Runner's Diet : రన్నింగ్ చేసే వాళ్ళు తీసుకోవాల్సిన డైట్ ఏంటంటే.. !
Runner's Diet : వ్యాయామని నిత్యజీవితంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని తెలుస్తోంది అలాగే ముఖ్యంగా వ్యాయామంలో రన్నింగ్ శరీరాన్ని ఎంత ఉత్తేజంగా ఉంచుతుంది అలాగే కొందరికి

Runner's Diet : వ్యాయామని నిత్యజీవితంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని తెలుస్తోంది అలాగే ముఖ్యంగా వ్యాయామంలో రన్నింగ్ శరీరాన్ని ఎంత ఉత్తేజంగా ఉంచుతుంది అలాగే కొందరికి ఇది తప్పనిసరి స్పోర్ట్స్ పర్సన్స్ తప్పనిసరిగా రన్నింగ్ చేయాల్సి ఉంటుంది అయితే వీరికి స్టామినా చాలా అవసరం అందుకే ఇలాంటి వారు ఏ ఆహారం తీసుకోవాలి అంటే...
రన్నింగ్ చేసేవారు కచ్చితంగా పోషకాహారం తీసుకోవడం ఎంతో అవసరం లేదంటే వారి శరీరం చాలా నీరసం అయిపోతుంది. అందుకే ప్రోటీన్స్ విటమిన్స్ ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.. అలాగే..
తృణధాన్యాలు తప్పకుండా తీసుకుంటూ ఉండాలి అలాగే వీటితో చేసిన రొట్టెలు ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి.
అలాగే రన్నింగ్ చేసే సమయంలో శరీరం బరువును కోల్పోతుంది అందుకే దీన్ని భర్తీ చేయడానికి అరటిపండ్లను తీసుకోవాలి ఇవి తక్షణమే శరీరానికి శక్తిని అందిస్తాయి ముఖ్యంగా ఇందులో కార్బోహైడ్రేట్లు పొటాషియం ఎక్కువగా ఉంటాయి..
బీన్స్ చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ఫైబర్ ప్రోటీన్స్ అందుతాయి అంతేకాకుండా శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్ ను సక్రమంగా ఉంచుతాయి.
అలాగే రన్నర్స్ తక్కువ క్యాలరీలు ఎక్కువ ప్రోటీన్స్ ఉండే ఆహారాన్ని తీసుకోవాలి అందులో ముఖ్యంగా చేపలు అధిక ప్రోటీన్ అందిస్తాయి అలాగే మాంసాహారంలో ప్రోటీన్ అధిక స్థాయిలో ఉంటుంది అందుకే వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి...
అలాగే తరచు గుడ్లని తీసుకోవాలి ఇది శరీరాన్ని కావాల్సిన అన్ని రకాల పోషకాలను అందించడంలో ముందుంటాయి అలాగే ఎముకలకు బలం చేకూర్చటానికి రోజు కచ్చితంగా పాళ్లను తీసుకోవాలి అలాగే ఏదో ఒక సమయంలో పెరుగును తీసుకోవడం వల్ల ఎముకలు గట్టి పడతాయి..
అలాగే స్వీట్ పొటాటో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి అందుకే వీటిని తీసుకోవడం చాలా మంచిది అలాగే ఇందులో ఉండే విటమిన్ ఏ కంటి చూపుకో వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది అలాగే ఇవి ఎముకల ఆహారానికి చాలా బాగా ఉపయోగపడతాయి..
అలాగే అన్ని రకాల పండ్లను తాజా కాయగూరలను తీసుకోవాలి దీని వలన శరీరాన్ని కావాల్సిన పోషకాలు అందుతాయి అంతేకాకుండా ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల పరిగెత్తటనికి కావలసిన శక్తి చేకూరుతుంది..