White Hair : చిన్నవయసులోనే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయా..? ఇలా చేసేయండి..!

ఈరోజుల్లో చాలామందికి చిన్నవయసులోనే White Hair వ‌స్తుంది. ఇందుకు కారణాలు అనేకం.. ఒకటి వంశపారపర్యంగా అయితే.. ఇంకోటి అస్థవ్యస్థమైన జీవనశైలి. ఏదిపడితే అది తినడం, ఫోన్లు ఎక్కువగా వాడటం, శారీరక శ్రమ లేకపోవడం ఇలా చాలా కారణాల వల్ల White Hair అయిపోతుంది.

White Hair  :  చిన్నవయసులోనే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయా..? ఇలా చేసేయండి..!
White Hair


ఈరోజుల్లో చాలామందికి చిన్నవయసులోనే White Hair వ‌స్తుంది. ఇందుకు కారణాలు అనేకం.. ఒకటి వంశపారపర్యంగా అయితే.. ఇంకోటి అస్థవ్యస్థమైన జీవనశైలి. ఏదిపడితే అది తినడం, ఫోన్లు ఎక్కువగా వాడటం, శారీరక శ్రమ లేకపోవడం ఇలా చాలా కారణాల వల్ల White Hair అయిపోతుంది. కానీ మహిళ‌ల క‌న్నా పురుషుల్లోనే ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. అయితే దీని వెనుక ఉన్న స్పష్ట‌మైన కార‌ణాన్ని సైంటిస్టులు ఇప్ప‌టి వ‌ర‌కు చెప్ప‌లేక‌పోయారు. చాలా మంది హెయిర్ జెల్స్‌, క్రీమ్‌లు వాడుతుంటారు. ఇక కొంద‌రు రసాయ‌న రంగులు వాడుతుంటారు. అలాగే కొంద‌రిలో వ‌ర్ణ ద్ర‌వ్య‌మైన మెల‌నిన్ లోపం స‌మ‌స్య ఏర్ప‌డుతుంది. దీని వ‌ల్ల కూడా శిరోజాలు తెల్ల‌గా అవుతుంటాయి. ఇలా చిన్నవయసులోనే జుట్టు తెల్లగా అయిపోయిన వారి కోసమే ఈ ఆర్టికల్‌.. ఈ చిట్కాలతో మీ జుట్టును కాపాడుకోవచ్చు. 

ఉసిరికాయ‌లు తిన‌డం లేదా వాటి జ్యూస్‌ను రోజూ తాగ‌డం, విట‌మిన్ సి ఉండే పండ్ల‌ను తిన‌డం, గోరింటాకును పేస్ట్‌లా చేసి జుట్టుకు హెయిర్ ప్యాక్‌లా వేసుకోవ‌డం, జింక్‌, బ‌యోటిన్, కాల్షియం, రాగి, సెలీనియం త‌దిత‌ర పోష‌కాలు ఉండే ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల జుట్టు తెల్ల‌బ‌డే స‌మ‌స్య‌ను కొంత వ‌ర‌కు త‌గ్గించుకోవ‌చ్చు. 
ఇక థైరాయిడ్ ఉన్న‌వారు ఆ గ్రంథులు స‌రిగ్గా ప‌నిచేసేలా చూసుకోవాలి. థైరాయిడ్ హార్మోన్ల స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉండేలా చూడాలి. 
విట‌మిన్ బి12 ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. ధూమ‌పానం చేసేవారు, మ‌ద్యం సేవించే వారు ఆ అల‌వాట్ల‌ను మానేయాలి. ఇలా ప‌లు సూచ‌న‌లు పాటించ‌డం వ‌ల్ల జుట్టు తెల్ల‌బ‌డ‌డం అనే స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఆకుకూరలు కూడా క్రమం తప్పకుండా తింటున్నా.. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. 
పెద్దలలో కూడా జుట్టు తెలబడటానికి ఇవే కారణాలు.
ఒత్తిడి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌వారు, నిద్ర‌లేమి, ఆందోళ‌న‌, హైబీపీ ఉన్న‌వారు, ఆక‌లి స‌రిగ్గా అవ‌క‌పోవ‌డం, వెంట్రుక‌ల మూల‌క‌ణాల క్షీణ‌త‌, థైరాయిడ్ స‌మ‌స్య‌లు ఉండ‌డం, విట‌మిన్ బి12 లోపం, ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ఉండ‌డం, ధూమ‌పానం, మ‌ద్య‌పానం చేయ‌డం, ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఉండ‌డం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మందిలో వెంట్రుక‌లు తెల్ల‌బ‌డుతుంటాయి. మరి ఈ సమస్యలు ఉంటే చూసుకోండి మరీ..!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.