ఔషధాల గని మునగ. దాని లాభాలెంటో తెలిస్తే షాకవుతారు
ఔషధాలు ఎక్కడో ఉండవు. మనచుట్టూనే ఉంటాయి. ఆకరికి మన వంటింట్లోనూ ఉంటాయి. కానీ మనమే పట్టించుకోం. దీర్ఘంగా పరిశీలిస్తే మన పెరట్లోనే ఎన్నో ఔషధాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా చెప్పుకునేది మునగ. దీన్ని ఔషధాల గని కూడా అంటారు. ఎంతో ప్రాబల్యం ఉన్న మునగను తింటే ఆరోగ్యం మనచేతుల్లోనే

ఔషధాలు ఎక్కడో ఉండవు. మనచుట్టూనే ఉంటాయి. ఆకరికి మన వంటింట్లోనూ ఉంటాయి. కానీ మనమే పట్టించుకోం. దీర్ఘంగా పరిశీలిస్తే మన పెరట్లోనే ఎన్నో ఔషధాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా చెప్పుకునేది మునగ. దీన్ని ఔషధాల గని కూడా అంటారు. ఎంతో ప్రాబల్యం ఉన్న మునగను తింటే ఆరోగ్యం మనచేతుల్లోనే ఉంటుంది.
మన పెరట్లో ఉండే చెట్లల్లో మునగ చెట్టు కూడా ఒకటి. మునక్కాయలను ఆహారంగా తీసుకుంటాం. మరి మునక్కాయలే కాదు మునగాకు కూడా ఎంతో శ్రేష్టం. సర్వరోగ నివారిణి కూడా. ఆయుర్వేదంలో దాదాపు 300 రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో మునగాకును ఉపయోగిస్తారు. మునగాకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మనకు వచ్చే రకరకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి.
రోగాల బారిన పడకుండా, అలసట లేకుండా రోజంతా ఉత్సాహంగా పని చేయాలంటే మునగాకును ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకోవాలి. మునగాకును రోజూ ఏదో ఒక విధంగా ఆహారంగా తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. రాత్రి పడుకునే ముందు ముగాకులో తేనెను కలిపి తీసుకోవడం వల్ల రేచీకటి సమస్య దూరం అవుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచే గుణం మునగాకుకు ఉంది.
పాలల్లో మునగాకు రసాన్ని కలిపి తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. కీళ్ల నొప్పులతో బాధపడే వారు మునగాకును ఆముదంతో కలిపి వేడి చేయాలి. తరువాత వీటిని నొప్పులు ఉన్న చోట ఉంచి కట్టుకట్టాలి. ఇలా చేయడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. కీరదోసకాయ రసంలో మునగాకు రసాన్ని కలిపి తీసుకోవడం వల్ల మూత్రపిండాల సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అలాగే బాదం పాలల్లో ఒక టేబుల్ స్పూన్ మునగాకు రసాన్ని కలిపి తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
సోరియాసిస్ వ్యాధితో బాధపడే వారు కొబ్బరి నీళ్లల్లో మునగాకు రసాన్ని కలిపి తీసుకోవాలి. అలాగే చర్మంపై మొటిమలు, మచ్చలతో బాధపడే వారు మునగాకు రసంలో నిమ్మరసాన్ని కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. అధిక బరువు సమస్యను తగ్గించడంలో కూడా మునగాకు ఎంతగానో సహాయపడుతుంది.
మునగాకులో ఎంతో విలువైన ప్రొటీన్లు ఉంటాయి. దీన్ని పప్పులో వేసుకున్నా పచ్చడిగా తిన్నా ఆరోగ్యమే. దీని కాయలు కూడా మనకు పప్పులో వేస్తే మంచి రుచిగా ఉంటాయి. ఇలా మునగ ఎన్నో దీర్ఘకాలిక రోగాలకు మందులా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో మునగాకును రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయి. ఇది షుగర్ కు మంచి మందు. దీన్ని తీసుకోవడంతో మధుమేమాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఇంతటి విలువైన మునగాకును అసలు నిర్లక్ష్యం చేయొద్దు. ఎక్కడ దొరికినా తీసుకొచ్చుకుని కూరగా చేసుకుని తింటే ఎన్నో రోగాల నుంచి ఉపశమనం పొందవచ్చు