Heart Attack : మగవారితో పోలిస్తే ఆడవారిలో గుండెపోటు తక్కువ.. కారణం రుతుచక్రమేనా.. !
సాధారణంగా మగవారితో పోలిస్తే ఆడవారికి Heart Attack వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఇప్పటికే పలు రకాల అధ్యయనాలు తెలిపాయి.. అయితే ఆడవారిలో గుండె పోటు తక్కువగా..

సాధారణంగా మగవారితో పోలిస్తే ఆడవారికి Heart Attack వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఇప్పటికే పలు రకాల అధ్యయనాలు తెలిపాయి.. అయితే ఆడవారిలో గుండె పోటు తక్కువగా రావటానికి కారణం ప్రతీ నెలా వచ్చే రుతు చక్రమేనంటూ తెలిపాయి..
రుతు చక్రం ఆడ వారిని గుండెపోటు సమస్య నుంచి కొంతవరకు రక్షిస్తుందని తెలుస్తోంది.. ఒక మహిళతో పోలిస్తే పురుషుడికి గుండెపోటు వచ్చే అవకాశం పదిరెట్లు ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది ఏ వయసులో వారికి అయినా పురుషుల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని... అయితే 60 ఏళ్ళు దాటిన తర్వాత మాత్రం స్త్రీ పురుషులు ఇద్దరిలో గుండెపోటు వచ్చే అవకాశం ఒకే రకంగా ఉంటుందని దీనికి గల అసలు కారణమేంటో తాజా అధ్యయనాలు తేలింది..
మహిళల్లో ఉండే ఈస్ట్రోజన్ వారిని ఈ సమస్య నుంచి కాపాడుతుందని.. అయితే 45 ఏళ్లు దాటిన మహిళలు లో ఈస్ట్రోజన్ స్థాయిలో తగ్గిపోతూ ఉంటాయని.. ఈ సమయంలో వారిలో మోనోపాజ్ వస్తుందని తెలుస్తోంది.. ఈ సమయంలోనే మహిళల్లో కొంతవరకు గుండె పోటు వచ్చే అవకాశం ఉంటుందని.. అంటే దాదాపు 60, 65 ఏళ్లు వచ్చిన తర్వాత మాత్రమే మహిళలు, పురుషుల్లో గుండెపోటు సమస్య ఒకే రకంగా ఉంటుందని తెలుస్తోంది.. అందుకే ఈ సమయంలో మహిళలు ఏమాత్రం అజాగ్రత్త వహించకుండా ఆహారం, వ్యాయామంపై దృష్టి సారించాలని.. అంతవరకూ ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు కదా అని అజాగ్రత్త వహించకూడదని తెలుస్తోంది.. అలాగే తీసుకునే ఆహారంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ధూమపానం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండటం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవచ్చని తెలుస్తోంది..
అలాగే చాలామందిలో గుండెపోటు కేవలం మగవాళ్లకు మాత్రమే వస్తుందని ఆడవాళ్లకు రాదనే అపోహ ఉంటుంది.. ఇప్పటికి చాలా మంది అదే అపోహలో ఉంటున్నారని కానీ ఇది ఎంత మాత్రం నిజం కాదని తెలుస్తోంది.. చాలావరకు ఆడవారిలో ఛాతివైపు అనిపించిన అది గుండెనొప్పి అని గ్రహించలేరు. దీనికి కారణం ఆడవారిలో గుండె నొప్పి తక్కువగా వస్తుంది అని అనుకోవడం.. అయితే 50 ఏళ్లు దాటిన తర్వాత ఈ అపోలో ఉండటం ఎంత మాత్రం సరైన పద్ధతి కాదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు... ముఖ్యంగా మెనోపాజ్ తరువాత మరణిస్తున్న మహిళల్లో ప్రాధాన కారణం గుండె పోటే.. అలాగే ఆడవారు మోనోపాజ్ దశలో బలహీనంగా ఉండటం, గుండె దడ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలోనే గుండెకు సంబంధించిన వ్యాధులతో పాటు గుండెపోటు కూడా వచ్చే అవకాశం ఉందని గ్రహించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి..