గర్భిణీలు ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఎందుకు తీసుకోవాలంటే.. !

Pegnancy Women కచ్చితంగా ఇచ్చే మందుల్లో పోలిక్ యాసిడ్ మాత్రలు కూడా ఒకటి అయితే ఎంత ప్రాముఖ్యత ఉన్న వీటిని ఎందుకు తీసుకోవాలి దీని ఆవశ్యకత ఏమిటి అంటే.. 

గర్భిణీలు ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఎందుకు తీసుకోవాలంటే.. !


Pegnancy Womenలకు కచ్చితంగా ఇచ్చే మందుల్లో పోలిక్ యాసిడ్ మాత్రలు కూడా ఒకటి అయితే ఎంత ప్రాముఖ్యత ఉన్న వీటిని ఎందుకు తీసుకోవాలి దీని ఆవశ్యకత ఏమిటి అంటే.. 

బి విటమిన్ రకానికి చెందినదే పోలిక్ యాసిడ్ ఇది ముఖ్యంగా శరీరంలో కొత్తగా కణాలు ఉత్పత్తి కావడానికి ఉపయోగపడుతుంది.. రక్త కణాల ఉత్పత్తికి చర్మం శిరోజాలు గోళ్లు వంటి నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.. మొదటి కాన్పులో మహిళలు సమస్యలు ఎదుర్కొంటే వారికి మరొకసారి గర్భం దాల్చటానికి నెల రోజులు ముందు నుంచి పోలిక్ యాసిడ్ మాత్రలు వాడమని చెబుతారు నిపుణులు దీనివలన పుట్టబోయే బిడ్డలో బ్రెయిన్ వెన్నుముక వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.  దీనివలన గర్భం దాల్చాక వచ్చే ఎన్నో రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు ముఖ్యంగా రక్తహీనతను దూరం చేసుకోవచ్చు. 

గర్భం దాల్చిన తర్వాత దాదాపు మూడు నుంచి నాలుగు వారాల్లో పిండం ఎదుగుదల లో ఏవైనా లోపాలు ఉంటే నెమ్మదిగా బయటపడుతూ ఉంటాయి.. ముఖ్యంగా బ్రెయిన్ స్పైనల్ కార్డ్ విషయంలో లోపాలు స్కాన్ రూపంలో బయటపడతాయి.. అయితే గర్భస్థ శిశువులో వీటికి సంబంధించిన ఎలాంటి లోపాలు ఉన్న అది వారి భవిష్యత్తు పైన కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది అంతేకాకుండా పిల్లలు నడవలేకపోవడం బ్రెయిన్ ఎదుగుదల తక్కువగా ఉండటం అంగవైకల్యంతో పుట్టటం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది అందుకే వైద్యులు కచ్చితంగా పోలిక్ యాసిడ్ మాట్లాడాలని ఉపయోగించాలని చెబుతూ ఉంటారు.

వీటిని వాడటం వల్ల ఈ సమస్యలు అన్నిటి నుంచి బయటపడవచ్చు.. అలాగే పోలిక్ యాసిడ్ మాత్రం వాడకపోతే గర్భస్థ శిశువులో 50% మందిలో కచ్చితంగా లోపాలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. అలాగే గర్భం దాల్చాలి అనుకునేవారు సైతం కొన్ని నెలల ముందు డాక్టర్ను సంప్రదిస్తే పోలిక్ యాసిడ్ మాత్రలను సిఫారసు చేస్తారు దీని వలన శరీరం పూర్తి స్థాయిలో గర్భం ధరించడానికి సిద్ధమవుతుంది దీంతో మరింతగా సమస్యలను దూరం చేసుకునే అవకాశం ఉంటుంది.. అలాగే గర్భం దాల్చటానికి ముందు మొదలుపెట్టిన ఈ పోలిక్ యాసిడ్ టాబ్లెట్లను గర్భధారణ అనంతరం కూడా ఉపయోగించమని డాక్టర్లు చెబుతూ ఉంటారు అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో సైతం వీటిని ఎలాంటి అభ్యంతరం లేకుండా ఉపయోగించవచ్చు.. 

అయితే కేవలం మందుల ద్వారా మాత్రమే కాకుండా ఆహార పదార్థాలలో సైతం పోలిక్ యాసిడ్ లభిస్తుంది అందులో ముఖ్యంగా..  బ్రకోలీ క్యాబేజీ పాలకూర శనగలు కరివేపాకు మెంతికూర బెండకాయలు తోటకూర గుడ్లు ఆవు పాలు వంటి వాటిలో పుష్కలంగా పోలిక్ యాసిడ్ ఉంటుంది..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.