పిల్లలకు ఏ వయసు నుంచి బ్రష్ చేయించాలంటే.. !

Child Start Brushing : చాలామంది చిన్నపిల్లలకు నాలుగైదు ఏళ్ళు వచ్చేవరకు బ్రష్ చేయించాల్సిన అవసరం లేదు అని అపోహలో ఉంటారు కానీ ఇది సరైన పద్ధతి కాదు పెద్దవారిలో ఏ రకంగా పళ్ళ పైన

పిల్లలకు ఏ వయసు నుంచి బ్రష్ చేయించాలంటే.. !
Child Start Brushing


చాలామంది చిన్నపిల్లలకు నాలుగైదు ఏళ్ళు వచ్చేవరకు బ్రష్ చేయించాల్సిన అవసరం లేదు అని అపోహలో ఉంటారు కానీ ఇది సరైన పద్ధతి కాదు పెద్దవారిలో ఏ రకంగా పళ్ళ పైన బ్యాక్టీరియా పేరుకు పోతుందో చిన్నపిల్లల్లో కూడా అదే విధంగా క్రిములు చేరుతాయి అందుకే వారికి కచ్చితంగా బ్రష్ చేయించాలి అయితే ఏ వయసు నుంచి మొదలు పెట్టాలి అంటే.. 

పిల్లల పాల దంతాలు చాలా సున్నితంగా ఉంటాయి. అందుకే వీరు తిన్న ఎలాంటి ఆహార పదార్థాలు అయినా పళ్ళ మధ్య ఇరుక్కొని దంతాలకు హానిచేస్తాయి.. అందుకే సంవత్సరం దాటిన వెంటనే పిల్లలకు నెమ్మదిగా నీళ్లతో బ్రష్ చేయించడం అలవాటు చేయాలి. వీలైతే చేతి వేలు పెట్టి నోరంతా శుభ్రం చేయాలి.

అలాగే రెండేళ్లు దాటిన వెంటనే పీడియాట్రిక్ టూత్ పేస్ట్ తో మెత్తని బ్రష్ ను ఎంచుకొని పళ్ళను శుభ్రం చేస్తూ ఉండాలి.. చిన్నపిల్లలకి ఈ వయసు నుంచే మంచి బ్రష్సింగ్ అలవాట్లను నేర్పిస్తే తద్వారా జీవితంలో ఇదే అలవాటు అయ్యి పళ్ళను శుభ్రంగా ఉంచుకుంటారు అలాగే ఎటువంటి నోటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడతారు.. 

అలాగే వీలైతే పిల్లలను డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్లి డెంటల్ క్లీనింగ్ చేయించాలి ఇలా చేయించడం వల్ల పళ్ళు మొదలవుతాయి అని ఒక అపోహ ఉంటుంది కానీ ఇది నిజం కాదు దీనివలన పళ్ళు శుభ్రం పడటమే కాకుండా నోటికి సంబంధించిన ఎలాంటి వ్యాధులు రావు అలాగే చిన్న పిల్లలకు తిన్న వెంటనే నోటిని శుభ్రం చేసుకోవడం రెండు పూటలా నెమ్మదిగా బ్రష్ చేసుకోవడం అలవాటు చేయాలి.. వీలైనంతవరకు కొంత వయసు వచ్చేంతవరకు వీరిని మౌత్ వాష్ లకు దూరంగా ఉంచాలి. ఇందులో ఉండే గాడతను వీరు చిన్న వయసులో తట్టుకోలేరు..

మూడు, నాలుగేళ్ళు దాటిన తర్వాత పిల్లలు వారంతట వారే నెమ్మదిగా బ్రష్ చేసుకోవడం అలవాటు చేసుకుంటారు. అయితే ఈ వయసులో వారు బ్రష్ చేయటం నేర్చుకున్నారు కదా అని అజాగ్రత్త చేయకూడదు. ఎందుకంటే ఈ వయసు పిల్లలు ఎక్కువగా చాక్లెట్లు తినటం వల్ల పళ్ళ పైన అనేక రకాల బ్యాక్టీరియా పేరుకుపోతూ ఉంటుంది. అలాగే తిన్న వెంటనే నోటిని శుభ్రం చేసుకునే అలవాటు లేకపోతే నెమ్మదిగా ఈ వయసు నుంచే పళ్ళు పాడైపోవడం మొదలవుతుంది. అందుకే వీటన్నిటిని తల్లితండ్రి నెమ్మదిగా గమనిస్తూ ఉండాలి. పంటికి సంబంధించి ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుల్ని సంప్రదించటం వల్ల సమస్య పెద్దది కాకుండా ఆపవచ్చు. అలాగే ఆరు సంవత్సరాలు దాటాక పిల్లలకు పాల దంతాలు వూడి పోయి కొత్త దంతాలు వస్తాయి కాబట్టి అప్పటివరకు పళ్ళు పుచ్చిపోయిన పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ పరిస్థితి అంత వరకు రాకుండా ఎప్పటికప్పుడు పిల్లలు బ్రష్ చేసే విధానాన్ని, వారి నోటి ఆరోగ్యాన్ని గమనిస్తూ ఉండటం మంచిది..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.