పసి పిల్లల పరిరక్షణలో తెలియక ఈ తప్పులు చేస్తున్నారా.. ప్రాణాపాయం సైతం తప్పదు సుమా.. జాగ్రత్త!

వధూవరులు తమకు పుట్టబోయే పిల్లల కొరకు ఎన్నో కలలు కంటూ ఉంటారు. ముఖ్యంగా పిల్లలు పుట్టిన దగ్గర నుండి వారి సంరక్షణ ఎంతో జాగ్రత్తగా చూస్తూ వారిని కాపాడుకుంటూ ఉంటారు. పిల్లలు పుట్టిన తర్వాత వారికి సంబంధించిన జాగ్రత్తలను ఎంతో శ్రద్ధగా అందరిని అడిగి తెలుసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా పిల్లలకు సంబంధించి కొన్ని జాగ్రత్తలు

పసి పిల్లల పరిరక్షణలో తెలియక ఈ తప్పులు చేస్తున్నారా.. ప్రాణాపాయం సైతం తప్పదు సుమా.. జాగ్రత్త!


వధూవరులు తమకు పుట్టబోయే పిల్లల కొరకు ఎన్నో కలలు కంటూ ఉంటారు. ముఖ్యంగా పిల్లలు పుట్టిన దగ్గర నుండి వారి సంరక్షణ ఎంతో జాగ్రత్తగా చూస్తూ వారిని కాపాడుకుంటూ ఉంటారు. పిల్లలు పుట్టిన తర్వాత వారికి సంబంధించిన జాగ్రత్తలను ఎంతో శ్రద్ధగా అందరిని అడిగి తెలుసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా పిల్లలకు సంబంధించి కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలని అందులో ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని నిపుణులు తల్లిదండ్రులకు సలహా ఇస్తూ ఉన్నారు. అలా పసిపిల్లల పరిరక్షణలో తెలియకుండా చేసే కొన్ని తప్పులు కచ్చితంగా తీవ్ర పర్యవసనాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వాటిని తల్లిదండ్రు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు.
Doctors Are Warning Against These Mistakes While Massaging Your Baby
పిల్లలు పుట్టిన తర్వాత వారికి జలుబు చేసినప్పుడు చలిగా ఉన్నప్పుడు ముక్కు, చెవులలో నూనె పోస్తూ ఉంటారు. కానీ అది ఏ మాత్రం పిల్లలకు మంచిది కాదని వారు తెలియజేస్తున్నారు నిపుణులు. ఈ విధంగా నూనె పోయడం వల్ల నూనెలో ఉన్న లిప్స్ వల్ల న్యూమోనియా అనే వ్యాధులు పిల్లలకి వచ్చేటటువంటి అవకాశం ఉందని  హెచ్చరిస్తున్నారు.
అలాగే పిల్లలు చెవులను శుభ్రం చేయడానికి చాలామంది ఇయర్ బడ్స్ వాడుతూ ఉంటారు. కానీ ఈ ఇయర్ బడ్స్ వల్ల చర్మం దెబ్బతిని పిల్లలకు చర్మవ్యాధులు, ఇన్ఫెక్షన్లు వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
చిన్నపిల్లలను ఎప్పుడూ కూడా బోర్లా పడుకోబెట్టవద్దని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎందువలన అనగా చిన్నపిల్లలను బోర్లా పడుకోబెడితే వారికి ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అనే వ్యాధి వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. అందువలన చిన్న పిల్లలను బోర్లా కాకుండా వెల్లకిల్లా పడుకోబెట్టమని చెబుతున్నారు. 
కొంతమంది చిన్నపిల్లల  బొడ్డు త్వరగా ఆరాలని నూనె నెయ్యి వంటివి రాస్తూ ఉంటారు, వీటివలన వారికి ఉపయోగం కలగకపోగా పలు రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చేటటువంటి అవకాశం 
చిన్నపిల్లలు ఏడుస్తున్నప్పుడు వారిని సముదాయించేందుకు అత్యంత వేగంగా వారిని పూపుతూ ఉంటారు. కానీ ఆ సమయానికి వారు ఏడుపు ఆపినప్పటికీ వారి సున్నితమైన నరాల పట్ల ఒత్తిడి కలిగి వారు ఇబ్బందికి గురి అయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలియజేస్తున్నారు.
అంతేకాకుండా పిల్లలు నోటిలో ఎక్కువసేపు పాల బాటిల్ ఉంచడం కూడా మంచిది కాదని.. ఇందువలన వారి కడుపులో గ్యాస్ వచ్చే అవకాశం ఎక్కువ అని నిపుణులు తెలియజేస్తున్నారు. అందువలన చిన్న పిల్లలకు సంబంధించినంత వరకు తగు జాగ్రత్తలు తీసుకుంటూ వారిని సంరక్షించమని వారు మనకు తెలుపుతున్నారు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.