉంటుంది నిద్ర లేవటానికే బద్దకించే వాళ్ళు ఎందరో ఉంటారు అయితే బరువు తగ్గాలి రోజు వ్యాయామం చేయాలి అనుకునే వారు పరిస్థితి ఇంకా

Weight Loss : చలికాలంలో బరువు తగ్గటానికి ఈ పండ్లను ఓసారి ప్రయత్నించండి.. 


Weight Loss : ఈ చలికాలంలో ఏ పని చేయాలన్నా చాలా బద్ధకంగా ఉంటుంది నిద్ర లేవటానికే బద్దకించే వాళ్ళు ఎందరో ఉంటారు అయితే బరువు తగ్గాలి రోజు వ్యాయామం చేయాలి అనుకునే వారు పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగానే ఉంటుంది అయితే ఈ చలికాలంలో తేలికగా బరువు తగ్గటానికి కొన్ని మార్గాలు ఉన్నాయని తెలుస్తోంది.. 

చాలామంది ఏం తిన్నావ్ అంటారు అలాంటి వారు వ్యాయామాలు చేయాలని ప్రతిసారి ఏవో ఒక నియమాలు పెట్టుకోవడం మళ్లీ వాటిని మర్చిపోవడం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది అయితే ఎంత పాటించాలి అనుకున్న ఈ చలికాలంలో మాత్రం ఈ పని కొంచెం కష్టమే అయితే ఇలాంటివారు కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటూనే బరువు తగ్గొచ్చు అని చెబుతున్నారు వైద్యులు.. 

బరువును తగ్గించడంలో సి విటమిన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది ముఖ్యంగా ఈ విటమిన్ ఉన్న పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరిగి నాజూకుగా తయారవ్వచ్చు.. అందుకే రోజు ఉదయాన్నే నిద్ర లేవగానే గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకొని తాగడం వల్ల శరీరంలో అధికంగా పేర్కొన్న కొవ్వు కరిగిపోతుంది అలాగే ఈ కాలంలో ఎక్కువగా దొరికే నారింజ పండ్లకు కొలెస్ట్రాల్ తగ్గించే శక్తి ఉంటుంది.. అలాగే అంజీర శరీరానికి కావాల్సిన మెగ్నీషియం ఇతర పోషకాలను అందించడంతోపాటు తొందరగా పొట్ట నిండిన భావన కలుగుతుంది దీన్ని తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో బరువు అదుపులో ఉంటుంది.. అలాగే స్టార్ ఫ్రూట్ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది.. వీటితోపాటు జామ సీతఫలం తరచూ తీసుకోవడం వల్ల శరీరాన్ని కావాల్సిన పోషకాలు అందటంతో పాటు కొలెస్ట్రాల్ తగ్గి తేలిగ్గా బరువు తగ్గుతారు..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.