నిద్రలో గట్టిగా అరుస్తున్నారా..? అది ఆ వ్యాధి లక్షణమే

కొన్నిసార్లు నిద్రలో ఉలిక్కిపడి లేవడం, గట్టిగా అరవడం, ఏడ్వడం వంటివి చేస్తుంటాం.. అసలు ప్రశాంతంగా నిద్రపోతుంటే.. ఇవన్నీ ఎందుకు జరుగుతాయో కదా..! నిద్ర రుగ్మతలు స్లీప్ అప్నియా, నిద్రలో నడవటం అనే అనుకుంటారు. కానీ అవే కాదు నిద్రలో కేకలు వేయడం, ఎవరినో తన్నినట్టుగా కల రావడం కూడా ఒక జబ్బే. ఇవన్నీ డిమెన్షియా(చిత్త వైకల్యం) ముందస్తు సంకేతాలు.

నిద్రలో గట్టిగా అరుస్తున్నారా..? అది ఆ వ్యాధి లక్షణమే


కొన్నిసార్లు నిద్రలో ఉలిక్కిపడి లేవడం, గట్టిగా అరవడం, ఏడ్వడం వంటివి చేస్తుంటాం.. అసలు ప్రశాంతంగా నిద్రపోతుంటే.. ఇవన్నీ ఎందుకు జరుగుతాయో కదా..! నిద్ర రుగ్మతలు స్లీప్ అప్నియా, నిద్రలో నడవటం అనే అనుకుంటారు. కానీ అవే కాదు నిద్రలో కేకలు వేయడం, ఎవరినో తన్నినట్టుగా కల రావడం కూడా ఒక జబ్బే. ఇవన్నీ డిమెన్షియా(చిత్త వైకల్యం) ముందస్తు సంకేతాలు. చిత్త వైకల్యం అనేది జ్ఞాపకశక్తి కోల్పోవడం, మెదడు పనితీరు మందగించడం వంటి పరిస్థితిని కలిగిస్తుంది. ఇక పార్కిన్సన్ వ్యాధి అనేది కదలికలను ప్రభావితం చేసే కేంద్ర నాడీ వ్యవస్థ రుగ్మత. డిమెన్షియా, పార్కిన్సన్ వ్యాధి వ్యాధులు వచ్చే ముందు కలిగే పరిస్థితి REM నిద్ర ప్రవర్తన రుగ్మత లేదా RBD అంటారు.

REM అంటే

నిద్రలోకి వెళ్ళిన తర్వాత వచ్చే దశ. దీన్ని రాపిడ్ ఐ మూమెంట్ అంటారు. నిద్ర చక్రం దశలలో ఒకటైన దీనిలోకి వెళ్తే కలలు కనడం, జ్ఞాపకశక్తి, భావోద్వేగాల ప్రాసెసింగ్ వంటి చర్యలు అభివృద్ధి చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ దశలో శరీర కండరాలు వదులుగా మారతాయి. ఎవరికైనా REM స్లీప్ బిహేవియర్ డిజార్డర్ ఉంటే వాళ్ళు నిద్రలో గట్టిగా అరుస్తారు, కేకలు వేస్తారు, తన్నడం వంటివి కూడా చేస్తారు. కలలో వారిని ఎవరో వెంబడిస్తున్నట్టు దాడి చేసినట్టు చెప్తారు. నిద్రలో వాళ్ళు చేసే హింసాత్మక కదలికలు పక్కన ఉన్న వారికి ఒక్కోసారి హాని కలిగించవచ్చు.

ఈ రుగ్మతకు ఎవరికి వస్తుంది..?

REM అనేది ఏ వయసు వారికైనా రావొచ్చు. కొన్ని నివేదికల ప్రకారం ఇది సాధారణంగా 40 నుంచి 50 ఏళ్లలోపు వ్యక్తులకు వస్తుంది. యువకులు, యువతులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అయితే డేటా ప్రకారం 50 ఏళ్లు పైబడిన పురుషులు దీని వల్ల ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు.

REM, పార్కిన్సన్స్ వ్యాధి

చిత్త వైకల్యం, పార్కిన్సన్స్ వ్యాధి, లెవీ బాడీలతో(DLB)తో REM సంబంధం కలిగి ఉందని పరిశోధకులు కనుగొన్నారు. DLB అనేది ఒక రకమైన చిత్త వైకల్యం. ఆలోచనా శక్తి తగ్గించి మెదడు పనితీరుని క్షీణతకు దారి తీస్తుంది. పార్కిన్సన్స్‌తో బాధపడుతున్న 25-58 శాతం మంది రోగులలో, లెవీ బాడీలతో చిత్త వైకల్యం కలిగి ఉన్న రోగులలో 70-80 శాతం మందికి REM కూడా ఉంటుంది. 
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.