Pre-diabetes : ప్రీ డయబెటిస్‌ అంటే ఏంటి.. దీన్ని కంట్రోల్‌ చేయొచ్చా..?

Pre-diabetes అంటే స్థాయిలు నిర్దేశించిన విలువ‌ల క‌న్నా ఎక్కువ‌గా ఉంటే diabetes అంటారు. అయితే మ‌రీ ఎక్కువ‌గా ఉండ‌కుండా కొంచెం బార్డ‌ర్ లైన్‌లో ఉన్నా, లేదా కొద్దిగా ఎక్కువ‌గా ఉన్నా దాన్ని Pre-diabetes అంటారు.

Pre-diabetes : ప్రీ డయబెటిస్‌ అంటే ఏంటి.. దీన్ని కంట్రోల్‌ చేయొచ్చా..?
How to control prediabetes


Diabetes గురించి మనందరికీ తెలుసు.. కానీ pre-diabetes అంటే ఏంటి.. ఎప్పుడైనా విన్నారా..? pre-diabetes వల్ల కూడా వ్యాధేనా..? షుగర్‌ మానేయాల్సిందేనా..? ఈ సమస్య వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఈ వివరాలన్నీ ఈరోజు తెలుసుకుందాం..!

ప్రీ డయబెటిస్‌ అంటే..

స్థాయిలు నిర్దేశించిన విలువ‌ల క‌న్నా ఎక్కువ‌గా ఉంటే డ‌యాబెటిస్ అంటారు. అయితే మ‌రీ ఎక్కువ‌గా ఉండ‌కుండా కొంచెం బార్డ‌ర్ లైన్‌లో ఉన్నా, లేదా కొద్దిగా ఎక్కువ‌గా ఉన్నా దాన్ని ప్రీ డ‌యాబెటిస్ అంటారు. అంటే ఉదాహ‌ర‌ణ‌కు ప‌ర‌గ‌డుపున షుగ‌ర్ టెస్టు చేయించుకుంటే ఆ విలువ 80 నుంచి 110 మ‌ధ్య రావాలి. కానీ 111 నుంచి 120 వ‌ర‌కు వ‌స్తే దాన్ని షుగ‌ర్ అన‌రు. ప్రీ డ‌యాబెటిస్ అంటారు. అదే చాలా ఎక్కువ‌గా వ‌స్తే దాన్ని డ‌యాబెటిస్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే డ‌యాబెటిస్ వ‌చ్చేందుకు ముందు ఉన్న స్టేజినే ప్రీ డ‌యాబెటిస్ అంటారు. 
ఈ స్టేజిలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. నిర్ల‌క్ష్యం చేస్తే అది డ‌యాబెటిస్‌కు దారి తీస్తుంది. ప్రీ డయబెటిస్‌ను కంట్రోల్‌ చేశారంటే.. మీరు షుగర్‌ వ్యాధి రాకుండా అడ్డుకోవచ్చు.జీవ‌న‌శైలిలో మార్పులు చేసుకోవ‌డంతోపాటు వ్యాయామం చేస్తే ఈ స్టేజి నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. క‌నుక‌నే ప్రీ డ‌యాబెటిస్ స్టేజిలో మెడిసిన్ల‌ను వాడాల్సిన ప‌నిలేదు.
ప్రీ డ‌యాబెటిస్ స్టేజిలో ఉన్న‌వారు కొన్ని ర‌కాల షుగ‌ర్ ల‌క్ష‌ణాల‌ను కూడా క‌లిగి ఉంటారు. దాహం అతిగా వేయ‌డం, మాటి మాటికీ మూత్ర విస‌ర్జ‌న చేయాల్సి రావ‌డం వంటి ల‌క్ష‌ణాలు ఉంటాయి. షుగ‌ర్ వ‌చ్చింద‌ని భావించ‌డానికి లేదు.

ప్రీ డయబెటిస్‌ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

  • రోజూ ప‌ర‌గ‌డుపునే ఉసిరికాయ జ్యూస్ తాగ‌డం వ‌ల్ల ప్రీ డ‌యాబెటిస్ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. 
  • రాత్రి పూట కొవ్వు తీసిన పాల‌లో కొద్దిగా ప‌సుపు క‌లుపుకుని తాగుతుండాలి. 
  • ప‌సుపు ట్యాబ్లెట్లు కూడా మ‌న‌కు ల‌భిస్తాయి. వాటిని పూట‌కు 250 ఎంజీ చొప్పున భోజ‌నానికి ముందు వేసుకోవాలి. 
  • ఇక రాత్రి పూట మెంతుల‌ను నీటిలో నాన‌బెట్టి మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఆ నీటిని తాగాలి. 
  • ఆహారంలో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండేలా చూసుకోవాలి. 
  • ప్రోటీన్ల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. 
  • పిండి ప‌దార్థాల‌ను త‌గ్గించాలి. 
  • రోజూ క‌నీసం 30 నిమిషాల పాటు అయినా వ్యాయామం చేయాల.     

ఇలా సూచ‌న‌లు పాటిస్తే ప్రీ డ‌యాబెటిస్ నుంచి బ‌యట ప‌డ‌వ‌చ్చు. డయబెటిస్‌ను కంట్రోల్‌ చేయలేం కానీ.. ప్రీ డయబెటిస్‌ను కంట్రోల్‌ చేయొచ్చు.!

 

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.