Married life : ఈ విషయాలు భాగస్వామితో చెప్పకూడదట.. !

Married life సాఫీగా సాగాలి అంటే కచ్చితంగా కొన్ని విషయాలు భాగస్వామితో చెప్పకూడదని అంటున్నారు మానసిక నిపుణులు. ప్రతి విషయాన్ని భాగస్వామితో పంచుకోవడం వల్ల కొన్ని సందర్భాల్లో కచ్చితంగా సమస్యలు

Married life   :  ఈ విషయాలు భాగస్వామితో చెప్పకూడదట.. !


 Married life సాఫీగా సాగాలి అంటే కచ్చితంగా కొన్ని విషయాలు భాగస్వామితో చెప్పకూడదని అంటున్నారు మానసిక నిపుణులు. ప్రతి విషయాన్ని భాగస్వామితో పంచుకోవడం వల్ల కొన్ని సందర్భాల్లో కచ్చితంగా సమస్యలు వస్తాయని.. అందుకే కొన్ని విషయాల్లో ఆచి తూచి అడుగులు వేయాలని అంటున్నారు.. 

ఎలాంటి దాపరికాలు లేకుండా దాంపత్య జీవితాన్ని కొనసాగించాలని చెబుతూ ఉంటారు. అయితే పెళ్లి అయిన తర్వాత ఎలాంటి విషయాన్ని భాగస్వామి దగ్గర దాచాల్సిన అవసరం లేకపోయినా.. భాగస్వామి మీ జీవితంలోకి రావడానికి ముందు జరిగిన కొన్ని విషయాలు చెప్పకపోవడం మంచిదని తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో ప్రతి విషయాన్ని భాగస్వామితో పంచుకోవడం వల్ల అనుమానాలకు దారి తీయడమే కాకుండా అది ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతుందని తెలుస్తోంది. మరి ఆ విషయాలు ఏంటంటే.. 

అలవాట్లు.. 

ప్రతి ఒక్కరికి కొన్ని రకాల అలవాట్లు ఉంటాయి. అయితే అవి ఎదుటి వారికి నచ్చాలనే రూలేమీ లేదు. అందుకే తమకి ఉండే అలవాట్లను భాగస్వామికి కొన్ని సందర్భాల్లో చెప్పకపోవడం మంచిదని తెలుస్తోంది. అయితే మరి ఇబ్బంది పెట్టే విషయాలు అయితే ఆ అలవాట్లను తొందరగా మానేయటమే మంచిదని అంటున్నారు నిపుణులు..

గత ప్రేమ.. 

భాగస్వామి తమ జీవితంలోకి రాకముందు వేరే ఎవరినైనా ప్రేమించి ఉంటే అలాంటి విషయాలు చెప్పకపోవడం మంచిదని తెలుస్తోంది.. భాగస్వామి దగ్గర నిజాయితీగా ఉండాలనే ఉద్దేశంతో కొందరు అన్ని విషయాలను చెప్పుకోవడం వల్ల అది ఎదుటి మనిషి మనసును తీవ్రంగా గాయపరుస్తుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఇది తర్వాత అనుమానాలకు సైతం దారితీస్తుందని చెబుతున్నారు. అలాగే పెళ్లికి ముందు సెక్స్ పరంగా అనుభవం ఉండి ఉంటే దానిని భాగస్వామి దగ్గర దాచటం తప్పు కాదని ఇలాంటి విషయాలు చెప్పటం వల్ల దూరం పెరుగుతుందే తప్ప తగ్గే అవకాశం లేదని తెలుస్తోంది.. 

Establishing A Marriage Road Map • Wedding Belles

అలాగే ప్రతి ఒక్కరికి కొన్ని అనుమానాలు, భయాలు, సమస్యలు ఉంటూ ఉంటాయి. వాటిని ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టు భాగస్వామి ముందు మాట్లాడటం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని.. సమయం వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి విషయాలు మాట్లాడాలని తెలుస్తోంది. అలాగే మరీ బంధాన్ని బలహీనపరిచే విషయం అయితే మాట్లాడకపోవడమే మంచిదని తెలుస్తోంది.. 

అలాగే భాగస్వామి తరుపు కుటుంబ సభ్యులు అందరూ మీకు నచ్చాలనే రూలేమీ లేదు. అయితే ఈ విషయాన్ని నేరుగా భాగస్వామితో చెప్పకపోవటమే మంచిది. ముఖ్యంగా తమ కుటుంబంలో తమకు ఎంతో ఇష్టమైన వారు నచ్చలేదని భాగస్వామి అనటం ఎదుటి మనిషిని ఎంతగానో బాధపెడుతుందని తెలుస్తోంది..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.