వేసవిలో హెన్నా రాసుకుంటున్నారా? జర జాగ్రత్తా..!

ప్రస్తుత కాలంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా చాలా మంది జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు.  ముఖ్యంగా ఈ వేసవికాలంలో జట్టుకు సంబంధించి ఎక్కువ సమస్యలు వస్తుంటాయి.  వేసవి కాలంలో జుట్టు నిర్జీవంగా మారుతుంది.

వేసవిలో హెన్నా రాసుకుంటున్నారా? జర జాగ్రత్తా..!


ప్రస్తుత కాలంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా చాలా మంది జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు.  ముఖ్యంగా ఈ వేసవికాలంలో జట్టుకు సంబంధించి ఎక్కువ సమస్యలు వస్తుంటాయి.  వేసవి కాలంలో జుట్టు నిర్జీవంగా మారుతుంది. దీంతో జుట్టు ఆరోగ్యం, రంగు కోసం హెన్నా వాడుతున్నారా?  అయితే కొన్ని మార్పులు చేసుకోవాలి. లేదంటే జుట్టు కచ్చితంగా దెబ్బతింటుంది

Hair Tips: హెన్నాను తలకు ఎంత సేపు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి,  తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. | ???? LatestLY తెలుగు

హెన్నా వల్ల కలిగే లాభాలు..  

చుండ్రు తగ్గించడం, జుట్టు పెరుగుదల, తెల్ల జుట్టు తగ్గించడం, మాడు దురద తగ్గించడం.. ఇలా పలు సమస్యలకు హెన్నా సాయపడుతుంది. 

అయితే ఇక్కడ రసాయనాలు లేని హెన్నాను వాడితేనే మంచిది. ఎందుకంటే దానివల్ల జుట్టుకు ఎటువంటి హాని కలగదు.

మరి ఈ హెన్నా ఎండాకాలంలో రాసుకోవచ్చా..?

వేడి వాతావరణంలో జుట్టుకు హెన్నా రాయడం వల్ల..  జుట్టు ఆరోగ్యం పాడవుతుంది. ఎందుకంటే హెన్నాకు వేడి తగిలితే అది మొదట పాడవుతుంది. ఆ తర్వాత మీ జుట్టును పాడుచేస్తుంది. నేరుగా ఎండలో ఉంటే హెన్నా వల్ల జుట్టు పొడిబారి.. చివర్లు చిట్లే ప్రమాదం కూడా ఉంటుంది. మామూలు రోజుల కన్నా ఎండాకాలంలో హెన్నా కాస్త తడిగా ఉన్నప్పుడే  కడిగేసుకోవడం మంచింది. లేదంటే జుట్టు సులువుగా తెగే ఛాన్స్ ఉంది. ఇకపోతే హెన్నా మిశ్రమంలో కొంచెం కొబ్బరి నూనె వేసి రాసుకుంటే..  ఎండ వల్ల జుట్టు పొడిబారదు.

హెన్నా జుట్టుకు ఎలా రాసుకోవాలంటే..

హెన్నా పౌడర్ ఒక్కటే కాకుండా అందులో కొన్ని సహజ పదార్థాలు కలిపి వాడటం వల్ల ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే హెన్నాను రాసుకునే ముందు కొన్ని గంటలు నానబెట్టడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

చుండ్రు ఉన్నవారు రాత్రి పూట నాలుగు చెంచాల హెన్నా పొడిని నీళ్లు కలిపి నానబెట్టుకోవాలి. ఉదయాన్నే దాంట్లో అరచెక్క నిమ్మరసం, రెండు చెంచాల పెరుగు కలిపి బాగా కలుపుకోవాలి. ఒక పదినిమిషాలు పక్కన ఉంచి తలకు పట్టించాలి. అరగంటయ్యాక కడిగేసుకోవాలి.

జుట్టు రాలకుండా ఉండాలనుకునేవారు  మూడు చెంచాల హెన్నా పొడిలో 6 చెంచాల ఉసిరి పొడి కలిపి రాత్రిపూట నానబెట్టుకోవాలి. ఉదయాన్నే అందులో రెండు స్పూన్ల మెంతుల పొడి కలిపుకోవాలి. గుడ్డు తెల్లసొన, అరచెక్క నిమ్మరసం కూడా కలిపాలి. దీన్ని ఒక గంట పక్కన నానబెట్టాలి.  అనంతరం జుట్టు మొదళ్ల నుంచి చివర్ల దాకా రాసుకుని గంట తరువాత కడిగేసుకోవాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే మార్పు కన్పిస్తుంది.

కేవలం రంగు కోసం హెన్నా ఉపయోగించేవారు జుట్టుకు రంగు కోసం రాసుకోవాలనుకుంటే..  ముందుగా కొన్ని నీళ్లలో టీ పొడి వేసి డికాషన్​ చేసుకోవాలి. అది చల్లారాకా వడబోసుకున్న నీళ్లలో..  నాలుగైదు చెంచాల హెన్నా వేసి కలపాలి. అది రాత్రి మొత్తం నానబెట్టుకోవాలి. ఉదయాన్నే అందులో ఏమీ కలపకుండా జుట్టుకు రాసుకోవాలి. గంట తర్వాత కడిగేసుకోవాలి. ఇలా పూర్తి అవగాహనతో హెన్నా ఉపయోగిస్తే ఇలాంటి సమస్యలు ఉండవు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.