Health : కళ్ళను చూసి మనిషి ఆరోగ్యాన్ని ఎలా అంచనా వేస్తారో తెలుసా.. !

ఒక మనిషి కళ్ళను చూసి అతని Health ఏ స్థితిలో ఉందో అంచనా వేయొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు..  కళ్ళ చుట్టూ ఉండే నల్లని వలయాలు..  కంటిలో నల్లని గుడ్డు చుట్టూ జరిగే

Health : కళ్ళను చూసి మనిషి ఆరోగ్యాన్ని ఎలా అంచనా వేస్తారో తెలుసా.. !
Eye Problems


ఒక మనిషి కళ్ళను చూసి అతని Health ఏ స్థితిలో ఉందో అంచనా వేయొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు..  కళ్ళ చుట్టూ ఉండే నల్లని వలయాలు..  కంటిలో నల్లని గుడ్డు చుట్టూ జరిగే మార్పులను బట్టి అతని ఆరోగ్య పరిస్థితిని ఖచ్చితంగా చెప్పవచ్చని చెబుతున్నారు.. 

ఈ రోజుల్లో ప్రపంచ జనాభాలో సగం మంది దాదాపు ఏదో ఒక కంటి లోపంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వయసు పైబడుతున్న వారిలో ఒకప్పుడు కంటికి సంబంధించిన సమస్యలు వస్తూ ఉండేవి. కానీ ఈ రోజుల్లో చిన్న వయసు నుంచి కంటికి సంభందించి ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. స్కూలుకు వెళ్లే పిల్లలు సైతం చూపు తగ్గిపోయి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందమైన ప్రపంచాన్ని చూడాల్సిన వయసులోనే దృష్టికి సంబంధించిన లోపాలతో సతమతమైపోతున్నారు. అయితే ఈ రోజుల్లో కంటికి సంబంధించిన వ్యాధుల్లో నరాల బలహీనత, కంటి రంగు మారటం, రాత్రిపూట కళ్ళు కనిపించకపోవడం వంటి సమస్యలతో పాటు.. కళ్ళు దురద పు, మంట, కంటి నుంచి నీరు కారటం వంటి సమస్యలు వేధిస్తూనే ఉంటున్నాయి.. దుమ్ము ధూళి వంటివి కంటిలో చేరటం వల్ల కంటికి సంబంధించిన పలు సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే కంటికి సంబంధించిన ఎలాంటి సమస్యలు వచ్చినా గుర్తించడం చాలా తేలుకని అంటున్నారు నిపుణులు..

కళ్ళు ఎలా ఉన్నాయి అనేదాన్ని బట్టి ఆ మనిషి పూర్తి ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చని తాజా అధ్యయనాల్లో తెలుస్తోంది.. కనుపాప వెలుతురుకు తక్షణమే స్పందిస్తూ ఉంటుంది. వెలుతురు ఎక్కువగా ఉన్నప్పుడు సూటిగా చూడటానికి కొంచెం ఇబ్బంది పడుతుంది. అలాగే వెలుతురు తగ్గుతున్న సమయంలో కనుపాప పెద్దదిగా అవుతుంది. అయితే ఈ మార్పులు కంటిలో వెంటవెంటనే జరగాలి.. అలా కాకుండా కనుపాప పెద్దది అవ్వటానికి.. చిన్నది కావడానికి చాలా సమయం పడుతూ ఉందంటే దీర్ఘకాలంగా వేధించే ఎన్నో సమస్యలు రాబోతున్నాయని అంచనా వేయవచ్చు అని తెలుస్తోంది.. 

అలాగే కళ్ళు ఒక్కసారిగా పసుపు రంగులోకి మారిపోతే లివర్కు సంబంధించిన ఏవైనా అరోగ్య సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవాలి. అలాగే కళ్ళు ఎర్ర రంగులోకి మారితే ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయేమో లేదా కాలుష్యం కారణంతో అలా అవుతుందో డాక్టర్ని సంప్రదించి తెలుసుకోవాలి.. అలాగే మన కంటిలో నల్ల గుడ్డు చుట్టూ తెల్లని లేదా ఇంకా ఏదైనా రంగులో ఒక వలయం ఏర్పడితే శరీరంలో కొవ్వు శాతం అధికంగా ఉందని సంకేతం.. అలాగే కొందర్లో ఉన్నట్టుండి కళ్ళు ఉబ్బినట్టు కనిపిస్తూ ఉంటాయి.

ఎలాంటి వారు థైరాయిడ్ సమస్య మొదలవుతుందేమో గ్రహించాలి.. అలాగే అదేపనిగా కళ్ళు అదురుతూ ఉంటే శరీరానికి తగిన పోషకాలు అందడం లేదేమో చూసుకోవాలి.. శరీరంలో వేడి ఎక్కువైనా ఒత్తిడి ఎక్కువైనా ఇలా కళ్ళు అదురుతూ ఉంటాయి.. అందుకే ఇలాంటి సమస్యలను ఎప్పటికప్పుడు సరి చూసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.