షుగర్ వ్యాధికి ఇన్సులిన్ తీసుకుంటున్నారా .. ఇలా చేయకపోతే వెరీ డేంజరస్!

ప్రపంచ దేశాలతో పాటు మన దేశంలోనూ ఎక్కువమందిని వేధిస్తున్న దీర్ఘకాలిక వ్యాధుల్లో షుగర్ ఒకటి. ఒకసారి ఈ రోగం వచ్చిందంటే జీవితాంతం శరీరంలోనే ఉంటుంది. రక్తంలోని షుగర్ స్థాయిలు ఎప్పుడు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి.  కాబట్టి షుగర్ రోగులు బ్లడ్‌లోని షుగర్ స్థాయిలను అదుపులో పెట్టుకుంటూ ఉండాలి.  లేదంటే అనేక వ్యాధులు వచ్చే ప్రమాదముంటుంది. అవయవాలు దెబ్బతింటాయి.

షుగర్ వ్యాధికి ఇన్సులిన్ తీసుకుంటున్నారా .. ఇలా చేయకపోతే వెరీ డేంజరస్!


ప్రపంచ దేశాలతో పాటు మన దేశంలోనూ ఎక్కువమందిని వేధిస్తున్న దీర్ఘకాలిక వ్యాధుల్లో షుగర్ ఒకటి. ఒకసారి ఈ రోగం వచ్చిందంటే జీవితాంతం శరీరంలోనే ఉంటుంది. రక్తంలోని షుగర్ స్థాయిలు ఎప్పుడు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి.  కాబట్టి షుగర్ రోగులు బ్లడ్‌లోని షుగర్ స్థాయిలను అదుపులో పెట్టుకుంటూ ఉండాలి.  లేదంటే అనేక వ్యాధులు వచ్చే ప్రమాదముంటుంది. అవయవాలు దెబ్బతింటాయి.
అయితే ఈ షుగర్ స్థాయిలు అదుపులో పెట్టుకునేందుకు మందులు, ఇంజెక్షన్లు అని  చాలామంది వాడుతుంటారు. ముఖ్యంగా రోగం ముదిరిపాయినవాల్లు ఎక్కువమంది ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటూ ఉంటారు. కానీ ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరముంది.  లేకపోతే సమస్యలను ఎదుర్కొంటారు. 

ఇన్సులిన్‌ను ఇంట్లో ఎక్కబడితే అక్కడ అస్సలు పడేయకూడదు. ఫ్రిడ్జ్‌లో వైద్యులు సూచించిన ఉష్ణోగ్రతల స్థాయిల వద్ద ఉంచాలి. 
అలాగే పొట్టభాగంలోని బొడ్డుకి ఇరువైపుల ప్రాంతాల్లో ఇన్సులిన్ ఇంజక్షన్ చేస్తే మంచిదని డాక్టర్లు అంటున్నారు. దీని వల్ల శరీరంలోకి ఇన్సులిన్ బాగా వెళ్తుందట. బాగ్ పని చేస్తుందట. ఇంకా తొడ వెలుపలి, మధ్య భాగాల్లో కూడా ఇన్సులిన్ తీసుకోవచ్చు.
ఇన్సులిన్ పెన్స్‌ను వేరే ప్రాంతానికి తీసుకెళ్లేటప్పుడు టెంపరేచర్ మార్పుల వల్ల పాడైపోతూ ఉంటాయి. కాబట్టి బయటకు తీసుకెళ్లేటప్పుడు ఐస్ ప్యాక్‌లో  తీసుకెళ్లాలి
ఇన్సులిన్ ఇంజెక్షన్లలో అనేక రకాల ఇంజెక్షన్లు ఉంటాయి. అందులో  ర్యాపిడ్ యాక్టింగ్ ఇన్సులిన్ ఒకటి.  ఇది శరీరంలోకి వెళ్లిన కొద్ది నిమిషాలకే పనిచేయడం ప్రారంభిస్తుంది. కొద్ది గంటలపాటు ఇది శరీరంలోనే ఉంటుంది. ఇంకోటి షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్. ఇది తీసుకుంటే పనిచేయడానికి 30 నిమిషాలు పడుతుంది. ఇది మూడు నుంచి ఆరు గంటల పాటు శరీరంలో  ఉంటుంది. ఇంటర్మీడియట్ యాక్టింగ్ ఇన్సులిన్ అయితే తీసుకున్న రెండు నుంచి మూడు గంటల తర్వాత  పనిచేయడం ప్రారంభం అవుతుంది. ఇక లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ తీసుకుంటే ఒక రోజు మొత్తం పనిచేస్తుంది. 
ఇక పాతకాలం ఇన్సులిన్ ఇంజెక్షన్లను అయితే భోజనం చేయడానికి 20 నిమిషాల ముందు తీసుకోవచ్చు. 
కానీ కొత్త రకం షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ ఇంజెక్షన్లు అయితే ఆహారం తీసుకునేటప్పుడు లేదా తీసుకునే ముందు గుచ్చుకోవాలి. ఆహారానికి 20 లేదా 30 నిమిషాల ముందు తీసుకోవడం వల్ల 'లో షుగర్‌'కు దారితీస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ రోజులో ఎప్పుడైనా తీసుకోవచ్చు. కానీ ఒకరోజు పొద్దున లేదా ఒకరోజు రాత్రి తీసుకోకూడదు. 
అలాగే ఇన్సులిన్ మోతాదు ఎంత తీసుకోవాలనేది కూడా వైద్యులను అడిగి తెలుసుకోవాలి. ఎక్కువ డోస్ తీసుకుంటే ప్రమాదం. ఈ విషయంలో మాత్రం కచ్చితంగా వైద్యం సలహా అత్యవసరం.
అలాగే జిమ్‌లకు వెళ్లేవారు, ఇంట్లోనే వ్యాయామం చేసేవారు ఇన్సులిన్ తీసుకున్న వెంటనే వ్యాయామం చేయకూడదు. ఈ జాగ్రత్తలన్ని పాటిస్తేనే  ఇన్సులిన్ బాగా పనిచేస్తుందని డాక్టర్లు అంటున్నారు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.