కళ్లు ఎర్రగా మారాయా..? ఇలా చేయండి..!

మనిషికి కంటిచూపు చాలా ముఖ్యమైనది.. మనం ఎదిగే కొద్ది.. కంటి చూపు తగ్గిపోతుంది. ఇదేం సృష్టి ధర్మం కాదు. మనం తినే ఆహారం, పాటించే జీవనశైలి వల్లనే కంటి చూపు మందగిస్తుంది. ముఖ్యంగా.. సిస్టమ్‌ వర్క్ చేసేవాళ్లకు.. కళ్లు ఎప్పుడూ ఎర్రగా మారడం

కళ్లు ఎర్రగా మారాయా..? ఇలా చేయండి..!


మనిషికి కంటిచూపు చాలా ముఖ్యమైనది.. మనం ఎదిగే కొద్ది.. కంటి చూపు తగ్గిపోతుంది. ఇదేం సృష్టి ధర్మం కాదు. మనం తినే ఆహారం, పాటించే జీవనశైలి వల్లనే కంటి చూపు మందగిస్తుంది. ముఖ్యంగా.. సిస్టమ్‌ వర్క్ చేసేవాళ్లకు.. కళ్లు ఎప్పుడూ ఎర్రగా మారడం, కళ్లలోంచి నీళ్లు రావడం, తలనొప్పి, అలిసిపోవడం ఇవన్నీ కామన్.. ఎర్రబడిన కళ్లకోసం ప్రత్యేకంగా ఎలాంటి చికిత్స ఉండదు.. మీరు డాక్టర్‌ దగ్గరకు వెళ్లినా ఐ డ్రాప్స్‌ ఇచ్చి పంపిస్తారు. కానీ ఈ సమస్య చాలా ఇబ్బంది పెడుతుంది. వర్క్‌ చేయలేరు. కళ్లు ఎర్రగా మారి నీళ్లు కారుతూ చాలా చిరాకుగా ఉంటుంది. 

Midtown Optometry - Red Eyes And How To Treat Them

అసలు కళ్లు ఎర్రబడటానికి కారణం ఏమిటి..? ఇంటి దగ్గరే ఉండి దాన్ని ఎలా నివారించాలో తెలుసుకోండి.

శరీరంలో అత్యంత సున్నితమైన అవయవం ఇది. కంటి సమస్యలు చాలా ఆందోళనతో పాటు ఒత్తిడిని కలిగిస్తాయి. కంటి సమస్యలు రోజువారీ పనికి అడ్డంకిగా మారతాయి. కంటి సమస్యలు సీజన్‌తో పని లేకుండా ఎప్పుడైనా రావచ్చు. కళ్లు ఎర్రగా మారితే రక్తం రంగులో కనిపిస్తుంది. కంటిలోని చిన్న రక్తనాళాలు ఎర్రబడినప్పుడు లేదా నాళాలు వాచినప్పుడు కళ్లు ఎర్రబడతాయి.
 
కళ్ళు ఎర్రబడటానికి అనేక కారణాలు ఉన్నాయి. కంటి చికాకు, నిద్ర లేకపోవడం, కళ్లపై అధిక ఒత్తిడి వల్ల కళ్లు ఎర్రబడవచ్చు.దుమ్ము, పొగ, కన్నీళ్లు రాకపోవడం, కనురెప్పలు చెడిపోవడం, కంటి చికాకు వంటివి కూడా సమస్యకు కారణమవుతాయి .

అలోవెరా జెల్ కళ్ల వాపను తగ్గిస్తుంది. ఇది కళ్ళు ఎర్రబడటం సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది. కళ్లలో వాపు సమస్యను తగ్గిస్తుంది. కలబందలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అలోవెరా జెల్ లేదా జ్యూస్‌ని కళ్లపై రాయండి. 

కళ్లు ఎర్రగా ఉంటే కొబ్బరి నూనె రాయండి. కొబ్బరి నూనెలో విటమిన్ కె, విటమిన్ ఇ, కాల్షియం ఐరన్ ఉన్నాయి. ఇది కళ్ళలో పొడి మరియు చికాకు నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. కళ్లపై ఉపయోగించేందుకు కొన్ని సేంద్రీయ కొబ్బరి నూనెను ఉపయోగించండి. ఇది కళ్లకు ఉపశమనం కలిగిస్తుంది.

కన్ను ఎర్రగా ఉబ్బి ఉంటే చిన్న ఐస్ ముక్కను శుభ్రమైన గుడ్డలో చుట్టి కంటిపై ఉంచండి. వృత్తాకార కదలికలో మసాజ్‌ చేయండి.. 3 నిమిషాల పాటు ఇలా చేయండి తక్షణ ఉపశమనం వస్తుంది..

అన్నింటకంటే ముఖ్యం.. మీరు కళ్లతో అనవసరంగా ఎక్కువసేపు ఫోన్‌ చూడకండి.. కొత్తమంది. ఏం పనిలేకున్నా.. అదేపనిగా సిస్టమ్‌, ఫోన్స్ చూస్తుంటారు. ముఖ్యంగా స్క్రీన్‌ లైట్‌ కంటిమీద డైరెక్టుగా పడకుండా.. మీరు కళ్లజోళ్లు వాడటం ఉత్తమం.! రాత్రుళ్లు ఎక్కువసేపు మేల్కోకూడదు..కళ్లకు సంబంధించి యోగా చేయండి. మంచి ఫలితం ఉంటుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.