Anti Tobacco day 2023 : వీ నీడ్ ఫుడ్, నాట్ టొబాకో 

ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం. పొగాకు వాడకం వల్ల ఎంత నష్టం కలుగుతుంది, ఆరోగ్యం ఏ విధంగా పాడువుతుందో ప్రజలకు అవగాహన కల్పించేందుకు డబ్ల్యూహెచ్వో మే 31న ఏటా ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుతుంది. ఇందుకోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. పొగాకు వాడకాన్ని తగ్గించేందుకు అమలు చేస్తున్న పాలసీలను పర్యవేక్షిస్తుంది.

Anti Tobacco day 2023 : వీ నీడ్ ఫుడ్, నాట్ టొబాకో 


ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం. పొగాకు వాడకం వల్ల ఎంత నష్టం కలుగుతుంది, ఆరోగ్యం ఏ విధంగా పాడువుతుందో ప్రజలకు అవగాహన కల్పించేందుకు డబ్ల్యూహెచ్వో మే 31న ఏటా ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుతుంది. ఇందుకోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. పొగాకు వాడకాన్ని తగ్గించేందుకు అమలు చేస్తున్న పాలసీలను పర్యవేక్షిస్తుంది. పొగాకు వ్యతిరేక దినం గురించి మరిన్ని వివరాలివే..
World No Tobacco Day 2023 observed on 31st May
సిగరెట్లు, బీడీలు, చుట్టల రూపంలో పొగతాగడం, పొగాకు ప్రొడక్టులను తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు యాంటీ -టొబాకో డేను డబ్ల్యూహెచ్‍వో నిర్వహిస్తోంది. పొగాకుకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు, సంస్థలు, ప్రజలు చర్యలు తీసుకోవాలని సూచిస్తుంది.

ఎప్పుడు మొదలైంది?

వరల్డ్ నో టొబాకో డే నిర్వహించాలని 1987 ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించి, తీర్మానాన్ని ఆమోదించింది. 1988 ఏప్రిల్‍లో ఈ డే పేరుకు ఆమోదం తెలిపింది. 1988 మే 31వ తేదీ నుంచి ప్రతీ సంవత్సరం ఈ పొగాకు వ్యతిరేక దినాన్ని నిర్వహిస్తోంది.

ఈ ఏడాది థీమ్

పొగాకు వ్యతిరేక దినాన్ని ప్రతీ ఏడాది ఒక్కో థీమ్‍తో నిర్వహిస్తారు.. ఈ ఏడాది థీమ్‌...వీ నీడ్ ఫుడ్, నాట్ టొబాకో (మాకు ఆహారం కావాలి, పొగాకు కాదు) అనే థీమ్‍తో జరపుతున్నారు. పొగాకు నియంత్రణ కోసం ప్రపంచవ్యాప్తంగా నేడు డబ్ల్యూహెచ్‍వో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ప్రపంచంలోని పలు విద్యాసంస్థలు సహా అనేక చోట్ల కార్యక్రమాలను నిర్వహించి పొగాకుకు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తుంది. పొగాకు వాడకం వల్ల కలిగే ప్రమాదం, పొగాకుకు అలవాటు పడిన వారు ఎలా మానేయాలనే విషయాలను చెబుతుంది.

పొగాకు వల్ల నష్టాలు

సిగరెట్లు, బీడీలు, చుట్టలు సహా పొగాకు ఉత్పత్తులు వాడే వారి ఆరోగ్యం దెబ్బ తినే అవకాశాలు అధికంగా ఉంటాయి. పొగాకు ఎక్కువగా తాగే వారికి గుండెపోటు రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. 
కిడ్నీలు, ఊపిరితిత్తులు దెబ్బ తింటాయి. పొగాకులోని నికోటిన్ సహా వివిధ పదార్థాల వల్ల చాలా దుష్ప్రభావాలు ఉంటాయి. 
పొగాకు ఎక్కువగా తాగే వారికి గుండె, ఊపిరితిత్తులు, ఎముకలు నోటి సంబంధింత వ్యాధులు, వివిధ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువ.
 పొగాకుకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం. ఎవరైనా పొగాకు సేవిస్తున్నా.. వీలైనంత త్వరగా మానేందుకు తప్పక ప్రయత్నించాలి.
కొన్ని రాష్ట్రాల్లో పబ్లిక్‌ ప్లేస్‌లు స్మోకింగ్‌ నిషేధం. కానీ ఈ నిబంధనను ఎవరూ పాటించడం లేదు. పబ్లిక్‌లో తాగుతూ.. అటు వారి ఆరోగ్యాన్ని, ఇతరులు ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నారు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.